NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కర్నూలుకు వెళ్లిన ఎంపీ అవినాష్ రెడ్డి .. కర్నూలు ఆసుపత్రిలో తల్లికి చికిత్స

తన తల్లికి అనారోగ్యంతో ఉన్నారంటూ సీబీఐ విచారణకు డుమ్మా కొట్టిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుండి పులివెందులకు బయలుదేరిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి విచారణకు హజరు కాకుండా పులివెందులకు బయలుదేరిన విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు హైదరాబాద్ నుండి ఆయనను అనుసరించారు. అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తొలుత పులివెందులలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.

YS Avinash Reddy

 

లక్ష్మమ్మ వయస్సు, ఆరోగ్య పరిస్థితి దష్ట్యా మరింత మెరుగైన వైద్య సేవలు అవసమని అక్కడి వైద్యులు సూచించడంతో పులివెందుల నుండి హైదరాబాద్ బయలుదేరారు. అయితే విపరీతమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతలో లక్ష్మమ్మను మరింత దూరం ప్రయాణించడం సరికాదని భావించి మార్గమధ్యంలోని కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి పులివెందులకు బయలుదేరిన అవినాష్ రెడ్డి తల్లిని తీసుకువస్తున్న అంబులెన్స్ తో కలిసి కర్నూలుకు వెళ్లారు. కాగా అవినాష్ రెడ్డిని అనుసరిస్తూ  వెళ్లిన సీబీఐ అధికారులు కర్నూలు నుండి వెనుతిరిగినట్లు సమాచారం.

కాగా ఇవేళ ఉదయం సీబీఐ కార్యాలయం వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అవినాష్ రెడ్డి విచారణకు హజరు అవుతారన్న సమాచారంతో కోటి సీబీఐ కార్యాలయం వద్దకు అవినాష్ అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.  ఈ నేపథ్యంలో కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 గంటలకు అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉండగా చివరి నిమిషంలో తన షెడ్యుల్ ను మార్చుకున్నారు. తన తల్లి అస్వస్థతకు గురైయ్యారని సమాచారం రావడంతో సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చి పులివెందులకు బయలుదేరారు. అవినాష్ రెడ్డి ఈ నెల 16వ తేదీన, తర్వాత ఇవేళ విచారణకు వివిధ కారణాలతో గైర్హజరు కావడం పై సీబీఐ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella