NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: జగన్ గుంపు నుండి సీమను రక్షించుకోవాలి – పవన్ కళ్యాణ్

Pawan Kalyan: రాయలసీమ బానిస సంకెళ్లలో ఉండిపోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందని అన్నారు. వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డితో తనకు విభేదాలు లేవు కానీ సీమలో కొందరు నేతలు ఆధిపత్యం చెలాయిస్తున్నారని అన్నారు. మరో సారి వైసీపీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలో ఇంకేమి మిగలదని అన్నారు.

చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. ఆరణి శ్రీనివాసులు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుండి తెలుసునని అన్నారు.  రాయలసీమ ప్రాంతంలోని చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిపోతున్నారని అన్నారు. భయం వదిలివేస్తేనే పరిస్థితులు మారుతాయని అన్నారు. వైసీపీ నేతలు తిరుపతిని అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. జగన్ గుంపు నుండి సీమను రక్షించుకోవాలని అన్నారు.

మంగళగిరిలో జనసేన శ్రేణులు ఉంటున్న అపార్ట్ మెంట్ లో పోలీసులు తనిఖీలు చేయడంపై పవన్ స్పందించారు. సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు తమ ఆవరణలోకి వచ్చారన్నారు. రాజకీయాల్లో ఇదంతా సహజం అంటే కుదరదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అందరూ గౌరవించాలన్నారు. పోలీసు అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే కుదరదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుంటే సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక అలాంటి వారిని గుర్తు పెట్టుకుంటామని, వైసీపీకి కొమ్ము కాసే పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

YS Jagan: చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమే – జగన్  

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?