Bigg Boss Nayani Pavani: బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 విజయవంతంగా కొనసాగుతోంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు షాకులు, ట్విస్టులు ఇస్తూ బిగ్‌బాస్ షో ప్రజలను ఎంటర్‌టైన్ చేస్తూ వస్తోంది. ఊహించని విధంగా ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో కొందరు కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్లే భోలే సావళి, నయని పావని, పూజ, అశ్విని శ్రీ, అర్జున్ అంబటి, పూజా మూర్తి ఉన్నారు. వాళ్లలో ప్రేక్షకులకు తెలిసిన వారు ఒకరిద్దరు మాత్రమే. ఆ లిస్ట్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, టిక్‌టాక్ స్టార్ నయని పావని ఒకరి. పాతికేళ్ల ఈ హాట్ బ్యూటీ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె ఏ ఏ సినిమాల్లో నటించింది?

నయని పావని తెలంగాణ వాసి. 1998 ఆగస్టు 4న హైదరాబాద్‌లో జన్మించింది. చిన్నప్పటి నుంచి నయని పావనికి యాక్టింగ్‌పై మక్కువ ఎక్కువ. అందుకే సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కరోనా టైం పీరియడ్‌లో టిక్ టాక్‌లో అడుగు పెట్టిన ఈ భామ.. మంచి గుర్తింపునే తెచ్చుకుంది. టిక్ టాక్ ద్వారా ఫ్యాన్ ఫాలొయింగ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, నటిగా మంచి గుర్తింపు పొందుతున్నారు. షార్ట్స్ ఫిల్మ్, కవర్ సాంగ్స్‌లో నటించారు. ‘ఎంత ఘాటు ప్రేమ, కేరాఫ్ అనకాపల్లి, పెళ్లి చూపులు 2.0, మిత్రమా, బబ్లూ వర్సెస్ సుబ్బులు’ వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు. అలాగే ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ డ్యాన్స్ షాలో అలరించారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘చిత్తం మహారాణి, సూర్యకాంతం’ వంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు పెద్దగా గుర్తింపు పొందలేదు. అందానికి అందం, దానికి మించిన టాలెంట్ ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ సోషల్ మీడియాలో నయని పావనికి ఫాలొయింగ్ ఎక్కువే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 688కే ఫాలొవర్స్ ఉన్నారు.

తాజాగా ఈ బ్యూటీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చూడటానికి ఎంతో హాట్‌గా ఉండే నయని పావని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ భామతో బిగ్‌బాస్ ఎలాంటి లవ్ ట్రాక్ నడిపిస్తాడో వేచి చూడాలి. హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూనే పల్లవి ప్రశాంత్‌లో లవ్ ట్రాక్ నడుపుతానని బాంబు పేల్చింది. అయితే హౌస్‌లో కండలు తిరిగిన కంటెస్టెంట్లు ఉన్నారు. వారితో ఈ భామకు లవ్ ట్రాక్ సెట్ అయితే.. మళ్లీ హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ మాములుగా ఉండని నెటిజన్లు అంటున్నారు. ఇలాంటి తరుణంలో మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్‌గా నయని పావని వాళ్ల నాన్న మృతి చెందారు. ఆమె తండ్రి మరణించినప్పుడు నయని పావని దారుణమైన ట్రోలింగ్‌కు గురయ్యారు.

నయని తండ్రి మృతి.. దారుణమైన ట్రోల్..
2022 డిసెంబర్ 31న శనివారం నయని పావని తండ్రి కన్నుమూశారు. అప్పుడు నయని ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చింది. ఆమె పోస్టులో.. ‘ఒక్క జన్మలోనే 100 జన్మల ప్రేమను అందించావు. కానీ, నాకు అది సరిపోదు. ఇంకా కావాలి నాన్న. ఈ బాధని నా నుంచి ఎవరూ తీసుకోలేరు. నాకు అయిన పెద్ద గాయమిది. దీన్ని ఎవరూ నయం చేయలేరు.’ అని రాసుకొచ్చింది. ఈ క్రమంలో ఒక ఫోటోను షేర్ చేసింది. చాలా మంది నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా ఉండాలని కామెంట్లు చేశారు. మరికొందరు తండ్రి చనిపోయిన బాధ ఎక్కడా కనిపించడం లేదని, తండ్రి చనిపోతే ఇలాంటి ఫోటోలు పెట్టవని కామెంట్లు చేశారు. సింపతి కోసం డ్రామాలు ఆడుతున్నావని దారుణంగా ట్రోల్ చేశారు. తండ్రి చనిపోయినప్పటికీ ఆమె గ్లామరస్ ఫోటోలతో మరింతగా రెచ్చిపోయింది. అందాలను ఆరబోస్తూ.. ప్రేక్షకులను మరింతగా ఎంటర్‌టైన్ చేసింది. ఆమె ఫోటోలు, వీడియోల్లో ఎక్కడా బాధపడుతున్న కనిపించలేదు. దాంతో ఆమెపై ట్రోలింగ్ ఆగలేదు.