NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: అత్తారింట్లో అల్లుడు కష్టాలు.. అరవింద కు దొరికిపోయిన కృష్ణ ఏం చేయనున్నాడు?

Nuvvu Nenu Prema 27 November 2023 today 478 episode highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతి, విక్కీ, ఇద్దరూ మాట్లాడుకునేలాగా అను ఆర్యాలు ప్లాన్ చేస్తారు. విక్కీని అప్పటికే పద్మావతి అపార్థం చేసుకుని ఉంటుంది. విక్కీ పద్మావతి తో, నేను మీ ఇంట్లో ఉంటూ మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడతాను అని అనుకున్నారు. మీ ఇంట్లో ఉండి మీకు ఇబ్బంది పెట్టే పని నేను ఎప్పటికీ చేయను మీ అమ్మని నాన్నని చూసుకునే బాధ్యత కూడా నాదే వాళ్లకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను నీ మీద ఉన్న కోపాన్ని వాళ్ళ మీద చూపించను అని విక్కీ పద్మావతి తో చెప్తాడు. విక్కీ నీ పద్మావతి అనవసరంగా అపార్థం చేసుకున్నందుకు బాధపడుతుంది. విక్కీ మనసు ఎలాగైనా మార్చాలి అని అనుకుంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema Today Episode 27 November 2023 Episode 478 Highlights
Nuvvu Nenu Prema Today Episode 27 November 2023 Episode 478 Highlights

ఈరోజు ఎపిసోడ్ లో, విక్కీ మనసు గెలుచుకోవడానికి పద్మావతి తిప్పలు పడుతూ ఉంటుంది. విక్కీ మంచం మీదే తను కూడా పడుకుందాం అనుకుంటుంది. అందుకు విక్కీ ఒప్పుకోడు. నేను కింద పడుకుంటాను అని చెప్తాడు కింద చాలా దోమలు ఉంటాయి అని చెప్తుంది పద్మావతి. మీరు ఆ దోమల్లో పడుకుంటే మీ ఇష్టం కింద ఎలుకలు కూడా చాలా ఉన్నాయి. పద్మావతి విక్కీని కావాలని భయపెట్టిస్తుంది ఎలాగైనా ఇద్దరు కలిసి ఒకే మంచం మీద పడుకోవాలి అని, విక్కీ అందుకు ఒప్పుకోడు పద్మావతి విక్కీని బయపెడుతూ ఉంటుంది.

Nuvvu Nenu Prema: అను ఆర్యాల ప్లాన్ సక్సెస్ అయినట్టేనా? పద్మావతి,విక్కీ ల మధ్య సఖ్యత కుదిరినట్టేనా?

Nuvvu Nenu Prema Today Episode 27 November 2023 Episode 478 Highlights
Nuvvu Nenu Prema Today Episode 27 November 2023 Episode 478 Highlights

దోమలతో యుద్ధం..

ఇక పద్మావతి విక్కీని, దోమలు ఎలుకలు ఉన్నాయని భయపెట్టడంతో విక్కీ నేను ఏసీ పెట్టించాను కదా ఇప్పుడు అది ఆన్ చేసామంటే అన్ని దోమలు పోతాయి అని అంటాడు. ముందు చల్లగా ఉంటుంది అప్పుడేనా పడుకోవచ్చు అని ఏసీ ఆన్ చేస్తాడు. కొంచెం సేపటికి ఏసీ కూలింగ్ వస్తుంది. చల్లగా హాయిగా పడుకోవచ్చు అని అనుకుంటున్నారా సారు ఇప్పుడు కరెంటు పోతే ఏం చేస్తారు అని పద్మావతి అంటుంది. ఆ మాట పూర్తవకుండానే కరెంటు పోతుంది. ఇక విక్కీకి పద్మావతిని చూసి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతోనే పద్మావతి వసూలు నువ్వు సైలెంట్ గా ఉండలేవా అని అంటాడు సారు నేను ఏదో మాట వరస కంటే కరెంటు పోతుందని అనుకోలేదు అని అంటుంది పద్మావతి. శ్రీనివాస, నేను ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అవుతుంది ఏంటి అని మనసులో అనుకుంటుంది. ఇక విక్కీకి దోమలు కుడుతూ ఉంటాయి ఇక పద్మావతి దోమలు చంపడానికి బ్యాట్ తీస్తుంది. ఈరోజు ఒక్కదాము కూడా నా చేతిలో మిగలదు అని మంచం ఎక్కి దోమలు అన్నిటిని టపా టపా కొడుతూ ఉంటుంది అయినా దోమలు విక్కిన కొడుతూనే ఉంటాయి నువ్వు ఏం చేస్తున్నావ్ పద్మావతి అని అడుగుతాడు మీకు దోమలు కొట్టకుండా చూస్తున్నాను సార్ అని అంటుంది. ఇంతలో విక్కి ముఖం మీద ఒక దోమ బాలుతుంది మా సార్ ముఖం మీద నువ్వు వెళ్తావా అని విక్కీని కొట్టబోతుంది పద్మావతి. వెంటనే విక్కీ ఇంకా చాలా ఆపు అని బ్యాట్ తీసుకుంటాడు దానికి చార్జింగ్ ఉండదు. ఏం చేస్తున్నావ్ పద్మావతి చార్జింగ్ లేని బ్యాట్ తీసుకుని దోమల్ని చంపాలని చూస్తున్నావా ఎలా చస్తాయి అని అంటాడు అయ్యో శ్రీనివాస్ ఎలా దొరికిపోయాను ఏంటి అని అంటుంది మనసులో, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటుంది పద్మావతి.

Brahmamudi November 25 Episode 263: రాహుల్ చెంప చెళ్లుమనిపించిన రుద్రాణి.. కావ్యాతో రాజ్ ఏంటి ఆ మాట అనేశాడు.?

Nuvvu Nenu Prema Today Episode 27 November 2023 Episode 478 Highlights
Nuvvu Nenu Prema Today Episode 27 November 2023 Episode 478 Highlights

అత్తారింట్లో అల్లుడు కష్టాలు..

ఇక అందరూ కరెంటు పోయిందని బయటికి వస్తారు ఆండాలు, పార్వతితో అయ్యో అల్లుడు ఇంట్లో ఉన్నప్పుడే కరెంటు పోవాలా ఇప్పుడు వాళ్ళు ఎలా నిద్రపోతారు పాపం వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినాయి అని అంటూ ఉంటుంది అప్పుడే భక్త అక్కడికి వస్తాడు. విక్కీ పద్మావతి కూడా రూమ్ లో నుంచి బయటికి వస్తారు. ఏదో ఒకటి చెయ్ రా తమ్ముడు, హల్లులు ఇబ్బంది పడుతున్నారు అని అంటుంది ఆండాలు ఏం చేస్తాం అక్క ఓవర్ లోడ్ అయ్యి కరెంటు పోయింది దానికి ఇప్పుడు మనం ఏం చేయలేము అని అంటాడు. అంటే ఏంటి అని అడుగుతుంది పార్వతి. ఆ అల్లుడుగారు ఏసి పెట్టించారు కదా దానివల్ల మన కరెంటు కన్నా ఎక్కువ లోడు ఎక్కువయ్యి కరెంటు మొత్తం పూర్తిగా పోయి వైర్లు కూడా కాలిపోయాయి అని అంటాడు ఆ మాటలన్నీ విక్కీ కూడా విని బాధపడతాడు. వెంటనే సారీ బాబు మీకు అసౌకర్యం కలిగింది ఇప్పుడు మీరు పడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అని అంటాడు భక్త వెంటనే విక్కీ అయ్యో మీరెందుకండి సారీ చెప్పడం నేనే మీకు సారీ చెప్పాలి మిమ్మల్ని అడక్కుండా ఏసీ పెట్టించాను అని అంటాడు. వెంటనే పద్మావతి తో పార్వతి ఇప్పుడు అల్లుడికి ఎలా పడుకుంటారు కరెంటు కూడా లేదు అని అంటుంది.

Brahmamudi November 25 Episode 263: రాహుల్ చెంప చెళ్లుమనిపించిన రుద్రాణి.. కావ్యాతో రాజ్ ఏంటి ఆ మాట అనేశాడు.?

Nuvvu Nenu Prema Today Episode 27 November 2023 Episode 478 Highlights
Nuvvu Nenu Prema Today Episode 27 November 2023 Episode 478 Highlights

పద్మావతి ఐడియా..

ఇటువంటినే పద్మావతి మీరంతా ఎందుకు ఇంత బాధపడుతున్నారు నేనున్నాను కదా మా ఆయన్ని నేను బాగా చూసుకుంటాను అని అంటుంది. వెంటనే ఆండాలు ఒసేయ్ తింగరి దాన నువ్వు ఎలా చూసుకుంటావో ఒకపక్క కరెంటు లేదు రూమ్లో గాలి రాదు, విక్కీకి దోమలు కుడతాయి ఎలా నిద్రపోతాడు నువ్వు విసిరితో కూర్చున్నా గాని తెల్లవారులు ఆయనకి నిద్రే ఉండదు అని అంటుంది. ఈ పద్మావతి ఒకసారి అనుకుంది అంటే అది చేసి తీరుతుంది అని అంటుంది పద్మావతి. నువ్వు ఏమనుకున్నావు అని అంటుంది పార్వతి అదంతా ఎందుకమ్మా మా ఆయన నేను చక్కగా చూసుకుంటాను ఆయన నిద్రపోయేలా నేను చేస్తాను కదా అని అంటుంది పద్మావతి. ఎలా అని అడగ్గాని మేడం మీద పడుకుంటే చక్కటి గాలి వస్తుంది అని అంటుంది. నేను మా ఆయనకి మేడం మీద మంచం వేసి వస్తాను అని అంటుంది. వెంటనే ఆండాలు విక్కీ తో మీరంటే మా పద్మావతికి చాలా ప్రేమ ఆ ప్రేమే తనను మిమ్మల్ని బాగా చూసుకుంటుంది అని అంటుంది. విక్కీ కూడా ఆలోచనలో పడతాడు.

Nuvvu Nenu Prema Today Episode 27 November 2023 Episode 478 Highlights
Nuvvu Nenu Prema Today Episode 27 November 2023 Episode 478 Highlights
అరవింద కు దొరికిన కృష్ణ..

ఇక అరవిందా రూమ్ లో బట్టలు సర్దుతూ ఉంటుంది అప్పుడే కృష్ణ ర్యాక్ లో నుంచి సబ్బు కింద పడుతుంది. పేపర్లో చుట్టి ఉండడంతో అరవింద ముందు ఏందో అనుకొని తీస్తుంది. అరవింద ముందు సబ్బును చూసి ఏంటి ఇక్కడ సబ్బు ఉంది బాత్రూంలో ఉండాల్సింది ఇక్కడ పెట్టారు ఎవరు అని అనుకుంటుంది. వెంటనే తిప్పి చూసేసరికి దానిమీద, తాళం ముద్ర ఉంటుంది. అది చూసి అరవింద షాక్ అవుతుంది ఏంటి ఎవరో అచ్చు వేశారు అని అనుకుంటుంది. ఇది ఎవరు ఇక్కడ పెట్టారా అని ఆలోచించే లోపే, కృష్ణ ఎదురుగా వచ్చి నిలబడతాడు. కృష్ణుని చూసి అరవింద ఇదేంటి అని అడుగుతుంది వెంటనే కవర్ చేయాలి అని కృష్ణ మనసులో అనుకుంటాడు అసలు అరవింద్ అనుమానం రాకూడదు అనుకుంటాడు. అయ్యో రానమ్మ ఇది నువ్వు తీసావ్ ఏంటి దీని మీద నీ ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా లాయర్ల కష్టాలు నీకు తెలిసినవే కదా ఇప్పుడు ఈ సబ్బు నేను వాదించే ఒక కేసులో కీలకమైన ఎవిడెన్స్ నువ్వు ఇలా టచ్ చేస్తే ఎలాగు అని తను తీసుకుంటాడు. వెంటనే అరవిందా కి అనుమానం వస్తుంది. ఇక సబ్బు తీసుకొని అరవింద్ అని డైవర్ట్ చేయాలని నాకు బాగా ఆకలిగా ఉంది రా నువ్వు అన్నం పెడుదువు గాని అంటాడు. అరవింద మీరు వెళ్లండి నేను వస్తున్నాను అని అంటుంది. కృష్ణ వెళ్లగానే అరవిందకు మనసులో అనుమానం వస్తుంది అంతకు ముందు కూడా ఒకసారి కృష్ణ విక్కీ రూమ్లో అరవిందకు దొరుకుతాడు అప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు ఆ తర్వాత ఆ సబ్బు మీద నీళ్లు పడినయని అరవింద మీద అరుస్తాడు ఇవన్నీ అరవిందాకు గుర్తొస్తాయి. నా దగ్గర ఏదో దాస్తున్నాడు ఈయన కచ్చితంగా ఏదో చేస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది అరవింద.

పద్మావతి ప్రేమ..

ఇక పద్మావతి మేడం మీద విక్కీ వెళ్లేసరికి మంచం వేసి దోమల బ్యాట్ పట్టుకొని రెడీగా కూర్చుని ఉంటుంది ఏంటి అవతారం అని అంటాడు విక్కి, ఏం లేదండి మీకు దోమలు కొట్టకుండా చూసుకోవాలని అని అంటుంది ఆ బ్యాట్ కి ఛార్జింగ్ లేదు కదా అంటాడు చార్జింగ్ పెట్టుకొచ్చానండి అవన్నీ మీకు ఎందుకు నేను మీకు దోమలు కొట్టకుండా చూస్తాను కదా మీరు ముందు పడుకోండి అని అంటుంది వెంటనే వికీ అప్పటికే దోమలు గుర్తు ఉంటాయి పైన నువ్వు నన్ను ఇరిటేట్ చేయక పద్మావతి అసలే కరెంటు లేదు నాకు చాల కోపంగా ఉంది అని అంటాడు వెంటనే పద్మావతి, మీరు ఇబ్బంది పడకుండా ఉండాలని నా ప్రయత్నం అది మాత్రం మీకు అర్థం కాదు అని అంటుంది అప్పుడే విక్కీకి ఫోన్ వస్తుంది బయటికి వెళ్తాడు ఫోన్ మాట్లాడి వచ్చేసరికి పద్మావతి విక్కీ కోసం మంచం చుట్టూ దోమతెర కడుతుంది. అది చూసి విక్కీ ఆశ్చర్యపోతాడు. మీకోసమే సారీ ఇదంతా ఏర్పాటు చేశాను అని అంటుంది పద్మావతి విక్కీ పద్మావతి తో, చాలా థాంక్స్ అని చెప్తాడు ఇంతలో నాకోసం రెడీ చేసావు నువ్వు ఎక్కడ పడుకుంటావు అని అంటాడు నేను మీ దగ్గరే అని అంటుంది వాట్ అని అంటాడు అదే సారు నన్ను కూడా కొంచెం కనికరించి నేను ఒక మూల పడుకుంటాను మీరు ఒక మూల పడుకోండి అని అంటుంది. వికీ సరే అని నువ్వు ఏదేదో ఊహించుకోకు నేను నీ మీద ఏ అభిప్రాయము లేకుండానే ఉన్నాను అని అంటాడు. శ్రీనివాస ఈ బండరా ఇలాంటి మనిషిని ఎప్పుడు మారుస్తావయ్య అని అనుకుంటుంది పద్మావతి.

రేపటి ఎపిసోడ్లో పద్మావతి విక్కీ జాగింగ్ కి వెళ్తుంటారు. అక్కడే ఉన్న, ఒక లావుపాటి మనిషి విక్కీని చూసి జాగింగ్ చిన్నపిల్లలు కూడా చేస్తారు మాలాంటి వస్తాదులు ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తారు అని అంటాడు. వెంటనే వికీ కూడా షర్ట్ తీసేసి ఆ వస్తాదులతో పాటు నేను కూడా మీరు చేసేవి చేస్తాను అని అంటాడు. ఇక విక్కీ ఎక్సర్సైజులు చేస్తుంటే పద్మావతి ఆశ్చర్యపోయి చూస్తుంది విక్కీకి ఇంత బాడీ ఉందా అని. పక్కనే ఉన్న చిలకమ్మా పద్మావతి తో మీరు చాలా అదృష్టవంతులండి అని అంటుంది.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri