Krishna Mukunda Murari: ముకుంద మురారి కి నేను పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ నిర్ణయం లో నాకు ఎవరైనా ఎదురు చెప్పాలని చూస్తే వాళ్ళకి కంట శోష తప్ప నా నిర్ణయం మారదు. హే కృష్ణవేణి నువ్వు కూడా ఈ విషయాన్ని మురారి కి చెప్పానని నాకు మాట ఇవ్వు అని భవాని మాట తీసుకుంటుంది. ఇక కృష్ణ బాధపడుతూ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. కృష్ణ కోసం ఎదురుచూస్తున్న మురారి తనని చూసి ఏదో ఆందోళనగా ఉందని అర్థం చేసుకుంటాడు.
తన దగ్గరకు వెళ్ళి మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారు అని అడుగుతాడు. ఏం లేదు అంతా బానే ఉంది అని కృష్ణ అంటుంది. మీరు టిఫిన్ చేశారా అంటే చేశాను అని కృష్ణ చెబుతుంది. మురారి తన నెత్తిమీద కృష్ణ చేతితో ఒట్టు వేయించుకొని ఇప్పుడు నిజం చెప్పండి అని అడుగుతాడు. సరిగ్గా తినలేదు అని కృష్ణ అంటుంది. అందుకే మీకోసం నేను టిఫిన్ తీసుకు వచ్చాను ఇది తినండి అని మురారి ఇచ్చి ఇప్పుడే వస్తాను అని వాళ్ళ ఇంటికి వెళ్తాడు.
అక్క మీరు తీసుకున్న నిర్ణయం గురించి మరోసారి ఆలోచించండి అని రేవతి అంటుంది. ఏంటి రేవతి అలా మాట్లాడుతున్నావు కృష్ణ మురారిలది చూడముచ్చనైన జంట. నాకు వాళ్ళిద్దరూ గురించి చాలా మంచి అభిప్రాయం ఉంది. కృష్ణ నందిని ఓ మంచి మనిషిగా మార్చి తన జీవితాన్ని బాగు చేసింది కానీ , ఒక్క విషయం చెప్పు మురారి చనిపోయాడని మనకి తెలిసిన, తనకి మురారి బ్రతికే ఉన్నాడని తెలుసు. ఆ నిజాన్ని మనకు ఎందుకు చెప్పలేదు డెడ్ బాడీని మన ఇంటికి పంపిస్తే ఎందుకు ఊరుకుంది. మీ కొడుకు ఫోటోకి దండ వేసిన కూడా నీకేం బాధ లేదా అని భవాని అడిగిన ప్రశ్నలకు రేవతి దగ్గర సమాధానం ఉండదు. మరియు మురారి కి గతం గుర్తుకు వస్తే అని రేవతి అడగగా అందుకేగా అమెరికా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసింది అని చెబుతుంది. అప్పుడే మురారి అక్కడికి వస్తాడు. వేణి గారిని మన ఇంటికి ఎందుకు పిలిచి బాధ పెట్టారు అని అంటాడు.
ఎందుకమ్మా అని నువ్వైనా చెప్పు అని మురారి అంటాడు. ఏంటి మురారి గొడవ పెట్టుకోవాలని వచ్చావా అని అడుగుతుంది. నేను తను చేసిన తప్పుని ఎందుకు చేశావు అని అడిగాను. తను సమాధానం చెప్పకుండా టిఫిన్ తినకుండా వెళ్ళిపోయింది కృష్ణ అని భవాని మురారి కి చెబుతుంది. మురారి నీకు నేను ఒక విషయం చెప్పాలి. అది మరో రెండు రోజుల్లో చెబుతాను అని భవాని అంటుంది. అదేదో ఇప్పుడే చెప్పమని మురారి అడుగగా.. ఇన్నాళ్లు ఆగవు కదా ఇంకో రెండు రోజులు ఆగు నిజం నికే తెలుస్తుంది అని అంటుంది. సరే అంటాడు మురారి. మరోవైపు నందు కృష్ణ తనకు చేసిన సహాయం గుర్తు చేసుకుని ఎలాగైనా మురారి కృష్ణ నీ కలపాలి అని అంటుంది. అందుకు గౌతమ్ కూడా ఓకే అంటాడు.ఇక మురారి కృష దగ్గరకు వెళతాడు. సార్ పెద్ద మేడం తో మీరు ఏమైనా గొడవ పడ్డారా అని అంటుంది లేదు అని మురారి అంటాడు. అయితే మీరు టిఫిన్ తినండి అని కృష్ణ అంటుంది. మీరు మొన్న నాకు తినిపించారు కదా నేను ఇప్పుడు మీకు తినిపిస్తా అని మురారి అంటాడు. సరే అని కృష్ణ అంటుంది. మురారి కృష్ణ కి ప్రేమగా అట్టు తినిపిస్తాడు కృష్ణ కూడా వరారీ ప్రేమ ఇలాగే శాశ్వతమై ఉండిపోతే బాగుండు అని మనసులో అనుకుంటుంది.
రేవతి మురారి జీవితం తల ముందే నాశనం అయిపోతుందని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ముకుందా అక్కడికి వెళ్లి చిన్న అత్తయ్య అని పిలుస్తుంది. నువ్వు అలా పిలవకు అలా పిలిస్తే కోపం వస్తుంది అని అంటుంది. ఎందుకు అత్తయ్య మీకు అంత కోపం మురారి చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు. మురారి గత జన్మలో కృష్ణ భార్య అయి ఉండొచ్చు కానీ , ఈ లైఫ్ లో మాత్రం నేనే మురారి కి భార్యను ఇది ఫిక్స్ మీరు కూడా ఫిక్స్ అవ్వండి అని ముకుందా స్ట్రాంగ్ గా చెబుతుంది. నీకు సిగ్గు లేదా అని రేవతి అంటుంది.
రేపటి ఎపిసోడ్ లో భవాని మురారి నీ పిలిచి మురారి నీకు గతం గురించి చెప్పకూడదని అనుకున్నాను మురారి కానీ ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నా గతం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఎక్సైజ్ మెంట్ గా ఉంది పెద్దమ్మ అని మురారి అంటాడు. నువ్వు గతంలో ప్రేమలో ఉన్నావు మురారి. నేను ఎవరి ప్రేమలో ఉన్నాను ఎవరిని ప్రేమించాను అని భవానిని ఉత్సాహంగా అడుగుతాడు మురారి. ముకుంద అని భవాని అనగానే మురారి గొంతు మూగబోతుంది.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!