NewsOrbit
న్యూస్

ముగిసిన శ్రీలక్ష్మీ మహాయజ్ఞం .. అఖండ పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం జగన్

AP CM YS Jagan attends Akhanda Purnahuthi program Vijayawada

విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో గత వారం రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ముగిసింది. మహా యజ్ఞం ముగింపులో భాగంగా ఇవేళ అఖండ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ  పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. మహాలక్ష్మి అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజశ్యామల అమ్మవారు వేంచేసి ఉన్న వైఖానస యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. పరమ శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నల్లకలువలతో వేదంత్రోశ్చారణల మధ్య రుత్వికులు, ఘనాపాటీలు, పండితులు విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు.

AP CM YS Jagan attends Akhanda Purnahuthi program Vijayawada
AP CM YS Jagan attends Akhanda Purnahuthi program Vijayawada

 

కంచి నుండి ప్రత్యేకంగా తెప్పించిన స్వర్ణ ప్రతి రూపంలో ఉన్న అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేకంగా అభిషేకించారు. తొలుత పాంచరాత్ర యాగశాలలో పూర్ణాహుతికి వెళ్తూ మార్గ మధ్యలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పాదాలను జగన్ నమస్కరించి తనకు ఉన్న భక్తి, గౌరవాన్ని చాటుకున్నారు. కాగా యాగశాలలోకి సీఎం భద్రతా సిబ్బంది సాధారణ దుస్తుల్లో కాకుండా నీలం రంగు పంచెలతో ప్రవేశించి వారి విధులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర స్వామి, అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామిజీ, మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.

AP CM YS Jagan attends Akhanda Purnahuthi program Vijayawada

 

రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ నెల 12 నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నిర్వహించారు. మహాయజ్ఞం కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు ముఖ్యమంత్రి జగన్ యజ్ఞ సంకల్పం తీసుకున్న తర్వాత మహాయజ్ఞం ప్రారంభమైంది. సీఎం జగన్ గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన . కపిల గోవుకు హారతి ఇచ్చారు. అనంతరం అఖండ దీపారాధనలో జగన్ పాల్గొన్నారు. వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం ఆగమాలతో ఏర్పాటు చేసిన నాలుగు ప్రధాన యాగశాలల్లో యజ్ఞాలు నిర్వహించారు.

AP CM YS Jagan attends Akhanda Purnahuthi program Vijayawada

 

వారం రోజుల పాటు ఎంతో వైభవంగా యజ్ఞం జరిగింది. మొత్తం 108 కుండాలతో రుత్వికులు యజ్ఞ కార్యక్రమాలు జరిగాయి. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు..తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు యజ్ఞం కొనసాగింది. యజ్ఞం తొలిరోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, 13న ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, 14న అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి, 15న శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, 16న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు నిర్వహించారు.

సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైఎస్ అవినాష్ రెడ్డి .. సీజేఐ ధర్మాసనం ఏమన్నదంటే ..?

Related posts

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!