NewsOrbit
Entertainment News ట్రెండింగ్ న్యూస్

Tipu Sultan Sword: సిగ్గు చేటు…ఎవడి సొమ్ము ఎవరు వేలం వేసుకుందురో…విశ్వదాభిరామ చూడర ఈ డ్రామా!!

Tippu Sultan Sword Sale: What rights does the British have to sell Tippu Sultan Sword in auction for 143 crores rupees?

Tipu Sultan Sword: తాజాగా లండన్ లో జరిగిన ఒక వేలం పాటలో బోన్హమ్స్‌ ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ అనే సంస్థ దక్షిణ భారత దేశం లో అత్యంత పేరు కలిగిన రాజులలో ఒకరైన టిప్పు సుల్తాన్ కి చెందిన ఒక ఖడ్గాన్ని సుమారు అక్షరాల 143 కోట్ల రూపాయలకు వేలం పాటలో అమ్మేసింది. ఇంత పైకంకి అమ్ముడుపోయిన ఈ టిప్పు సుల్తాన్ ఖడ్గం ప్రత్యేకత ఏమిటి? అసలు దీని ఖరీదు గురించి పక్కన పెడితే, అసలు మన దేశ సంపద అమ్మడానికి వారు ఎవరు?

2021లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగుంచికొని తిరిగి వొచ్చేప్పుడు సుమారు 150కు పైన మన దేశానికి చెందిన చారిత్రక కళాఖండాలు తనతో తీసుకువొచ్చాడు. ప్రస్తుత ప్రభుత్వం అధికారం లోకి రాగానే 2014లో చోళ సామ్రాజ్యానికి చెందిన నటరాజు, ప్రాచీన టెర్రకోట యక్షి శిల్పం లాంటి ఎన్నో అమూల్యమైన కళాఖండాలను ఇతర దేశాల నుండి వెనక్కి తీసుకు వొచ్చింది. అయితే ప్రభుత్వం ఈ ప్రక్రియ మీద దృష్టి సారించడం తగ్గించింది అనే చెప్పాలి, కోహినూర్ లాంటి వెలకట్టలేని భారత సంపద ఇంకా ఇతర దేశాలలోనే ఉండిపోయింది.

Tipu Sultan Sword Sale: What rights does the British have to sell Tipu Sultan Sword in auction for 143 crores rupees?
Tipu Sultan Sword Sale: What rights does the British have to sell Tipu Sultan Sword in auction for 143 crores rupees?

Tipu Sultan Sword Sale: బ్రిటీష్ దురాశ అహంకారం ఇంకా మనల్ని వీడలేదు

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో మార్పు కనబడుతుంది. ఉదాహరణకు నెథర్లాండ్స్ ని తీసుకోండి, ఒకప్పుడు నెథర్లాండ్స్ చేతిలో పాలింపబడిన ఇండోనేషియాకు సుమారు 1500ల పైన కళాఖండాలు తిరిగి ఇచ్చేసింది. అలాగే జర్మనీ ఫ్రాన్స్ లాంటి దేశాలు ఆఫ్రికా నుంచి దోచుకున్న వాటిలో విలువైన చారిత్రక సంపద తిరిగి ఇచ్చేసింది. కానీ ఎంత విమ్మర్శ ఎదురుకున్నా బ్రిటీష్ ప్రభుత్వాలు మాత్రం మన దేశం నుండి దోచుకున్న సంపద తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఇన్ని సంవత్సరాలు గడిచిన బ్రిటీష్ దురాశ అహంకారం ఇంకా మనల్ని వీడలేదు అనే చెప్పాలి.

ఇంగ్లాండ్ కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం ఈమధ్యలో జరిగిన విషయం గుర్తుందా? ఆ రోజు క్వీన్ కెమిల్లా తన కిరీటం ధరించలేదు. ఎందుకంటే ఆ కిరీటంలోనే ఉంది మన కోహినూర్ వజ్రం. కోహినూర్ వజ్రం ఉన్న కిరీటం పెట్టుకుంటే భారతీయుల మనోభావాలు దెబ్బతింటాయి అనే భయం తో ఆ పని చేయలేదు. ఈ రోజుకు కూడా కోహినూర్ తమదే అనేది బ్రిటీషర్ల వాదన. బ్రిటీషర్ల అక్రమ ఆధిపత్యం దౌర్జన్యంకి చిహ్నంగా నిలిచిపోయింది కోహినూర్ వజ్రం. అది మన దేశం చేరాలి అనే కళ నిరవేరేది ఎప్పుడో మరి.

ఇప్పుడు టిప్పు సుల్తాన్ ఖడ్గం మళ్ళీ పాత గ్యాపకాలను గుర్తు చేస్తుంది

బోన్హమ్స్‌ ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ తాజాగా వేలం వేసిన టిప్పు సుల్తాన్ ఖడ్గం కూడా బ్రిటీష్ దౌర్జన్యానికి చిహ్నం. సుమారు 143 కోట్లకు అమ్ముడుపోయిన టిప్పు సుల్తాన్ ఖడ్గం గుర్తు తెలియని వ్యక్తి వేలం పాటలో సొంతం చేసుకున్నాడు. అసలు మన దేశ రాజుకు చెందిన సంపద వేలం వేసుకోవడానికి వీరు ఎవరండీ?

మేజర్ జనరల్ బైర్డ్

టిప్పు సుల్తాన్ చరిత్ర తెలిసిన వారు ఎవరైనా అతను ఆంగ్లుల పాలనకు మన దేశం లో వారు పాల్పడుతున్న దోపిడీకి వ్యతిరేకంగా చేసిన యుద్ధాల గురించి తెలుసు. నెపోలియోన్ లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని స్వేచ్ఛ కోసం చేసిన పోరాటం అంతా ఇంతా కాదు, బ్రీతిషేర్స్ ని ఎదురుకోవడానికి ఫ్రెంచ్ సహాయం తో ఆధునిక యుద్ధ పరికరాలు నియమాలు కూడా తన సైన్యానికి పరిచయం చేసాడు టిప్పు సుల్తాన్. అయితే చివరికి అదే బ్రిటీషర్ల చేతిలో వీర మరణం పొందాడు. ఇందుకు బ్రిటీషర్ల తరుపున ముఖ్య పాత్ర పోషించింది
మేజర్ జనరల్ బైర్డ్. ఇందుకు బహుమతిగా అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ జనరల్ బైర్డ్ కు విలువైన టిప్పు సుల్తాన్ ఖడ్గం బహుమతిగా ఇచ్చింది. అయితే టిప్పు సుల్తాన్ దెగ్గరనుంది దోచుకున్న వాటిలో ఈ ఖడ్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది, ఎటు చూసిన బ్రిటిష్ కుట్ర ఇంకా మరణ భయం, ఇలాంటి సమయంలో తనను తాను కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ఈ ఖడ్గం చేయించుకున్నాడు టిప్పు సుల్తాన్. ప్రతి రోజు తన పడక గదిలో ఒక ఊయల మీద రెండు పిస్టల్స్ మరియు ఈ ఖడ్గం పట్టుకుని పడుకునేవాడు టిప్పు ది టైగర్ అఫ్ మైసూర్. అలాంటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ఖడ్గం వేలం వేయడానికి వీరెవరు అని ఈ వార్త తెలిసిన చాలా మంది భారతీయుల మనోవేదన.

 

 

 

Related posts

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri