NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ముద్రగడతో వైసీపీ నేతల కీలక భేటీ .. పార్టీలోకి ఆహ్వానం

YSRCP: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక దాదాపు ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం ముద్రగడ పద్మనాభం నివాసానికి వైసీపీ నేతలు వెళ్లారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో,  జిల్లాల్లో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఆయనను పార్టీలోకి అహ్వానించారు. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం వైసీపీ ఇన్ చార్జి దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇన్ చార్జి తోట నరసింహం లు ముద్రగడతో సమావేశం అయ్యారు.

భేటీ ముగిసిన అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ముద్రగడను కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించామని చెప్పారు. త్వరలోనే ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ గొప్ప ఉద్యమం చేశారని అన్నారు. ఆఫర్ల కోసం పార్టీ చేరే వ్యక్తి కాదనీ, స్వతహాగా ఆయనే పార్టీలో చేరతారన్నారు. సీఎం వైఎస్ జగన్ కు పెద్దలను ఎలా గౌరవించాలో తెలుసుననీ, ముద్రగడకు సముచిత స్థానం ఇస్తారనీ మిథున్ రెడ్డి అన్నారు.

కాగా, ఇప్పటికే ముద్రగడతో మిథున్ రెడ్డి ఇంతకు ముందు ఫోన్ లో మాట్లాడారు. ఆయన పార్టీలో చేరికకు సముఖంగా ఉండటంతో ఇవేళ నేరుగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. మరో పక్క కాపుసేన నేత, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.  జగన్ ఓటమే లక్ష్యంగా జత కట్టిన టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కూడా కలవడం దాదాపు ఖాయమైంది. ఎన్డీఏలో టీడీపీ చేరిక పైన ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన బలంపై జగన్ గురి పెట్టారు. ఓ పక్క చేగొండి హరి రామజోగయ్య కుమారుడు, మరో పక్క ముద్రగడను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాపు ఓటు బ్యాంక్ పై వైసీపీ వ్యూహం అమలు చేస్తొంది.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముద్రగడ పద్మనాభం ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. పవన్ వైపు కాపు వర్గం మొగ్గు చూపుతున్న వేళ ముద్రగడతో ఆ ఓటు బ్యాంక్ కు గండి కొట్టవచ్చని వైసీపీ లెక్కలు వేస్తొంది. ఈ క్రమంలో ముద్రగడ కుమారుడికి రాష్ట్ర స్థాయిలో కీలక నామినేటెడ్ పదవి కట్టబెడతారని తెలుస్తొంది. ఎన్నికల్లో ముద్రగడను రాష్ట్రంలో పలు చోట్ల ప్రచారం చేయించాలని వైసీపీ భావిస్తొందని సమాచారం.

BRS MLA: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్ .. కళాశాల భవనాలు కూల్చివేత

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?