Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ సరసన దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరో శ్రీకాంత్ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్.. ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా నిర్మాతలలో ఒకరైన కళ్యాణ్ రామ్ దాదాపు 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఈ సినిమాలో సముద్రం మాదిరిగా వేసిన సెట్… ఇండియాలో ఏ సినిమాకి వేయలేదు. ఆ సముద్రం లోపల తీసిన దృశ్యాలు.. సినిమాకి హైలెట్ గా ఉంటాయి.
ఆ సెట్ కోసం 8 నెలలు రీసెర్చ్ చేశారు. 100 అడుగుల వెడల్పు 30 అడుగుల లోతు ట్యాంక్ ఇప్పటివరకు ఏ సినిమా కోసం కట్టలేదు. దేవర సినిమా కోసం ఆ రకంగా కష్టపడ్డాం. “గేమ్ ఆఫ్ థ్రోన్స్” మాదిరిగా వాటర్ సీక్వెన్స్.. సీన్స్ ఉంటాయని అంటున్నారు. కానీ ఆ సినిమా అంతా హాలీవుడ్.. నా దృష్టిలో మాత్రం దేవర సినిమా అంతకుమించి అంటూ నిర్మాత కళ్యాణ్ రామ్ ఇటీవల తెలిపారు. ఇదిలా ఉంటే దేవర గ్లింప్స్ వీడియో జనవరి 8వ తారీకు సాయంత్రం విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించడం జరిగింది.
అయితే దానికంటే ముందుగానే ఆ విషయాన్ని గుర్తు చేస్తూ దేవరాజు సినిమా యూనిట్ చిన్నపాటి వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో సముద్రంలో ఒక ఆయుధాన్ని కడుగుతున్న ఎన్టీఆర్ చెయ్యి కనిపిస్తుంది. ఈ వీడియోకి తారక్ అభిమానుల నుండి భారీ ఎత్తున.. స్పందన వస్తుంది. బ్లడ్ బాత్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న దేవర సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమా. దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
Unleashing fear in 2 days 🌊🌊🌊
Man of Masses #NTR’s #DevaraGlimpse will deliver a massive feast on Jan 8th at 4:05 PM 🔥#Devara@tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @anirudhofficial@NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @Yugandhart_… pic.twitter.com/cICvJgTjFx
— Devara (@DevaraMovie) January 6, 2024
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?