NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo November 27 2023 Episode 220: శ్యామ్ కి పెళ్లయిందని తెలుసుకున్నారు రుక్మిణి ఏం చేస్తుంది…

Madhuranagarilo Today Episode November 27 2023 Episode 220 Highlights

Madhuranagarilo November 27 2023 Episode 220: నిన్ను పెళ్లి చేసుకొని అనుభవించిన టార్చర్ చాలు ఇంకా జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల చేసుకోవలసి వచ్చింది అని శ్యామ్ అంటాడు. ఓకే నేను ఉన్నానో లేనో వస్తానో రానో అని ఆలోచించి మీ పెద్దవాళ్లు పెళ్లి చేసుకోమంటే నువ్వు వాళ్ళ మాట కాదనలేక ఒప్పుకొని పెళ్లి చేసుకున్నావు, కానీ ఇప్పుడు అదే పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్లి నా మొదటి భార్య తిరిగి వచ్చింది రెండో భార్యను పంపించేద్దాం అని మీ అమ్మానాన్నలకి చెబుదాం పదఅని రుక్మిణి అంటుంది. అమ్మో ఇప్పుడు ఈ రాక్షసి ఇంటికి వస్తే రాధకు నిజం తెలిసిపోతుంది మా ఇద్దరిని కలిపి రాదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలా జరగకూడదు అని శ్యామ్ ఆలోచించి, నువ్వు మా ఇంటికి రానవసరం లేదు నేనే దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తాను నాకు టైం కొంచెం కావాలి అని అంటాడు. నువ్వు తగిలించుకున్న ఆ రెండో పెళ్ళాన్ని ఎలా వదిలించుకోవాలో నువ్వే ఆలోచించు, లేదంటే నేనే మీ ఇంటికి డైరెక్ట్ గా పెద్ద కోడలుగా వచ్చి కూర్చుంటాను అప్పుడు సవతుల పోరాటం చూస్తావు ఆ పోరాటంలో రెండో భార్య ఓడిపోయి వెళ్ళిపోతుంది అప్పుడు నువ్వు తనకి అన్యాయం చేసావని బాధపడే కంటే ఇప్పుడు దాని ఎలా వదిలించుకోవాలో ఆలోచించు అని రుక్మిణి  వెళ్ళిపోతుంది.

Madhuranagarilo Today Episode November 27 2023 Episode 220 Highlights
Madhuranagarilo Today Episode November 27 2023 Episode 220 Highlights

శ్యామ్ కోపంతో టేబుళ్లు కింద ఎత్తేసి ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే రాదా శ్యామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.ఏంటమ్మా రాదా ఇంకా వాడు రాలేదా టైం చానా ఎక్కువ అయిపోయింది డిన్నర్ చేద్దాం రా అని ధనంజయ్ అంటాడు. నేను ఆయన వచ్చాక తింటాను మామయ్య గారు మీరు తినండి అని రాదా అంటుంది. ఇంతలో శ్యామ్ వస్తాడు. ఏమండీ అన్నం తిందాం రండి అని రాదా అంటుంది. నాకు ఏమీ అక్కర్లేదు అని కోపంగా అంటాడు శ్యామ్. మళ్లీ ఆలోచించి సారీ రాదా పొద్దున అలా వెళ్ళిపోయాను అని శ్యామ్ అంటాడు. పర్వాలేదండి మీరు పార్టీని కలవడానికి వెళ్లారు కదా నాకు తెలుసు అర్థం చేసుకున్నాను రండి డిన్నర్ చేద్దాం అని రాదా అంటుంది. నాకు ఆకలిగా లేదు రాదా నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్ రాధా అని శ్యామ్ అంటాడు. ఇక చేసేది ఏమీ లేక రాదా సరే మీ ఇష్టం అండి అంటూ వెళ్ళిపోతుంది.

Madhuranagarilo Today Episode November 27 2023 Episode 220 Highlights
Madhuranagarilo Today Episode November 27 2023 Episode 220 Highlights

రాధా వెళ్లిపోగానే రేయ్ శ్యామ్ ఏంట్రా అలా మాట్లాడావ్ నీ మొదటి భార్యని కలిసావా అని మధుర అడుగుతుంది. అవునమ్మా కలిసాను అని శ్యామ్ అంటాడు. ఏమంటుంది రా నీకు పెళ్లి అయిన విషయం చెప్పావా అని మధుర అడుగుతుంది. చెప్పానమ్మా కానీ తనని వదిలించుకొని నాతో కలిసి బ్రతుకు లేదంటే ఇంటికి వచ్చి కూర్చొని నీ రెండో భార్యని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను అని బెదిరిస్తుంది అని శ్యామ్ అంటాడు. రేయ్ నువ్వు పొద్దున్నుంచి ఇప్పటిదాకా ఇంటికి రాకపోయేసరికి రాద ఎంత టెన్షన్ పడిందో తెలుసా నీకు రాదా నీకోసం డిన్నర్ చేయకుండా అలాగే ఉంది రా వెళ్లి తనతో ప్రేమగా మాట్లాడి ఇద్దరు కలిసి డిన్నర్ చేయండి అని ధనంజయ్ అంటాడు. రాదా ఇప్పటిదాకా డిన్నర్ చేయలేదా అని పైకి వెళ్తాడు శ్యామ్. ఏంటండీ వాడి మొదటి భార్య వీణతో కలిసి బ్రతకాలనుకోవడమేంటి అది కూడా తనకి పెళ్లి అయిందని తెలిసిన ఎందుకు ఇలా ఆలోచిస్తుంది ఆ అమ్మాయి అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode November 27 2023 Episode 220 Highlights
Madhuranagarilo Today Episode November 27 2023 Episode 220 Highlights

శ్యామ్ కి రెండో పెళ్లి అయింది అని తెలుసుకుని వచ్చి ఇలా బెదిరిస్తుందేమో అని ధనంజయ్ అంటాడు. కట్ చేస్తే, పొద్దున అనగా వెళ్లిన రుక్మిణి ని ఇంకా రాలేదేంటి అల్లుడుని కలిసిందా లేదా అని మురళి అంటాడు. ఏమండీ రుక్మిణి వచ్చింది చూడండి అని వాళ్ళ ఆవిడ సైగ చేస్తుంది. ఏంటమ్మా అల్లుడిని కలిసావా అని మురళి అంటాడు. కలిశాను నాన్న కానీ అతను రెండో పెళ్లి చేసుకున్నాడంట నాతో కలిసి ఉండడం కుదరదు అన్నాడు ఏం చేయాలో ఆలోచించుకోవడానికి టైం అడిగాడు అని రుక్మిణి అంటుంది తన భార్యని పంపించడానికి ఒప్పుకోకపోతే నువ్వేం చేస్తావ్ అమ్మ అని మురళి అంటాడు.

Madhuranagarilo Today Episode November 27 2023 Episode 220 Highlights
Madhuranagarilo Today Episode November 27 2023 Episode 220 Highlights

 

దాన్ని ఎలాగైనా వదిలించుకోమని చెప్పాను అలా చేయకపోతే ఇల్లంతా రచ్చ రచ్చ చేస్తాను అని రుక్మిణి కోపంగా వెళ్ళిపోతుంది. తనను పెళ్లి చేసుకున్నది తన చెల్లెలు అని తెలియక ఇలా మాట్లాడుతుందేమో తెలిస్తే ఇంకెలా మాట్లాడుతుందో అని మురళి భయపడతాడు. కట్ చేస్తే, శ్యామ్ రాదని జీవితంలో దూరం చేసుకోకూడదు ఆ రాక్షసి ని ఏదో ఒకటి చేసి వదిలించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రాధ వచ్చి ఏం ఆలోచిస్తున్నారు సార్ ఆఫీసులో ప్రాబ్లం గురించి ఇంకా ఆలోచిస్తున్నారా అని అంటుంది.

Madhuranagarilo Today Episode November 27 2023 Episode 220 Highlights
Madhuranagarilo Today Episode November 27 2023 Episode 220 Highlights

నేను ఆ విషయం గురించి ఆలోచించడం లేదు అని శ్యామ్ అంటాడు. అయితే మీరు కళ్ళు మూసుకోండి మీరు ఏమి ఆలోచిస్తున్నారో నేను చెప్తాను అని రాదా కళ్ళు మూస్తుంది. కళ్ళు మూశాక మీకు  కొన్ని కలర్లు కనిపిస్తున్నాయా అని అడుగుతుంది. రెడ్ కలర్ కనపడుతుంది అని శ్యామ్ అంటాడు. అయితే మీరు చాలా డిస్టర్బ్ గా ఉన్నారని అర్థం మీరు ఎవరి మీదనో కోపం పెంచుకుంటున్నారని అర్థం అని రాధా అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri