Anchor Jhansi: యాంకర్ ఝాన్సీ అందరికీ సుపరిచితురాలే. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా బుల్లితెరపై వెండితెరపై రకరకాల పాత్రలు చేస్తూ తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. జెమినీ టీవీలో టాక్ ఆఫ్ ది టౌన్ అంటూ ఝాన్సీ చెప్పిన అప్పట్లో సినిమా ముచ్చట్ల కార్యక్రమం చాలా మందిని ఆకట్టుకుంది. ఆ తర్వాత సందడే సందడి, బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర, బ్లాక్, కో అంటే కోటి, లక్కు కిక్కు, నవీన, చేతన, స్టార్ మా పరివార్ ఇలా రకరకాల కార్యక్రమాలతో బుల్లితెర లో తన అద్భుతమైన యాంకరింగ్ తో ఎంతోమంది అభిమానం సంపాదించింది. బుల్లితెర పాపులారిటీతో సినిమా ఇండస్ట్రీలో ఎగిరే పావురమా సినిమాతో అవకాశాలు అందుకుని ఇటీవల వాల్తేరు వీరయ్య, నారప్ప, F2, మల్లేశం సినిమాలలో అద్భుతమైన నటన ప్రదర్శించింది. దాదాపు 50 పైగా సినిమాలలో నటించింది.
ఇక ఝాన్సీ వ్యక్తిగత జీవితం చూస్తే ఎన్నో విషాదాలతో పాటు విజయాలు కూడా ఉన్నాయి. తెలుగు నటుడు కమెడియన్ జోగినాయుడు తో 9 సంవత్సరాలు పాటు ప్రేమలో ఉండి అతనితోనే.. జీవనం సాగించింది. వీరిద్దరికీ పాప కూడా ఉంది. కానీ పెళ్లయిన తర్వాత సంవత్సరం కూడా కలిసి లేరు. పాప పుట్టిన తర్వాత ఇద్దరు విడిపోయారు. ఈ క్రమంలో భర్త జోగినాయుడు తన కూతురిని వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో కోర్టులో వీరు కేసు గత కొంతకాలంగా నడిచింది. అయితే పాప చిన్నప్పుడు తల్లిదగ్గర పెద్దయిన తర్వాత తండ్రి దగ్గర ఉండాలని న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో వారానికి ఒకసారి పాపని తల్లి చూసుకునే అవకాశం కూడా న్యాయస్థానం ఇచ్చింది. n అదేవిధంగా తండ్రికి కూడా పాపను వారంలో ఒకసారి చూసుకునే అవకాశాన్ని అంతకుముందు కల్పించింది. ఒక గంట మాత్రమే అవకాశం వెసులుబాటు దొరకడంతో ఝాన్సీ ఇంటికి వెళ్లి అప్పట్లో జోగి నాయుడు కూతురిని చూసుకునేవాడు.
కొద్దిగా కొన్ని నిమిషాలు ఎక్కువ చూడాలన్న ఝాన్సీ అప్పట్లో చూడనిచ్చేది కాదట. ఈ క్రమంలో కూతురిని చూడటానికి జోగినాయుడు స్కూల్ పరిసరాల దగ్గరికి వెళ్లేవాడంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక జోగినాయుడుకి ఏపీ క్రియేటివిటీ కల్చర్.. కమిషన్ హెడ్ గా నియమించడం జరిగింది. ఈ క్రమంలో భారీ ఎత్తున వేతనం ఇంకా అలవెన్సులు వస్తున్న నేపథ్యంలో తాజాగా జోగినాయుడు రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. తన బంధువుల్లో ఉన్న అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అంట. అయితే ఈ వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అవుతున్న గాని తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!