NewsOrbit
Entertainment News OTT

Bhuvana Vijayam OTT Review: వాచ్ ఆర్ స్కిప్? అమెజాన్ ప్రైమ్ లో సునీల్ వెన్నెల కిషోర్ తెలుగు సినిమా భువన విజయం చూడాలా వొద్దా?

Bhuvana Vijayam OTT Review Amazon Prime: Should you watch or skip Bhuvana Vijayam movie on Amazon Prime?

Bhuvana Vijayam OTT Review: శ్రీకృష్ణదేవరాయల భువన విజయంలో ఎనిమిది మంది మహా కవులు ఉండేవారు. భువన విజయం అనేది ఒక మంచి పేరు కదా అందుకని ఆపేరుతో సినిమా అన్నమాట. దానికీ దీనికీ పోలికేంటి అంటే ఈ భువన విజయం సినిమాలో ఏడుగురు రచయితలున్నారు. అదన్నమాట. సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా భువన విజయమ్. ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. హాస్యభరిత చిత్రంగా వచ్చిన ఈ సినిమా ఓటీటీ లో చేరింది.

కొంచం కథలోకి వెళ్తే ఆటో డ్రైవర్ యాదగిరి(ధనరాజ్) చనిపోవడంతో అతని ఆత్మని తీసుకెళ్లడానికి ఇద్దరు యమదూతలు భూమ్మీదకు వస్తారు. అయితే, అంతలో మరికొద్ది గంటల్లో నిర్మాత చలపతి (గోపరాజు రమణ) ఆఫీస్ లో మరో వ్యక్తి కూడా చనిపోతాడు అని చిత్రగుప్తుని నుంచి వార్త వస్తుంది . మరోపక్క నిర్మాత చలపతి, ఫీలింగ్ స్టార్ ప్రీతమ్ కుమార్(సునీల్)తో మరో సినిమాని ప్లాన్ చేసే ఏర్పాట్లలో ఉంటాడు. దాంతో కథలు వినడానికి రచయితలను పిలుస్తారు. మొత్తం ఏడుగురు రచయితలూ కథలు చెప్తారు. అయితే ఆ కథా రచయితలంతా అదే ఆఫీస్ లోని ఒక గదిలోకి ప్రవేశించి ఒక కథను ఖరారు చేయాలి. ఈ ఏడుగురు రైటర్స్ లో ఒకరు చనిపోతారని, ఆ ఆత్మని తమ తో పాటు తీసుకెళ్ళాడనికి యమదూతలు సిద్ధం అవుతారు. ఇంతకీ చనిపోయే ఆ రెండో వ్యక్తి ఎవరు?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ. ఒక ఏడుగురు రచయితలు ఒక కథను ఖరారు చేసేలా నాటకం ఆడడం, ఈ గోలంతా కొంచం గమ్మత్తుగా ఉంటుంది. సునీల్ కి ఆఫీస్ బాయ్ లకు మధ్య నడిచే కామెడీ ట్రాక్ కొంత మేరకు ఆకట్టుకుంతుంది . మానసిక రుగ్మత కలిగిన హీరోగా సునీల్ మంచి నటనా పరిణితిని చూపించి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

Bhuvana Vijayam OTT Review Amazon Prime: Should you watch or skip Bhuvana Vijayam movie on Amazon Prime?
Bhuvana Vijayam OTT Review Amazon Prime: Should you watch or skip Bhuvana Vijayam movie on Amazon Prime?

అలాగే శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, పృథ్వీ రాజ్, ధనరాజ్, గోపరాజు రమణ, వైవా హర్ష, సోనియా చౌదరి, స్నేహల్ కామత్ తమ పనిని చక్కగా చేసారు. మనకున్న మంచి పరిణతి ఉన్న హాస్య నటులలో వెన్నెల కిషోర్ ఒకరు. ఆయన ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అలాగే ధనరాజ్, గోపరాజు రమణ తమ పాత్రల్లో జీవించారు. రాజ్ తిరందాసు, వాసంతి, సత్తిపాండు తమ పాత్రలకు న్యాయం చేశారు.

భువన విజయంలో కదా వస్తువు బాగున్నా కథను నడిపే విధానం చాలా బలహీనంగా ఉంది. అలాగే కధనం ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకొనేలా లేదు. కథకు అవసరం లేని చాలా సన్నివేశాలు ఉండటం ప్రధాన సమస్య. అనవసరమైన సన్నివేశాలలో ఏమీ పస కూడా లేదు వాటిని కేవలం కామెడీ కోసమే అతికించినట్లు అనిపిస్తుంది. అలాగే దర్శకుడు యలమంద చరణ్ కూడా తన కధ కంటెంట్‌ని తెర మీద జనాల మనసుకి నచ్చేలా చూపడంలో కొంత మాత్రమే సఫల మయ్యాడు.

SPY OTT: చాలా సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన నిఖిల్ “స్పై” మూవీ..!!

చాలా ఆసక్తికరమైన అంశాలను జతచేసి సినిమాను మరింత ఆసక్తికరంగా ను ఉత్కంఠభరితంగాను తీసి ఉండ వచ్చు అనిపిస్తుంది. వినోదానికీ హాస్యానికీ ఇంకా చాలా అవకాశం ఉన్నా వాడుకోలేదు. అందువలన దర్శకుడు సినిమాను ఆ విధంగా తీయడం పూర్తిగా విజయాన్ని పొందలేదు. అలాగే, కొన్ని సన్నివేశాలు అతిగా చేయడం వల్ల కథ సహజత్వం కోల్పోయేలా చేసింది. చాలా మంది హాస్యనటులు ఉన్నప్పటికీ, హాస్యం అక్కడక్కడా జల్లినట్లుగా ఉంది. సమర్థులైన నటులతో ఇంకా బాగా తీ సేఅవకాశం అయితే మాత్రం పోయిందని చెప్పాలి.
శేఖర్ చంద్ర సంగీతం ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. బాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హాయిగా ఉంది. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే కూడా బావున్నాయి .

Hatya Movie Review: విజయ్ ఆంటోని అందించిన అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్…కూర్చున్న చోటే కట్టిపడేసే కథ కథనం! Sony Liv Upcoming Movie

చివరిగా చెప్పాలంటే ఈ సినిమా బలాలు కామెడీ, సస్పెన్స్ సీన్లు, మ్యూజిక్, క్లైమాక్స్
బలహీనతలు ఫస్టాప్ స్లో, సాగదీత, అక్కడక్కడ టెన్షన్ టెన్షన్. అతి తక్కువ బడ్జెట్ లో ఇంతమాత్రం చక్కగా ఒక హాస్య చిత్రాన్ని ఇచ్చిన నిర్మాతలు, దర్శకుడు అభినందనీయులు. అంచేత మన సునీల్ సినిమా కాబట్టి ఓసారి తప్పక చూడాలి మరి.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella