NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan – Kesineni Nani: సీఎం వైఎస్ జగన్ తో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ .. పోటీకి కీలక ప్రతిపాదనలు ఇవీ

YS Jagan – Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈరోజు సీఎం వైఎస్ జగన్ తో సమావేశమైయ్యారు. ఇటీవలే ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని కేశినేని నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె కేశినేని శ్వేత కూడా విజయవాడ కార్పోరేషన్ 11 వ డివిజన్ కార్పోరేటర్ పదవికి రాజీనామా చేశారు. టీడీపీకి రాజీనామా చేస్తానని కేశినేని ప్రకటించిన రోజునే ఏదో ఒక పార్టీ తరపున  గానీ స్వతంత్ర అభ్యర్ధిగానైనా విజయవాడ నుండి మూడో సారి పోటీ చేస్తానని చెప్పారు.

ఈ తరుణంలోనే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్యరామిరెడ్డి, పలువురు వైసీపీ కీలక నేతలు కేశినేని నానితో చర్చలు జరిపారు. వైసీపీలో చేరితే తగిన విధంగా ప్రాధాన్యత ఇస్తామని వారు హామీ ఇవ్వడంతో పాటు ఇవేళ సీఎం వద్దకు తీసుకువెళ్లారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన నాని.. సీఎం జగన్ తో గంటకుపైగా సమావేశమైయ్యారు. కేశినేని నానితో పాటు ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, నందిగామకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ లు ఉన్నారు.

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి నాని సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తొంది. అయితే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తాను సూచించిన అభ్యర్ధులకు టికెట్ ఇవ్వాలని నాని ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తొంది. ఎంపీ కేశినేని నాని ప్రతిపాదనలపై సీఎం వైఎస్ జగన్ ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత కేశినేని నాని అధికారికంగా వైసీపీ లో చేరనున్నారు.

AP High Court: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ .. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్

Related posts

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N