Naga Panchami November 27 2023 Episode 211: నేను ఉన్న లేకపోయినా పంచమిని బాగా చూసుకోండి నాకు ప్రాణం ఉందని మీ అందరికీ తెలుసు కానీ పంచమికి నాకు ప్రాణం ఉందని తెలియకుండానే పెళ్లి చేసుకుంది తనకి ఏ ఆనందము దక్కకుండా వెళ్ళిపొమ్మంటారా నా ప్రాణాల మీద ఎప్పుడు ఆశ వదిలేసుకున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని మోక్ష అంటాడు.చూడు మోక్ష నువ్వు ఎంత చెప్పినా వినట్లేదు ఇకపై నీ ఇష్టం కానీ మాకు పుత్ర శోఖాన్ని మిగిలించకు అని వైదేహి అంటుంది.
కట్ చేస్తే, నీలాంబరి చేసిన పూజలకి గ్రామ దేవత ప్రత్యక్షమవుతుంది. నీకు ఏం వరం కావాలి నన్ను ఎందుకు ప్రసన్నం చేసుకున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు మాత నా కోరిక మన్నించి నాకు సహాయం చేయి ఒకసారి నువ్వు ఆపాలి ఆ ఇంట్లో ఎవరి ఒంటి మీద మీరు చేరిపోయి వాళ్లకు భయం పుట్టేలా చేయండి ఆ తరువాత ఆ కార్యం ఆగిపోతుంది అని నీలాంబరి అంటుంది. మెప్పించావు కరాలి నీ కోరిక తప్పకుండా తీరుస్తాను అని గ్రామ దేవత అంటుంది. నన్ను దీవించు మాత అని కరాలి అంటుంది.
విజయోస్తు అని గ్రామ దేవత ధీవిస్తుంది. కట్ చేస్తే, ఏంటి పంచమి శోభనానికి రెడీ అయిపోయావా అని జ్వాల అంటుంది. ఇంతలో గ్రామ దేవత వచ్చి జ్వాల ఒంట్లో చేరిపోయి పూనకం వచ్చిన దానిలాగా ఊగుతుంది. అమ్మవారు తన ఒంట్లో చేరిందని సుబ్రహ్మణ్యానికి వెంటనే తెలిసిపోతుంది. వీడికి ప్రాణగండం ఉందని మీకు తెలుసు కదా భార్యాభర్తలు కలిస్తే చచ్చిపోతాడు మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నా మాట నమ్ముతారా నమ్మరా అని జ్వాల అంటుంది. ఏ జ్వాల ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావ్ అని భార్గవ్ అంటాడు. మీరు నన్ను ఇంకా నమ్మట్లేదు కదా మీ అందరిని కలిపి చంపేస్తాను అని గ్రామ దేవత అంటుంది. అమ్మ తల్లి నమ్ముతున్నాము ఏం చేయాలో చెప్పు అని శబరి అంటుంది. వాళ్ళిద్దరూ కలవకుండా చూసుకోండి భార్యాభర్తలు కలిస్తే దాని పసుపు కుంకుమలు పోతాయి పూలు తెగిపోతాయి అమాయకురాలిని ఇప్పుడే విధవని చేస్తారా మీ అందరికీ తెలిసిన విషయమే కదా అని గ్రామ దేవత అంటుంది.
ఇంతలో సుబ్బు తన మహిమతో కళ్ళు తెరిపిస్తాడు గ్రామ దేవతకి. స్వామి నన్ను మన్నించండి నా తప్పు తెలుసుకున్నాను మంచి కార్యం చేయడానికి వచ్చాను కానీ ఇక్కడ మీరు తనకి అండగా ఉన్నారని తెలుసుకోలేకపోయాను నన్ను మన్నించండి అంటూ గ్రామ దేవత వెళ్ళిపోతుంది.జ్వాలా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. నాకేమైంది అని కొద్ది సేపటి తర్వాత లేచి అడుగుతుంది.అక్క ఆ విషయాలన్నీ తర్వాత నీకు చెప్తాను పద అని చిత్ర తనను తీసుకొని వెళ్ళిపోతుంది.పొద్దున నల్ల చొక్కా అతను చెప్పాడు ఇప్పుడు ఈ గ్రామ దేవత రూపంలో జ్వాల చెప్పింది ఏం చేయాలనుకుంటున్నావు మోక్ష మా అందరినీ బాధ పెట్టే పని మాత్రం చేయకు నాన్న అని ఏడుస్తుంది వైదేహి. అమ్మ ప్రాణం పోతుందని భయపడుతూ బ్రతకలేను ఉన్న కొన్ని రోజులైనా సంతోషంగా గడపాలన్నదే నా కోరిక నా నిర్ణయం ఎప్పటికీ మారదు అని పంచమిని తీసుకొని మోక్ష వెళ్లిపోతాడు.
కట్ చేస్తే, చూడు పంచమి ఈరోజు మన భార్యాభర్తలం ఇద్దరం శరీరలే కాదు మనుషులే మన మనసులు మన ప్రాణం ఒకటే అపోయి గడిపే రోజు ఈ క్షణం నీలో భయాన్ని పక్కన పెట్టేసేయ్ పంచమి ఈ కొన్ని క్షణాలైనా ఆనందంగా గడుపుదాం, సంవత్సరం నుంచి మనం పడ్డ కష్టాలు బాధలు అన్నీ మరిచిపోయి ఆనంద లోకంలోకి వెళ్ళిపోదాం రా పంచమి అని మోక్ష పంచమిని మంచం మీద కూర్చో పెడతాడు. భగవంతుడా నన్ను ఇంతటి అగ్నిపరీక్షకు ఎందుకు గురి చేశావు ఇప్పుడు నేను ఈ అగ్నికి ఆహుతి అయిపోవాల్సిందేనా నా భర్తను కాపాడుకోలేనా అని పంచమి ఏడుస్తుంది. చూడు పంచమి కన్నీళ్లు కార్చే టైం కాదు ఇది మన మధ్యన గాలి కూడా దూరనంత ప్రేమతో పెను వేసుకొని పోయే సమయం దాన్ని భయంతో కప్పి పెట్టకు పంచమి నాకు ప్రాణగండం ఉందని తెలిసినా ఎందుకు ఇలాంటి పని చేస్తున్నాను నీకు తెలుసా, నేను చనిపోయిన నా ప్రతిరూపాన్ని నువ్వు చూసుకుంటూ ఆనందంగా గడిపేయాలన్నదే నా కోరిక నా రూపాన్ని నీ కడుపులో ఎప్పుడు మోస్తావా అని తహతహలాడిపోతున్నాను పంచమి నా కోరికను మన్నించు అని మోక్ష అంటాడు.
భగవంతుడా నేనే ఆ కాటు వేసే పామునని ఈయనకు తెలియక ఇలా మాట్లాడుతున్నాడు తనను ఏం చేసినా సరే కాపాడుకోవాలి నేను విధవరాలిగా ఉండలేను భూమి మీద తను లేని ఆనంద లోకం నాకు అక్కర్లేదు అని పంచమి అనుకుంటుంది తన మనసులో.చూడు పంచమి మనం ఎన్ని అనుకున్నా పోయినా రోజులు రావు జరిగే కాలము ఆగక మానదు దాని గురించి ఆలోచించి ఆనందాన్ని పాడు చేసుకునే బదులు ఇప్పుడు సంతోషంగా ఉన్నామా లేదా అనేది చూసుకోవడం మంచిది ఎందుకు అంటే కొన్ని రోజుల తర్వాత నేను ఉంటానో ఉండనో నువ్వైనా ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక పంచమి అని మోక్ష అంటాడు. ఇక నేను ఏమీ చేయలేని పరిస్థితి ఇలాంటి ఇరకాటంలో పెట్టావు ఏంటి స్వామి ఏం చేసినా నీవే దిక్కు అని పంచమి అనుకుంటుంది..
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!