NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. అవినాష్ పిటిషన్ పై నేటి మధ్యాహ్నం తర్వాత విచారణ చేపట్టి ఇరువర్గాల వాదనలు విన్నది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయనున్నారా అని ధర్మాసనం సీబీఐని ప్రశ్నించగా, సీబీఐ తరపు న్యాయవాది అవసరమైతే అరెస్టు చేస్తామని తెలిపారు. హైకోర్టు లో ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఇవేళ సీబీఐ విచారణకు హజరు కాలేదు.

ys Viveka Murder Case Telangana High court

 

అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది పలు కీలక విషయాలను ప్రస్తావించారు. కేవలం దస్తగిరి ఇచ్చిన కన్పెషన్ స్టేట్ మెంట్ తప్ప సీబీఐ దగ్గర అవినాష్ కు వ్యతిరేకంగా ఎలాంటి అధారాలు లేవని, పైగా దస్తగిరిని కూడా బెదిరించి ఆ స్టేట్ మెంట్ తీసుకుందని అవినాష్ తరపు న్యాయవాది వాదించారు. వివేకా హత్య కేసులో భాస్కరరెడ్డిని  అక్రమంగా అరెస్టు చేశారనీ, భాస్కరరెడ్డి పిటిషన్ పెండింగ్ లో ఉండగానే అరెస్టు చేశారని చెప్పారు. ఆయనను అరెస్టు చేయడానికి దస్తగిరి వ్యాంగ్మూలం తప్ప సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. దస్తగిరిని బెదిరించి చిత్రహింసలకు గురి చేసినట్లు ఎర్ర గంగిరెడ్డి చెప్పాడన్నారు. దస్తగిరి కూడా సీబీఐకి భయపడి భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డి లకు వ్యతిరేకంగా వ్యాంగ్మూలం ఇచ్చారన్నారు. వివేకా హత్యకు నాలుగు కారణాలు ఉన్నాయనీ, ఒకటి కుటుంబం, రెండోది వ్యాపార సంబంధాలు, మూడోది వివాహేతర సంబంధాలు, నాల్గోవది పొలిటికల్ గెయిన్ అని పేర్కొన్నారు. వీటిపై సీబీఐ ఫోకస్ పెట్టలేదన్నారు.

అలాగే అవినాష్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందని, రాజకీయ కోణంలో భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డిలను ఇరికించే కుట్రలో భాగమే ఇదంతా అని అవినాష్ తరపు న్యాయవాది వాదించారు. మరో పక్క వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ ను స్వీకరించిన నేపథ్యంలో అవినాష్ పిటిషన్ పై రేపు ఉదయం మరో సారి విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. అవినాష్ రెడ్డిని రేపు సాయంత్రం విచారణకు పిలవాలని సీబీఐకి ధర్మాసనం సూచించింది. కోర్టు సూచనల మేరకు అవినాష్ రెడ్డిని రేపు సాయంత్రం 4 గంటలకు విచారించేందుకు సీబీఐ అంగీకారం తెలిపింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి ధర్మాసనం వాయిదా వేసింది. దీంతో రేపు మధ్యాహ్నం లోపు అవినాష్ రెడ్డి పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉంది.

జగన్ పై హత్యాయత్నం కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా..జగన్ తరపు న్యాయవాది వాదనలు ఇలా..

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!