NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: అసహ్య రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ కు మరో సారి దేవుడు గుణపాఠం చెబుతాడన్న సీఎం జగన్

YS Jagan: ఏపీలో కాంగ్రెస్ పార్టీ అసహ్య రాజకీయాలు చేస్తొందని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో ఇండియా టుడే విద్యాసదస్సుకు సీఎం జగన్ హజరైయ్యారు. గతంలో మా బాబాయ్ ని నాపై పోటీకి నిలబెట్టారు.. ఇప్పడు మా సోదరిని ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ కుటుంబాన్ని చీల్చి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తొందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్దికోసమే రాష్ట్రాన్ని విడదీసిందన్నారు. విభజించి పాలించడమే ఆ పార్టీ నిత్య విధానమని విమర్శించారు. కాంగ్రెస్ గతం నుండి పాఠాలు నేర్చకోలేదని అన్నారు.

కుటుంబాల్లో విభేదాలు సృష్టించి రాజకీయం చేస్తొన్న కాంగ్రెస్ పార్టీకి మరో సారి దేవుడు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదని అన్నారు. టీడీపీ – జనసేనతోనే ఎన్నికల్లో తమ పోటీ అని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నామని వివరణ ఇచ్చారు. ఇష్యూ బేస్డ్ విషయంలో కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

సర్వేల ఆధారంగానే వైసీపీ అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా వ్యతిరేకత ఉన్నందున వల్లనే కొందరికి టికెట్లు ఇవ్వలేదని వివరణ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు సీఎం పదవి నుండి దిగిపోయినా బాధపడననీ, వైసీపీ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చామని అన్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీయే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు జగన్.

చంద్రబాబు అరెస్టుపై

టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి చేశారు కాబట్టే పోలీసులు ఆయనను అరెస్టు చేశారని జగన్ తెలిపారు. పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారని, అందుకే చంద్రబాబు జైల్ లో 52 రోజులు ఉన్నారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత అరెస్టు చేయాలని ఎవరు అనుకోరని ..చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే పోలీసులు అరెస్టు చేశారని అన్నారు.

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?