Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “వినయ విధేయ రామ” వంటి డిజాస్టర్ తర్వాత తన ఆలోచన ద్వారా పూర్తిగా మార్చుకున్నాడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన “వినయ విధేయ రామ” బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో “RRR” అనే చిత్రాన్ని చేసిన రామ్ చరణ్…పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకోవడం జరిగింది. కాగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో “గేమ్ ఛేంజర్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా నేపధ్యంలో షూటింగ్ జరుపుకుంటుంది. “గేమ్ ఛేంజర్” పూర్తయిన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16వ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమా పూర్తి స్థాయి స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఫిల్మ్‌గా రూపొందనుంది. హిస్టారికల్ డ్రామాగా చెప్పబడుతున్న ఈ సినిమా పూర్తి చేసి రామ్ చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడనే దానిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు ప్రాజెక్ట్ తర్వాత ఇప్పటి వరకు రామ్ చరణ్ మరో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలావుండగా ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవ్వుతోంది. విషయంలోకి వెళ్తే తాజాగా రామ్ చరణ్ తేజ ఓ బాలీవుడ్ డైరెక్టర్ కి పచ్చజెండా ఊపారని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్లో అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన రాజ్‌కుమార్ హిరానీతో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హిరానీ గతంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చిత్రికించారు. మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగే రహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పికే వంటి వైవిధ్యమైన సినిమాలు చేసి అద్భుతమైన విజయాలు అందుకున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన “డాంకీ” సినిమా పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. పరిస్థితి ఇలా ఉండగా హిరానీ ఇటీవలే ఓ కథను రామ్ చరణ్‌కి చెప్పాడని, అది ఆయనకు బాగా నచ్చిందని, వెంటనే అనుమతి ఇచ్చాడని అంటున్నారు. రాజ్‌కుమార్ ఇప్పటి వరకు ఐదు సినిమాలు మాత్రమే చేశారు. ఏ సినిమా అయినా చాలా డిఫెరెంట్ జోనర్లో తీస్తారు. ఈ ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. కానీ గత ఏడాది తీసినా “డాంకీ” అతని కెరీర్లో మాత్రమే డిజస్టార్ అయింది. అయితే చరణ్ తో మాత్రం చాలా డిఫరెంట్ సబ్జెక్టు తీయబోతున్నట్లు బీ టౌన్లో వార్తలు వస్తున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!