NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana TDP: తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే పోటీ .. క్లారిటీ ఇచ్చేసిన కాసాని  

Telangana TDP: తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్ధులను బరిలోకి దించి .. ప్రచారం కూడా ప్రారంభించాయి. కానీ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉండటంతో తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుంది, క్యాడర్ కు తాను అండగా ఉంటాననీ, ప్రచారం చేస్తానని నెల రోజుల క్రితం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ .. ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపే చూడలేదు. అభ్యర్ధుల ఎంపికై దృష్టి పెట్టలేదు. తన సినిమా షూటింగ్ బిజీలో మునిగిపోయారు. దీంతో తెలంగాణ టీడీపీలో స్తబ్దత నెలకొంది.

ఓ పర్యాయం తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజమండ్రి సెంట్రల్ జైల్ కు వచ్చి చంద్రబాబుతో ములాఖత్ అయి వచ్చారు. ఒక సారేమో మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, మరో సారేమో 89 స్థానాల్లో పోటీ చేస్తామనీ అంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ తరుపున పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్న నాయకులు దరఖాస్తులు కూడా చేసుకున్నారని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీలో పొత్తులో ఉన్న జనసేన పార్టీ తెలంగాణలో టీడీపీతో పొత్తు లేకుండా బీజేపీతో కలిసి పోటీ చేస్తుండటంతో..ఇక టీడీపీ ఎన్నికల బరిలో ఉండదని ప్రచారం జరిగింది.

tdp acting president nandamuri bala krishna
nandamuri bala krishna

టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా టీడీపీని వీడి అధికార బీఆర్ఎస్ లో చేరనున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. నిన్నటి వరకూ ఈ వార్తలపై ఆ పార్టీ స్పందించకపోవడంతో రకరకాలుగా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న ప్రచారంపై కాసాని క్లారిటీ ఇచ్చారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శనివారం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో పార్టీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. తెలంగాణలో పోటీపై చంద్రబాబుతో చర్చించినట్లు చెప్పారు కాసాని. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఆదివారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నది వెల్లడిస్తామని తెలిపారు.

ఏ పార్టీతో పొత్తు లేదని, ఒంటరిగానే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు కాసాని. తెలంగాణలో టీడీపీ పరిస్థిత చాలా  బాగుందనీ.. ఆమాటకొస్తే ఏపీ కంటే తెలంగాణలోనే చాలా బాగుందంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు కాసాని. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారం అంతా మీడియా సృష్టేనని అన్నారు. తన దృష్టిలో టీడీపీ మాత్రమే బెస్ట్ అని అన్నారు. ఇక రాజకీయ నేతల్లో నారా చంద్రబాబు బెస్ట్ అని వ్యాఖ్యానించారు. కాసాని వ్యాఖ్యలతో మొత్తానికి టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీపై ఒక క్లారిటీ వచ్చినట్లు అయ్యింది.

Telangana BJP: బీజేపీపై తీవ్ర అసంతృప్తితో కీలక నిర్ణయాన్ని ప్రకటించిన బాబూమోహన్

Related posts

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar