NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh: ఢిల్లీకి ఏపీ సీఐడీ అధికారులు .. నేడో రేపో లోకేష్ అరెస్టు..?

Nara Lokesh: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇటు ఏసీబీ కోర్టులో, అటు హైకోర్టులో ఒకే రోజు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. చంద్రబాబు తరపున దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మరో పక్క ఏసీబీ కోర్టు చంద్రబాబును రెండు రోజుల సీఐడీ కస్టడీ విచారణకు అనుమతి ఇచ్చింది. ఊహించని ఈ పరిణామంతో టీడీపీ ఒక్కసారిగా ఖంగుతిన్నది. మరో పక్క ఏపీ సీఐడీ అధికారుల బృందం ఢిల్లీకి బయలుదేరిందన్న వార్తలు రావడంతో నేడో రేపో నారా లోకేష్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినబడుతున్నాయి.

nara lokesh

ఇప్పటికే సీఐడీ చీఫ్ సంజయ్ ఇంతకు ముందు మీడియా సమావేశంలో లోకేష్ పాత్రపైనా విచారణ జరుపుతున్నామన్నారు. దాంతో బ్రాహ్మణి కూడా అదే మాట అనడంతో లోకేష్ అరెస్టుపై టీడీపీ వర్గాలు మానసికంగా సిద్దం అయినట్లుగా కనబడుతోంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన లోకేష్ అక్కడ న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు. మరో పక్క పలువురు జాతీయ నేతలను కలిశారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై పలు జాతీయ మీడియా సంస్థలోనూ మాట్లాడారు. ఏపీకి వస్తే సీఐడీ అధికారులు అరెస్టు చేస్తారనే లోకేష్ ఢిల్లీలో ఉన్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. స్కిల్ స్కామ్ తో పాటు ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసుల్లోనూ నారా లోకేష్ పై ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు.

కానీ ఇంత వరకూ లోకేష్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చకపోవడంతో ముందస్తు బెయిల్ తీసుకునే అవకాశం లేదు. సీఐడీ అధికారులు ఆ అవకాశాన్ని ఇవ్వకుండా చంద్రబాబు మాదిరిగానే ముందుగా అదుపులోకి తీసుకుని ఆ తర్వాత ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేస్తారని టీడీపీ  వర్గాలు అనుమానిస్తున్నాయి. వైసీపీ రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాయని టీడీపీ అంటోంది. లోకేష్ కూడా అరెస్టునకు సిద్దమయ్యే ఉన్నారనీ, అయితే ఢిల్లీలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తే అది జాతీయ స్థాయిలో హైలెట్ అవుతుందన్న ఆలోచనతోనే అక్కడ ఉన్నారని అంటున్నారు.

ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తో పాటు మరో ఎస్పీ, ఇద్దరు సీఐ స్థాయి అధికారులు, నలుగురు కానిస్టేబుళ్లు ఢిల్లీకి పయనమయ్యారని వార్తలు వినబడుతున్నాయి. ఇటువంటి కేసులను ఎక్కువగా శని, ఆదివారాల్లో చేస్తుండటంతో లోకేశ్ అరెస్టు కుడా నేడో రేపో ఉండవచ్చనే మాట వినబడుతోంది. సీఐడీ అ విధంగా స్టెప్ తీసుకుంటుందా లేదా అనేది తెలియాలంటే ఒకటి రెండు రోజులు ఆగాల్సి ఉంది.

Chandrababu Arrest: చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ .. సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు పచ్చజెండా

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!