NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ వేళ్లు తెగుతున్నాయ్‌… జ‌గ‌న్ అనుకుందొక్క‌టి.. అయ్యిందొక్క‌టి…!

సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ నోరు విప్పినా.. వైసీపీ బ‌లంగా ఉంద‌ని.. కార్య‌క‌ర్త‌లు పార్టీకి కొండంత బ‌ల‌మ‌ని వ్యాఖ్యా నిస్తున్నారు. ఇటీవ‌ల గుంటూరు జిల్లాలోని ఫిరంగి పురంలో నిర్వ‌హించిన వ‌లంటీర్ల‌కు వంద‌నం కార్య క్రమంలోనూ ఇదే మాట చెప్పారు. చొక్కాలు మ‌డ‌త పెట్టాలంటూ.. ఆయ‌న పిలుపునిచ్చారు. దీంతో మ‌రింత రెట్టించిన ఉత్సాహంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు గ్రౌండ్ లెవిల్లో ప‌నిచేస్తార‌ని ఆయ‌న భావించారు. కానీ, చిత్రం ఏంటంటే.. అదే బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌లు.. ఒక్కొక్క‌రుగా కాదు.. మూకుమ్మ‌డిగా పార్టీకి దూర‌మ‌వుతు న్నారు.

పార్టీలో టికెట్ల వ్య‌వ‌హారం.. నాయ‌కుల‌పైనే కాదు, కార్య‌క‌ర్త‌ల‌పైనా పెద్ద ప్ర‌బావం చూపిస్తోంది. ఉదాహ‌ర‌ణ కు ఎర్ర‌గొండ పాలెం ఎమ్మెల్యే క‌మ్ మంత్రిగా ఉన్న ఆదిమూల‌పు సురేష్ ను కొండ‌పినియోజ‌క‌వ‌ర్గానికి బ‌దిలీ చేశారు. వాస్త‌వానికి కొండ‌పిలో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు వైసీపీకి వున్నారు. కానీ సురేష్ మాత్రం.. వీరిని విశ్వ‌సించ‌డం లేదు. ఏ ప‌నీ అప్పగించ‌డం లేదు. క‌నీసం.. త‌ను వ‌స్తున్నాన‌న్న స‌మాచారం కూడా లేకుండానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇది ఒక‌ర‌కంగా.. ఆయ‌నపై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తోంది.

అదేస‌మ‌యంలో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లోనూ ఏహ్య భావం పెరిగేలా కూడా చేస్తోంది. మ‌రోవైపు.. త‌న సొం త నియోజ‌క‌వ‌ర్గం ఎర్ర‌గొండ పాలెం నుంచి కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకువ‌చ్చి.. నాయ‌కుల‌ను ఇక్క‌డ‌కు పంపిం చి.. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. దీంతో కొండ‌పిలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. ఆ పార్టీకి దూరంగా ఉండ డంతోపాటు.. టీడీపీ, జ‌న‌సేన లో చేరేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. ఈ విష‌యం తెలిసిన పార్టీ నాయ‌కులు వారిని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ అస‌లు సురేష్‌మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఇక‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. తాజాగా 100 మంది కార్య‌క‌ర్త‌లు.. బొండా ఉమా (టీడీపీ)కు జై కొట్టారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ నుంచి ఇక్క‌డ‌కు వ‌చ్చిన మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌.. ఇక్క‌డి కార్య‌క‌ర్త‌ల‌ను ఎలా న‌మ్ముతామ‌మ్మా..! అని చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. అంతేకాదు..ఆయన నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌డ‌మే లేదు. ఒక వేళ‌ప‌ర్య‌టించినా.. ప‌శ్చిమ నుంచి తెచ్చుకుంటున్నారు. దీంతో విసిగిపోయిన కార్య‌క‌ర్త‌లు పార్టీకి దూర‌మ‌వుతున్నారు. మ‌రిఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి ఇబ్బంద‌నే వాద‌న‌వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju