NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili ఆగస్టు 2 ఎపిసోడ్ 414: గౌతమ్ మల్లి మధ్య చిగురిస్తున్న ప్రేమ…మరోవైపు మారిన అరవింద్ ప్రవర్తన చూసి ఆనందంలో మాలిని!

Malli Nindu Jabili Today Episode August 2 2023 E414 Highlights Written Update

Malli Nindu Jabili ఆగస్టు 2 ఎపిసోడ్ 414: అలసిపోయి ఇంటికి వచ్చిన అరవింద్ మల్లి అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. మల్లి నిండు జాబిలి ఈ రోజు ఆగస్టు 2 2023 ఎపిసోడ్ 414 ఇలా మొదలవుతుంది … అరవింద్ ఇంత లేట్ అయింది ఎందుకు? అత్తయ్య వాళ్ళందరూ ఫంక్షన్ కి వెళ్లారు నన్ను రమ్మని రిక్వెస్ట్ చేశారు కానీ నేను నీ కోసం ఉండిపోయాను, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి రా ఇద్దరం కలిసి భోజనం చేద్దాం మనం కలిసి తిని చాలా రోజులు అయింది అని మాలిని అరవింద్ తో అంటుంది. నాకు ఆకలిగా లేదు మాలిని అని అరవిందు అంటాడు. ఎందుకు అదోలా ఉన్నావ్ ఆఫీసులో ఏమైనా అయిందా అని మాలిని అడిగింది. నథింగ్ ఏమి లేదు మాలిని అని అంటాడు అరవింద్.

Malli Nindu Jabili Today August 2 2023 Episode 414 Highlights
Malli Nindu Jabili Today August 2 2023 Episode 414 Highlights

నీ కోసమే ఎదురు చూస్తున్నాను నీకోసమే ఫంక్షన్ కి వెళ్లకుండా ఉన్నాను తీరా చూస్తే నువ్వు ఇలా చేస్తున్నావు అని మాలిని అంటుంది. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయ్ మాలిని, నన్ను వదిలేయ్ ప్లీజ్ అని అరవింద్ వెళ్లిపోబోతాడు. మాలిని అరవింద్ చేయి పట్టుకొని నువ్వు ఆ మళ్లీ గురించి ఆలోచిస్తున్నావు కదూ నేను నీకు అవసరం లేదు నేను ఈ ఇంట్లో ఒక వస్తువునే అని మాలిని అంటుంది. చెబుతుంటే ఎందుకు విసిగిస్తావు మాలిని అని గట్టిగా అరుస్తూ వెళ్లిపోబోతాడు అరవిందు.

Malli Nindu Jabili Today Episode August 2 2023 E414 Written Update
Malli Nindu Jabili Today Episode August 2 2023 E414 Written Update

నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అని మాలిని వెనకాల వస్తుంది అక్కడే పగిలి పోయి ఉన్న గాజు ముక్క తన కాలికి గుచ్చుకుంటుంది అమ్మ అంటూ మాలిని అరుస్తుంది. ఏమైంది మాలిని అంటూ అరవిందు వెనుకకు తిరిగిచూస్తాడు మాలిని పట్టుకొని సోఫాలో కూర్చో పెడతాడు కాలికి ఉన్న గాజువాక తీసేసి బ్లీడింగ్ ఆగట్లేదు అనిమాలిని ఎత్తుకొని వచ్చి మంచం మీద కూర్చోబెట్టి తన కాలికి కట్టు కడతాడు సారీ మాలిని అని అరవింద్ అంటాడు.నాకు గాయమైనప్పుడల్లా నువ్వు ఇంత ప్రేమగా చూసుకుంటావు అనిపిస్తే రోజుకు ఒక గాయం అయినా భరిస్తాను అరవింద్ అని మాలిని అంటుంది. నావల్ల నీ మనసుకు అయిన గాయాలు చాలు అని అరవింద్ అంటాడు.

Malli Nindu Jabili Serial Today Episode August 2 2023 E414 Highlights
Malli Nindu Jabili Serial Today Episode August 2 2023 E414 Highlights

నువ్వు చూపించిన ప్రేమ ముందు గాయానికైనా బాధ అంత పెద్దది అనిపించడం లేదు మనిద్దరం బాగుండాలంటే ఆ మల్లి ని నీ మనసులో నుంచి డ్రాప్ చేయాలి అని మాలిన అంటుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మల్లి మీద నాకున్నది ఒక ఆడపిల్లతన కాళ్ళ మీద తాను నిలబడాలని మాత్రమే అని ఉండు భోజనం తెస్తాను అని వెళ్లి భోజనం తెచ్చి మాలినీకి తినతాడు తినిపించాక పడుకో మాలిని అని అంటాడుఅరవిందు. కట్ చేస్తే అమ్మ టెన్షన్ గా ఉంది అని నీలిమ అంటుంది. ఎందుకమ్మా అని కౌసల్య అడిగింది. ఎందుకంటే అన్నయ్యకు తెలియకుండా స్వప్న చీర ఒకటి తీసి ఇచ్చి మల్లి ని కట్టుకొని రమ్మన్నావు అది స్వప్న కి సంబంధించిన చీర అని మళ్లీ కి కూడా చెప్పలేదు చెప్పుంటే మాత్రం మల్లి అసలు తీసుకునేది కాదు ఎందుకంటే గతంలో మల్లి స్వప్నకు సంబంధించిన బ్రాస్లైట్ టచ్ చేసినందుకే మల్లి మీద అన్నయ్య చాలా ఫైర్ అయ్యాడు ఆ భయం మల్లి కి ఇంకా ఉండే ఉంటుంది ఇప్పుడు అన్నయ్య చీరను చూస్తే ఎంత రచ్చ చేస్తాడ .

Malli Nindu Jabili Serial Today August 2 2023 Episode 414 Highlights
Malli Nindu Jabili Serial Today August 2 2023 Episode 414 Highlights

గౌతమ్ కి మళ్లీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవడానికి ఇచ్చాను అని కౌసల్య ఉంటుంది. అమ్మ ముందు అన్నయ్య వచ్చాడు ఏం జరుగుతుందో ఏమో అని నీలిమ నువ్వు టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టకు అని కౌసల్ అంటుంది. ఎక్కడికి బయలుదేరారు అని గౌతమ్ అంటాడు. నిరుపమా ఆంటీ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది అక్కడికే బయలుదేరాం మల్లి ని కూడా తీసుకు వెళుతున్నాంరెడీ అయ్యి వస్తుంది రా అని కౌసల్ అంటుంది. సరే నాకు బయట వర్క్ ఉంది నేను బయలుదేరుతున్నాను అని గౌతమ్ అంటాడు. సరే బ్రో నువ్వెళ్ళు అని నీలిమ అంటుంది.

Malli Nindu Jabili Today Episode August 2 2023 E414 Highlights
Malli Nindu Jabili Today Episode August 2 2023 E414 Highlights

ఇంతలో మల్లి చీర కట్టుకొని కిందికి వస్తుంది బాసు గారు ఈ చీర మేడమే ఇచ్చింది ఈ చీరలో నేను ఎలా ఉన్నాను అని మల్లి గౌతమ్ ని అడుగుతుంది. మల్లికి చీరలు లేవురా అందుకే స్వప్న కోసం నువ్వు తీసిన చీర మల్లికి ఇచ్చాను అని కౌసల్య ఉంటుంది. ఇది స్వప్న కోసం తీసిన చీర మరి నాకెందుకు ఇచ్చారు నాకు ముందే తెలిసి ఉంటే నేను తీసుకునే దాని కాదు అని మల్లి టెన్షన్ పడుతుంది.

Malli Nindu Jabili August 1 Episode 413: మల్లి భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకున్న మీరా శరత్…గౌతమ్ గురించి మల్లి అరవింద్ మధ్య వాదన!

Malli Nindu Jabili Today Episode August 2 2023 Episode 414 Written Update
Malli Nindu Jabili Today Episode August 2 2023 Episode 414 Written Update

గౌతమ్ దగ్గరకు వచ్చి నువ్వు ఈ చీరలో బాగానే ఉన్నావు నువ్వు అప్పుడప్పుడు చీరలు కట్టుకోవచ్చు అని అంటాడు. అవునా బాస్ గారు అని మల్లి సంతోష పడిపోతుంది. అక్కడి నుండి గౌతమ్ వెళ్ళిపోతాడు బయటికి వెళ్లిన గౌతమ్ నీలిమ కీస్ తీసుకురా అని అంటాడు.నీలిమ తెచ్చి మల్లి కి ఇచ్చి ఇది అన్నయ్యకి ఇచ్చి రా అని మల్లి ని పంపిస్తుంది మల్లి తాళం చేయి తీసుకునే నడుచుకుంటూ వస్తుంది అక్కడ కాలుజారి పడబోతుంటే గౌతం పట్టుకుంటాడు.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella