NewsOrbit
జాతీయం టాప్ స్టోరీస్ ట్రెండింగ్ ప్ర‌పంచం

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

Special story on International Day of the Girl Child What is the theme of 2023 Its history

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి ఏడాది అక్టోబర్ 11న నిర్వహిస్తారు. సమాజంలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, అనర్థాలు నివారించడానికి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పెంచుతుంది. లింగం ఆధారంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలపై అవగాహన పెంచుతుంది. ఈ అసమానతలలో విద్య, పోషకాహారం, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, వివక్ష, మహిళలపై హింస, బాల్య వివాహాలు, రక్షణ వంటి రంగాలు ఉంటాయి. అయితే అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఎలా ఏర్పడింది? దీని చరిత్ర ఏమిటి? ఇప్పటివరకు ఎలాంటి థీమ్ ఇచ్చారు? తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Special story on International Day of the Girl Child What is the theme of 2023 Its history
Special story on International Day of the Girl Child What is the theme of 2023 Its history

ఎలానార్ రూజ్‌వెల్ట్ పుట్టిన రోజే..

అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్ రూజ్ వెల్ట్ మహిళల ఆత్మగౌరవం కాపాడటం కోసం అనేక పోరాటాలు చేశారు. ఆయన చేసిన కృషి వల్లే ప్రస్తుతం మనం అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్త్రీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా ‘మెన్’ అనే పదాన్ని తొలగించి ‘పీపుల్’గా మార్చారు. బాలిక స్వేచ్ఛ, హక్కులపై ఆయన పోరాటానికి గుర్తుగా అతడి పుట్టిన రోజైన అక్టోబర్ 11ను అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 2012 అక్టోబర్ 11న మొదటి సారిగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపబడింది. ప్రపంచ వ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలప, వివక్షపై అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం.

Special story on International Day of the Girl Child What is the theme of 2023 Its history
Special story on International Day of the Girl Child What is the theme of 2023 Its history

చరిత్ర ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలిక దినోత్సవం రోజు అవగాహన కల్పిస్తుంది. ప్రపంచ అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రణాళికలలో బాలికలను చేర్చడం, వారి సమస్యలను కూడా పరిష్కరించడం వంటి పనులు చేస్తుంటారు. వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ అందించిన వివరాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 62 మిలియన్లకు పైగా బాలికలకు సరైన విద్య అందడం లేదు. 5-14 సంవత్సరాల వయసు గల బాలికలు ఇంటి పనులకే పరిమితం అవుతున్నారు. అబ్బాయిల కంటే 160 మిలియన్ గంటలకు పైగా ఇంటి పనుల కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు. నలుగురు బాలికల్లో ఒకరికి 18 ఏళ్ల వయసులోపే వివాహం జరుగుతోంది. వీటిని నిర్మూలించడానికి, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అందరికీ అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. బాలికలను విద్యావంతులు చేయడం, బాల్య వివాహాలను అరికట్టడం వంటి పనులు చేస్తుంది. బాలికలకు మార్గదర్శకంగా నిలవడం ద్వారా మహిళల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు.

Special story on International Day of the Girl Child What is the theme of 2023 Its history
Special story on International Day of the Girl Child What is the theme of 2023 Its history

ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించే ప్లాన్ ఇంటర్నేషనల్ అనే ఒక ప్రభుత్వేతర సంస్థ ప్రాజెక్టుగా ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవం’ ప్రారంభమైంది. ప్లాన్ ఇంటర్నేషనల్ రూపొందించిన ‘బికాజ్ ఐ యామ్ ఎ గర్ల్’ అనే క్యాంపెయిన్ నుంచి అంతర్జాతీయ దినోత్సవ నిర్వహణ, వేడుకలు, ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఇది ముఖ్య అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బాలికలను సంరక్షించేలా అవగాహన పెంచుతుంది. కెనడాలోని ప్లాన్ ఇంటర్నేషన్ ప్రతినిధులు కెనడియన్ ఫెడరల్ ప్రభుత్వాన్ని సంప్రదించి మద్దతు కల్పించాలని కోరింది. బాలిక హక్కులపై అంతర్జాతీయంగా అవగాహన పెంచుతూ చివరికి ఐక్యరాజ్య సమితిని కూడా ఇందులో పాల్గొనాలని కోరింది. ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కెనడా తన తీన్మానంతో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని అధికారికంగా ప్రతిపాదించింది. కెనడా మహిళా మంత్రి రోనా అంబ్రోస్ ఈ తీర్మానానికి మద్దతు తెలిపారు. 55వ ఐక్య రాజ్య సమితి సమావేశంలో మహిళల స్థితిగతులపై మద్దతుగా మహిళలు, బాలికల ప్రతినిధి బృందం ప్రదర్శనలు చేసింది. 2011 డిసెంబర్ 19న జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో అంతర్జాతీ బాలికా దినోత్సవాన్ని తీర్మానించారు. దీనికి అందరూ మద్దతు తెలిపారు. దాంతో అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Special story on International Day of the Girl Child What is the theme of 2023 Its history
Special story on International Day of the Girl Child What is the theme of 2023 Its history

2023 థీమ్?

ప్రతి ఏడాది అంతర్జాతీయ బాలిక దినోత్సవం రోజు ఒక ప్రత్యేక థీమ్‌తో వేడుకలు ప్రారంభం అవుతాయి. 2023 నాటికి ‘Invest in Girls Rights: our Leadershipp, Our Well-being’ అనే థీమ్‌తో ముందుకు వచ్చారు. 2012లో మొదటి సారిగా ‘Ending Child Marriage’ అనే థీమ్‌ను ఉపయోగించారు.

Related posts

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju