NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi November 28 2023 Episode 265: రాహుల్ రుద్రాణిని మీద కావ్య అనుమానం?కళ్యాణ్ మనసులో కూడా అప్పు..? రేపటి సూపర్ ట్విస్ట్..?

Brahmamudi Today Episode Serial 28 November 2023 Episode 265 Highlights

Brahmamudi November 28 2023 Episode 265:  నిన్నటి ఎపిసోడ్ లో, రాజ్ కావ్య తో స్వప్న గురించి, స్వప్న వ్యక్తిత్వం గురించి తప్పుగా మాట్లాడుతాడు అది విని కావ్యకి చాలా కోపం వస్తుంది ఎలాగైనా మా అక్క, ఈ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని రాజ్ కి సవాల్ విసురుతుంది కావ్య. అప్పు బాధపడుతూ ఉంటుంది అప్పు బాధ చూడలేక కనకం, ఏదో ఒక విధంగా అప్పు బాధ తీర్చాలి అనుకుంటుంది ఇక కళ్యాణ్తో అప్పుని కలిపితే ఎలా ఉంటుంది అని అన్నపూర్ణ అని సలహా అడుగుతుంది అన్నపూర్ణ చివాట్లు పెడుతుంది. స్వప్న దగ్గరికి కావ్య వచ్చి అరుణ్ గురించి అడుగుతుంది. అరుణ్ గురించి స్వప్న చెప్పిన మాటలు విని అక్క చెల్లెలు ఇద్దరికీ అరుణ్ వెనకాల ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారు అని అనుకుంటారు. కావ్యకి రాహుల్ రుద్రాణిల మీద అనుమానం వస్తుంది. తీగలాగడం మొదలుపెట్టింది.

Brahmamudi Today Episode Serial 28 November 2023 Episode 265 Highlights
Brahmamudi Today Episode Serial 28 November 2023 Episode 265 Highlights

ఈరోజు ఎపిసోడ్ లో, కనకం అన్నపూర్ణ తో మాట్లాడుతూ ఉంటుంది. నేను చెప్పేది ఒకసారి విను కనుక నువ్వు ఇప్పుడు పిచ్చి పనులు ఏమీ చేయొద్దు అని అన్నపూర్ణ తిడుతూ ఉంటుంది. అది కాదక్కా దాని మనసులో కళ్యాణ్ ఉన్నాడు. అది జీవితాంతం సంతోషంగా ఉండలేను అని అంటుంది. దాని సంతోషానికి తల్లినైనందుకు నేను ఏదో ఒకటి చేయాలి కదా అని అంటుంది కనకం. అయితే నువ్వు ఇప్పుడు స్వప్న, కావ్యల గురించి ఆలోచించవా అని అంటుంది అన్నపూర్ణ. ఒకసారి ఒక తప్పు చేసి స్వప్నని ఆ ఇంట్లో చేర్చడానికి ఎన్ని అబద్ధాలు చెప్పావు మర్చిపోయావా, స్వప్న పెళ్లి చేయడానికి కావ్యతో అబద్ధం చెప్పించే ఆ పీటల మీద ఎక్కించావు ఆ తర్వాత స్వప్నని పంపించావు అప్పుడు నువ్వు ఎన్ని మాటలు పడ్డావు వాళ్ళు నిన్ను మాటలు అన్నారు మర్చిపోయావా అని అన్నపూర్ణ కనకంకి గుర్తుచేస్తుంది.

Krishna Mukunda Murari: భవానీని నీలదీసిన మురారి.. ముకుంద మురారిన పెళ్లి ఆపడానికి నందు స్కెచ్ ..

Brahmamudi Today Episode Serial 28 November 2023 Episode 265 Highlights
Brahmamudi Today Episode Serial 28 November 2023 Episode 265 Highlights

కృష్ణమూర్తి వార్నింగ్..

ఇక అన్నపూర్ణ కనకం ఇద్దరు అలానే మాట్లాడుకుంటూ ఉంటారు. కనకం అన్నపూర్ణ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నేను చెప్పేది ఒకసారి విను ఆరోజు అంటే, వేరు, స్వప్న ఆ రాహుల్ ని ఇష్టపడిందనే కదా మనం ఇదంతా అదంతా చేసింది. అయినా అప్పు నీలా చూస్తూ నేను ఊరుకోలేకపోతున్నాను అక్క అప్పు మనసులో కళ్యాణి ఉన్నాడు. అని కనకం అనగానే అన్నపూర్ణ ఆ కళ్యాణ్ కి వేరే వాళ్లతో పెళ్లి జరుగుతుంది. అన్నా మీకు తో పెళ్లి ఫిక్స్ చేశారు. అనామిక కళ్యాణ్ ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు ఆ విషయాన్ని మర్చిపోయావా కనకం అని అంటుంది అన్నపూర్ణ. నిజమే నేను ఇప్పుడు ఆ విషయం గురించి కాదు అనేది, మన అప్పు ఎలాగైతే ఆ కళ్యాణ్ బాబుని ప్రేమిస్తుందో ఆ కళ్యాణ్ బాబు కూడా మన అప్పుని ప్రేమిస్తున్నాడేమో మన అప్పు మనకి చెప్పకుండా మనసులో ఎలా దాచిపెట్టుకుందో ఆ కళ్యాణ్ బాబు కూడా మనసులో దాచి పెట్టాడేమో అప్పు మీద ప్రేమని అది మనకు తెలిస్తే సరిపోతుంది కదా ఈ పెళ్లి చేయడానికి అని అంటుంది. అప్పుడే అక్కడికి కృష్ణమూర్తి వచ్చి కనకం అని పెద్దగా అరుస్తాడు ఇక కృష్ణమూర్తిని చూసి కనకం భయపడుతుంది. ఒకసారి గా షాక్ అవుతుంది కృష్ణమూర్తి ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా కనకం అని అరుస్తాడు. ఒకసారి నువ్వు చేసిన తప్పుకి ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాము. నువ్వు చెప్పిన అబద్ధాలతో స్వప్న పెళ్లి చేయడం వల్లే, అక్కడ నా కూతురు కావ్య ఎన్ని బాధలు పడుతుందో నీకు ఇప్పటికీ తెలుసు అయినా కానీ ఇంకో కూతురు నా ఇంటికి పంపించాలని ఎలా మాట్లాడుతున్నావ్ కనకం అని అంటాడు కృష్ణమూర్తి. నీకు ఒకసారి చెప్పాను మళ్లీ చెప్తున్నాను నువ్వు ఇంతకుముందు కనకనలాగ మారవద్దు మళ్లీ అబద్ధాలు మొదలు పెట్టొద్దు. అయినా ఆడపిల్లకి నచ్చ చెప్పాలి పేదవాళ్ళం గాలిలో మెడల్లాగా మన కోరికలు కూలిపోతాయి అని దానికి నచ్చ చెప్పాల్సింది పోగొట్టి నువ్వే ఆకాశంలో మెడలు కడతావా అని కృష్ణమూర్తి అంటాడు. చాలా ఆవేశంగా చాలా కోపంగా కనకానికి వార్నింగ్ ఇస్తాడు. ఇకమీదట నువ్వు చేసే ఏ పనైనా నాతో చెప్పే చేయాలి ఇకమీదట నువ్వు కదలికలన్నీ నాకు తెలియాలి అలాగని కాదు నేను అంతకుముందు లాగే ఉంటాను అని అనుకునేటట్లయితే నేను నీ వయసులో నిన్ను వదిలి పెట్టేసి బయటికి పంపించేసి నా తల కడిగేసుకుంటాను. నీకు నాకు ఇక సంబంధం ఉండదు అన్నట్టుగా కనకానికి వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలుకి కనకం ఒక్కసారిగా షాక్ అయ్యి అలానే ఉండిపోతుంది కృష్ణమూర్తి వారిని ఇచ్చే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నపూర్ణ ఇలాంటి ఆలోచనలు ఏమీ చేయొద్దు అని కనకానికి చెప్పి వెళ్ళిపోతుంది.

Naga Panchami November 27 2023 Episode 211: శోభనం ఆపడానికి గ్రామ దేవత చేసిన పని…

Brahmamudi Today Episode Serial 28 November 2023 Episode 265 Highlights
Brahmamudi Today Episode Serial 28 November 2023 Episode 265 Highlights

 

అక్కకి భరోసా ఇచ్చిన చెల్లి..

ఇక స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది అదే టైం కి కావ్య గదిలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇలా ఎన్నిసార్లు చేస్తావు అక్క అని అంటుంది. అసలే నేను చాలా బాధలో ఉన్న ఇప్పుడు నువ్వు వచ్చి మొదలు పెట్టకు అని అంటుంది స్వప్న. బాధలో ఉన్నావా అలాగని అనిపించట్లేదు అని అంటుంది కావ్య, అంటే ఏంటి ఇప్పుడు నేను బాధగా కూర్చుని ఏడవట్లేదు అని అంటుంది స్వప్న. బాధగా కూర్చుని ఏడ్చే దానివి అయితే అసలు అరుణ్ గాడికి డబ్బులు ఎందుకు ఇస్తావు అని అంటుంది కావ్య, నాకేం తెలుసు వాడు ఇలాంటి పనులు చేస్తాడని అంటుంది స్వప్న. నీకు ముందే చెప్పాను కదా అక్క వాడి గురించి ఏదైనా చేసే ముందు నాతో ఒక మాట చెప్పు అని ఈ ఇంట్లో నీకే సమస్య వచ్చినా అది నా మెడకు కూడా చుట్టుకుంటుంది ఆ విషయం నీకు అర్థం కావట్లేదు ఇది నీ ప్రాబ్లం మాత్రమే కాదు నా ప్రాబ్లం కూడా అని అంటుంది కావ్య. వెంటనే స్వప్న కావ్య వైపు చూస్తూ ఉంటుంది అవునక్కా నువ్వు విన్నది నిజమే అని అంటుంది కావ్య. అసలు నేను వాడికి డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో మీ అందరికీ అక్కడే చెప్పాను కదా వాడు నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు ఆ ఫొటోస్ అన్నీ బయటపెడతా అన్నాడు అందుకే డబ్బులు ఇచ్చాను ఇక్కడితో ఆ సమస్య తీరిపోతుంది అనుకున్నాను కానీ ఇంత గొడవ అవుతుంది అనుకోలేదు. అయినా అరుణ్ గాడి గురించి నీకు కూడా తెలుసు చిన్నప్పటినుండి నీకు తెలిసిన వాడే కాలేజీలో ఉన్నప్పుడు నాతో ఎలా ఉండేవాడు. రాహుల్ తో నా పెళ్లి జరగడానికి కూడా వాడే హెల్ప్ చేశాడు తర్వాత ఫేక్ ప్రెగ్నెన్సీ, రిపోర్టు కూడా వాడే ఇచ్చింది. అలాంటిది వాడి లాంటి పనులు చేస్తాడంటే నాకు నమ్మబుద్ధి కాలేదు అని అంటుంది స్వప్న వెంటనే కావ్యకి ఆలోచనలో పడుతుంది. నువ్వు చెప్తుంది నిజమే అక్క అరుణ్ గురించి మనందరికీ తెలిసిందే కానీ వాడు ఎందుకు ఇలా మారాడు, వాడు అంతటివాడే మారాడా లేదంటే ఇంకెవరైనా వాడి వెనక ఉండి ఇలా చేయించారా అని అంటుంది. అదంతా నాకెలా తెలుస్తుంది కావ్య అని అంటుంది స్వప్న. తెలుస్తుంది అక్క తెలుసుకోవాలి నేను తెలుసుకుంటాను అని అంటుంది కావ్య. నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించు టైం కి అన్ని తిను ఈ టైం లో నీకు ఏదైనా తినాలనిపిస్తే నాతో చెప్పు నేను వండి పెడతాను. ఆ కారున్ గాడి గురించి నువ్వు మర్చిపో నేను వాడి గురించి ఆలోచించి అసలు దీనంతటికీ కారణం ఎవరో కనిపెడతాను అని అంటుంది కావ్య. స్వప్న కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది.

Madhuranagarilo November 27 2023 Episode 220: శ్యామ్ కి పెళ్లయిందని తెలుసుకున్నారు రుక్మిణి ఏం చేస్తుంది…

Brahmamudi Today Episode Serial 28 November 2023 Episode 265 Highlights
Brahmamudi Today Episode Serial 28 November 2023 Episode 265 Highlights

రాహుల్ రుద్రాణిణి ని నిలదీసిన కావ్య..

ఇక రాహుల్ రుద్రనే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడైనా ఆఫీసుకు బయలుదేరుతున్నావా లేదా అని అంటుంది. ఏంటి మామ్ ఇప్పుడు వెళ్లి ఆ రాజ్ కింద నన్ను సర్వెంట్లా పని చేయమంటావా అని అంటాడు రాహుల్, రాజేంద్దకేదాకా శకుని కూడా, ఒకరికిందా పనే చేశాడు రా అని అంటుంది వెంటనే పోల్చేది కూడా విలన్స్ తోనే పోల్చలా మామ్ అని అంటాడు. నువ్వు ముందు వెళ్ళు ఆ రాజ్ ని ఫాలో అవ్వు అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది. ఏంటి రుద్రనే గారు మీ కొడుక్కి మా ఆయన్ని ఫాలో అవమని చెప్తున్నారా అని అంటుంది. నేను ఎవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని అంటాడు రాహుల్, అవునవును మీ గురించి నాకు తెలియదా అని అంటుంది కావ్య. సంతక కంపెనీ ఇస్తే దాని లాస్ట్ లోకి తీసుకురావడం మీ టాలెంట్ అని నాకు తెలుసు కదా అంటుంది కావ్య. నా కొడుకు సంగతి పక్కన పెట్టు ముందు మీ అక్క గురించి ఆలోచించు ఎవరికో కడుపు చేసుకొని అది నా కొడుక్కి తలకి చుట్టాలని చూస్తుంది ముందు దాని సంగతి కనుక్కో అని అంటుంది రుద్రాణి. మా అక్క గురించి మీరు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదు మా అక్క ఎలాంటిదో నాకు బాగా తెలుసు అని అంటుంది కావ్య. అవును ఎందుకు తెలియదు ఇద్దరూ కలిసి శ్రీమంతం నాటకం ఆడారు కదా మీ ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి బానే తెలుసు అని అంటుంది రుద్రాణి. మా గురించి పక్కన పెట్టండి మీకు అసలు, మా అక్క అరుణ్ కి డబ్బులు ఇచ్చిన విషయం ఆ ఫోటోలు మీకే ఎలా వచ్చాయి అని అడుగుతుంది. ఒకసారి గా రుద్రాణి, రాహుల్ ఇద్దరు షాక్ అవుతారు. అవి మాకు పంపించారు అని అంటాడు రాహుల్. అదే ఎవరు పంపించారు అసలు మీకే పంపించాల్సిన అవసరం ఏముంది. కరెక్ట్ గా మా అక్క ఇంటికి వచ్చేలోపే ఫొటోస్ మీ చేతికి ఎలా వచ్చాయి అని అంటుంది కావ్య తీగలాగడం మొదలుపెట్టింది. ఇక రుద్రాణి ఏం చెప్పాలో తెలీక అలానే తడబడుతూ ఉంటుంది రాహుల్ ఏదో ఒకటి చెప్పి పంపించేయాలి కాబట్టి కావాలంటే నీకు ఆ ఫొటోస్ పంపించిన వాడి నెంబర్ ఇస్తాను నువ్వే కనుక్కో వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాడు. అవునా వాడెవడో మీకు తెలియదా మీకు తెలియకుండానే మీకు ఫొటోస్ పంపించాడా అని అంటుంది కావ్య. అవును వాడెవడో మాకు తెలియదు కావాలంటే నీకు నెంబర్ వాట్సప్ చేస్తాను వెళ్లి వాడితో మాట్లాడుకో అని అంటాడు రాహుల్. కొడుకు ఎక్కడ పిచ్చి పని చేసి దొరికిపోతాడు అని రుద్రాణి టెన్షన్ పడుతూ ఉంటుంది. కావ్య సరే తెలుసుకుంటాగా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. రుద్రాణి నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా అని అంటుంది. నువ్వు టెన్షన్ పడకు మామ్. నాకు అన్నీ తెలుసు అరుణ్ గాడి నెంబర్ పంపించాను అరుణ్ నెంబర్ కావ్య దగ్గర కూడా ఉంటుంది కదా అని అంటాడు. ఇప్పుడు ఆ కావ్య ఊరుకుంటుంది అనుకున్నావా? ఆ నెంబర్ పట్టుకొని వాడి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది అని అంటుంది రుద్రాణి. మాట్లాడి నీ మామ్ ఈ లోపు నేను వెళ్లి మాట్లాడతాను కదా అని అంటాడు. నువ్వు తొందరగా వెళ్లి రాహుల్ ఆ కావ్య అరుణ్ ని కలిసేలోపే నువ్వు కలవాలి అని అంటుంది.

Nuvvu Nenu Prema: అత్తారింట్లో అల్లుడు కష్టాలు.. అరవింద కు దొరికిపోయిన కృష్ణ ఏం చేయనున్నాడు?

అప్పు ఇంటికి కళ్యాణ్ రాక..

కళ్యాణ్ అనామిక ఇద్దరూ కారులో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం షాపింగ్ కి వెళ్తున్నాం కదా, అప్పుని కూడా తీసుకువెళ్దాం అని అంటాడు కళ్యాణ్ ఎందుకులే అని అంటుంది అనామిక కాదు మనిద్దరిని చూస్తే అమాయకుల్లాగా కనిపిస్తాము వాడు ఇవ్వాల్సిన రైతన్న ఎక్కువ రేటు ఇస్తాడు అదే అప్పు ఉంది అనుకో మనకి కరెక్ట్ రేటు ఇస్తాడు 10 గంటల్లో చేయాల్సిన షాపింగ్ రెండు గంటల్లోనే కంప్లీట్ అవుతుంది అని కళ్యాణ్ అనగానే ఎప్పుడు అప్పుడే పొగుడుతుంటావా అని అంటుంది అనామిక అవును అందులో తప్పేముంది అసలు నీలాంటి అమ్మాయి నాకు పరిచయం చేసింది అప్పు కదా అని అంటాడు కళ్యాణ్. కారు అప్పు ఇంటి ముందు ఆగుతుంది అప్పటికే కనకం చాలా ఫీల్ అవుతూ ఒక పక్కన కూర్చొని ఉంటుంది అన్నపూర్ణ వచ్చి నువ్వు దిగులు పడినంత మాత్రాన దాని పెళ్లి జరగదు నువ్వు ఇలాంటి ఆలోచనలన్నీ మానేసేయి, అని చెప్తూ ఉండగానే కళ్యాణ్ లోపలికి వస్తాడు. అప్పు అప్పు అని పిలుస్తూ ఉంటాడు కళ్యాణి చూసి కనకం, అప్పు కోసం వచ్చాడు కదా అప్పు మీద కళ్యాణ్ కి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఏంటి బాబు అని అడుగుతుంది అప్పు లేదండి అంటాడు కళ్యాణ్ అప్పు గదిలోనే ఉంది బాబు ఎందుకో ఏమో బయటికి రావట్లేదు చాలా డల్ గా ఉంటుంది అని చెప్తుంది. అవునా అయితే నేను వెళ్లి మాట్లాడుతాను అని కళ్యాణ్ అప్పు గదిలోనికి వెళ్తాడు. గదిలోకి వెళ్లి కళ్యాణ్ లైట్ వేస్తాడు అప్పు డల్లుగా కూర్చొని ఉంటుంది ఎవరా అని చూస్తే కళ్యాణ్ అప్పు షాక్ అవుతుంది ఏందిరా బై ఇలా వచ్చావు అని అడుగుతుంది. నువ్వు ముందు బయటికి రా అని బయటికి లాక్కొస్తాడు నీకు ఎన్ని సార్లు చెప్పాను, అయినా ఇప్పుడు ఎందుకు నన్ను బయటికి తీసుకొచ్చావు నా మానానికి నన్ను వదిలేసేయ్ అని అంటుంది. ఏంటి అబ్బో నువ్వు ఒక్కదానివే గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటావా అయినా ఎలా ఉండే దానివి ఎలా అయిపోయావు ఏంటి ఇలా మారిపోయావు అని అంటాడు కళ్యాణ్. వెంటనే ఆ పూకి కోపం వస్తుంది నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటారా బై నీకేమైంది అని అంటుంది. అలా కాదు మనిద్దరం షాపింగ్ కి వెళ్దాం రా అనామిక కూడా బయట వెయిట్ చేస్తుంది మన ముగ్గురం కలిసి షాపింగ్ కి వెళ్లి వద్దాం అని అంటాడు. నేను ఎక్కడికి రాను అని అంటుంది అప్పు కనకం అన్ని గమనిస్తూ ఉంటుంది.

Brahmamudi Today Episode Serial 28 November 2023 Episode 265 Highlights
Brahmamudi Today Episode Serial 28 November 2023 Episode 265 Highlights
అప్పు మీద కళ్యాణ్ ప్రేమ?

అప్పు అన్ని సార్లు చెప్పినా గానీ కళ్యాణ్ వినిపించుకోడు. ఎలాగైనా అప్పుని షాపింగ్ తీసుకెళ్లాలి అని పట్టు పడతాడు ఇక అప్పు ని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి నేను చెప్పేది ఒకసారి విను అని అంటాడు. కనకం అన్నపూర్ణ ఇద్దరు అక్కడే నుంచొని చూస్తూ ఉంటారు కనకం ఏదో తెలియని ఆశ మనసులో మొదలవుతుంది. ఇక అప్పుతో కళ్యాణ్ చూడు బ్రో నువ్వు రాకముందు నా జీవితం వేరేలా ఉండేది. ఇదిగో నీలానే నువ్వేమో ఒక గదిలో కూర్చుని డల్లుగా ఉన్నావు నేనేమో మా తోటలో ఒక పెన్ను పేపర్ పట్టుకుని కూర్చుని ఉండేవాడిని, నువ్వొచ్చి బయట ప్రపంచం చూపించావు మనుషులు ఎలా ఉంటారో చూపించావు ఎలా మాట్లాడాలో నేర్పించావు అన్నీ నాకు నువ్వు నేర్పించి ఇవాళ నువ్వు డల్లుగా ఉంటానంటే నేను ఎలా ఊరుకుంటాను అని అంటాడు ఆ మాటలకి కనకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పు మీద కూడా కళ్యాణ్ కి ప్రేమ ఉంది అని కనకానికి అనిపిస్తుంది. చూడు బ్రో. నువ్వు ఇలా ఉంటే డల్లుగా నేను ఎలా ఉషారుగా ఉంటాను నువ్వు కూడా నాతో పాటు రా నువ్వు చాలా బెటర్ గా ఫీల్ అవుతావు నాతో పాటు షాపింగ్ కి వస్తే నీకు ఏదో ఒక రకంగా, ఈ డల్మూరులో నుంచి బయటికి వస్తావని బతిమలాడుతూ ఉంటాడు గడ్డం పట్టుకుని అప్పుడే అనామిక, కళ్యాణ్ వెళ్లి లోపలికి చాలా సేపు అయింది అని కళ్యాణ్ కోసం లోపలికి వస్తుంది వచ్చేసరికి అప్పు అని బతిమిలాడుతూ ఉంటాడు కళ్యాణ్ చాలా బాగుంది కళ్యాణ్ అని అంటుంది అనామిక. అక్కడేమో నన్ను కారులో కూర్చోబెట్టి ఇక్కడొచ్చి నీ ఫ్రెండ్ తో ముచ్చట్లు వేస్తున్నావా అని అంటుంది. అందులో తప్పేముంది అని అంటాడు కళ్యాణ్, తప్పుగా అక్క ఏముంది నన్ను వెయిట్ చేయమని చెప్పావు నేను ఎవరి కోసం వెయిట్ చేయను ఆ విషయం నీకు తెలుసు కదా అని అంటుంది అనామిక. కనకం ఒక్కసారిగా షాక్ అవుతుంది గట్టిగ అనామిక అరుస్తూ ఉంటుంది.

రేపటి ఎపిసోడ్ లో రాహుల్ అరుణ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటాడు. ఏంటి సార్ మీరు చెప్పేది ఆ కావ్య ఇక్కడికి వస్తుందా అని అంటాడు. ఏంటి అరుణ్ టెన్షన్ పడుతున్నావు వాళ్ళ అక్కకి అన్యాయం చేస్తే కావ్య ఊరుకుంటుందా అని అంటాడు రాహుల్, నేను చెప్పినట్టు చెయ్ అని రాహుల్ చెప్తూ ఉంటాడు అప్పుడే రాజ్ కావ్య ఇద్దరు అరుణ్ హాస్పిటల్ ముందు దిగుతారు. లోపలికి వెళ్లి అరుణ్ ఎక్కడ ఉంటాడు అని అడిగితే, స్ట్రైట్ గా వెళ్లండి అని చెప్తారు. రాజ్ కావ్య ఇద్దరు అరుణ్ క్యాబిన్ వైపు వెళ్తారు. కావ్య లోపలికి వెళ్లేసరికి, అక్కడ ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతుంది. రాహుల్ ని చూసిందా చూడలేదా తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri