NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP MP Vijayasai Reddy: ‘ఆ ఇద్దరి విలువలు లేని రాజకీయాలకు ఇది నిదర్శనం’

YCP MP Vijayasai Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. నామినేషన్ల పర్వానికి ముందే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు అయిన నారా చంద్రబాబు ఆనాడు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న నేపథ్యంలో ఆ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

అయితే తెలంగాణ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీకి అధికారికంగా మద్దతు ప్రకటించలేదు తెలుగుదేశం పార్టీ. దీంతో టీడీపీ సానుభూతిపరులు, నేతలు అక్కడి స్థానిక పరిస్థితుల మేరకు వారికి నచ్చిన నాయకులకు మద్దతు తెలియజేస్తూ ఆయా పార్టీల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తో కలిసి పోటీ చేస్తొంది. అయితే గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఉన్న టీడీపీ సానుభూతిపరులు కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాల్లో తెలుగుదేశం పార్టీ జండాలతో అక్కడి కార్యకర్తలు పాల్గొంటున్నారు.

నిన్న (శనివారం) ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అగ్రనాయకులు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా, ఆ ప్రచారంలో పలువురు టీడీపీ జెండాలతో పాల్గొన్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు, దగ్గుబాటి లను మరో సారి విమర్శించారు. ప్రియాంక గాంధీ ర్యాలీలో టీడీపీ వాళ్లు జెండాలు పట్టుకుని పాల్గొనడానికి సిగ్గుండాలన్నారు. చంద్రబాబు, పురందేశ్వరి ల విలువలు లేని రాజకీయాలకు ఇది నిదర్శనమని అన్నారు. బీజేపీలో ఉంటూ టీడీపీ బాగా ఊదుతున్న పురందేశ్వరి తమ బావ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ తో జత కట్టడం పై ఏమంటారో మరి సెటైర్ వేశారు విజయసాయిరెడ్డి.

PM Narendra Modi: నేడు తిరుపతికి ప్రధాని మోడీ .. స్వాగతం పలకనున్న సీఎం జగన్

Vijayasai Reddy

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju