Samantha Shruti Haasan: మాయోసైటీస్ సోకిన తర్వాత సమంత కొన్ని రోజులు షూటింగ్ లకు బ్రేక్ ఇవ్వడం తెలిసిందే. అయితే ఆమె అప్పటికే అంగీకరించిన కొన్ని సినిమాలు పెండింగ్‌లో ఉండడంతో అవి ఆగిపోయాయి. ఆ తర్వాత మాయోసైటీస్ వ్యాధి నుండి కోలుకున్న తర్వాత ఒప్పుకున్న సినిమాలు సమంత పూర్తి చేసింది. యశోద, శకుంతలం, ఖుషి వంటి పెండింగ్ ప్రాజెక్ట్‌లన్నింటినీ పూర్తి చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు షూటింగ్ లకి విరామం ప్రకటించింది. ఆ సమయంలో విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకోవడం జరిగింది. మరోవైపు కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతిహాసన్ గతేడాది సంక్రాంతి తర్వాత మళ్లీ వరుస ఆఫర్లతో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది.
గత ఏడాది చిరంజీవి “వాల్తేరు వీరయ్య”, బాలకృష్ణ “వీరసింహారెడ్డి”, ప్రభాస్ “సలార్” సినిమాలతో హిట్స్ అందుకొంది. ప్రస్తుతం “సలార్” రెండో భాగంతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో సమంత ఓ సెన్సేషనల్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మిస్ అయిందని..ఆ గోల్డెన్ అవకాశం శృతి హాసన్ అందుకుందని వార్తలు వచ్చాయి. మూడేళ్ల క్రితం సమంత ఓ అంతర్జాతీయ చిత్రంలో భాగం కానుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత “లవ్ అరేంజ్మెంట్స్” అనే పుస్తకం ఆధారంగా ఈ చితం తెరకెక్కుతున్నట్లు ఈ హాలీవుడ్ చిత్రంలో సమంత డిటెక్టివ్ పాత్రను పోషిస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం త్వరలోన్నే చిత్రీకరణ ప్రారంభం కానుందట.
అయితే ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్న సమంత ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమంత స్థానంలో నటి శ్రుతిహాసన్ జాక్ పాట్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది. బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం BAFTA విన్నర్ ఫిలిప్ జాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ఇండో-యూకే మూవీ ‘చెన్నై స్టోరీ’లో ఛాన్స్ అందుకున్నారట. దీన్ని గురు ఫిలిమ్స్ (ఇండియా), రిప్పల్ వరల్డ్ పిక్చర్స్ (UK), ప్రొడక్షన్స్ (వేల్స్) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2004లో రికార్డు స్థాయిలో అమ్ముడైన ‘ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది అని సమాచారం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!