NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

రాజ‌కీయ‌ల‌కు-కులాలకు అవినాభావ సంబంధం ఉంది. కులాలు లేకుండా నాయ‌కులు లేరు. నాయ‌కు లు లేకుండా పార్టీలు లేవు. సో.. వీటికి పుట్టుకుతోనే ఉన్న పేగుబంధం మాదిరిగా రాజ‌కీయాల‌కు కులాల కు మ‌ధ్య సంబంధాలు అలానే ఉన్నాయి. ఇప్పుడు జ‌రుగుతున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ కులాల పోరు తీవ్రంగానే ఉంది. కులాల నాయ‌కుల‌ను, కుల‌సంఘాల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల నుంచి అధికార పార్టీ వ‌ర‌కు కూడా కులాల కోసం.. ప్ర‌త్యేక ప్యాకేజీలు కూడా ప్ర‌క‌టిస్తున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇదే విష‌యంలో గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ కులా లు.. రాజ‌కీయంగా చ‌క్రం తిప్పుతున్నాయి. ఇక్క‌డ అసెంబ్లీ బ‌రికి సంబంధించి పోటీ చేస్తున్న‌వారు ఇద్ద రూ మ‌హిళ‌లే కావ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ నుంచి మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ పోటీలో ఉన్నారు. ఇక‌, టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన పార్టీల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా పిడుగురాళ్ల మాధ‌వి పోటీ చేస్తున్నారు.

వీరిలో ఇద్ద‌రూ కూడా ఆర్థికంగా బ‌లంగా ఉన్న వారే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. సామాజిక వ‌ర్గాల ప‌రం గా ఇక్క‌డ కూడా ప్ర‌జ‌లు వారికి ద‌న్నుగా మారడం కామ‌న్‌. ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. క‌మ్మ సామాజిక వ‌ర్గం అంతా కూడా సంప్ర‌దాయంగా టీడీపీవైపు నిలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో వీరి హ‌వా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పైగా టీడీపీ అభ్య‌ర్థి మాధ‌వి భ‌ర్త క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో ఆయ‌న ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది.

ఇక‌, మాధ‌వి ప‌రంగా చూస్తే.. ఆమె బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు. దీంతో ఈవ‌ర్గం అంతా కూడా మాధ‌వి వైపే నిలిచాయి. పైగా మాధ‌వి లోక‌ల్ కావ‌డంతో ఇక్క‌డి వారు ఎక్కువ‌గా ఆమెనే ఇష్ట‌ప‌డు తున్నారు. దీంతో కులాలన్నీ కూడా మాధ‌వికి అనుకూలంగా ఉన్నారు. ఎటొచ్చీ.. ర‌జ‌నీ విష‌యాన్ని చూస్తే.. ఆమె కూడా సామాజిక వ‌ర్గం ప‌రంగా బీసీ వ‌ర్గానికే చెందిన నాయ‌కురాలు. అయితే.. ఆమె నాన్ లోక‌ల్ కావ‌డం.. ఓట‌మి భ‌యంతో త‌న నియోజ‌క‌వ‌ర్గం చిల‌క‌లూరిపేట‌ను వ‌దిలేసి ఇక్క‌డ‌కు వ‌చ్చార‌న్న ప్ర‌చారం ప్ర‌జ‌ల్లో ఎక్కువ‌గా ఉంది.

దీంతో వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన ర‌జనీ వైపు ఇక్క‌డి సామాజిక వ‌ర్గాలు ఏవీ కూడా మొగ్గు చూపేందు కు ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీంతో గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో మెజారిటీ సామాజిక వ‌ర్గాలు దాదాపు ఏక మయ్యాయి. దీనికితోడు రాజ‌ధాని ప్రాంతం ప్ర‌భావం కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంపైనే ఉంటుంది. దీంతో ఇక్క‌డ టీడీపీకి సానుకూల ప్ర‌బావం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. వైసీపీ పై స‌హ‌జంగా ఉండే వ్య‌తిరేక‌త ర‌జ‌నీ రాక‌తో మ‌రింత పెరిగింది. ఇక్క‌డి నాయ‌కుల‌కు టికెట్ ఇవ్వ‌లేద‌న్న ఆవేద‌న కూడా పార్టీలో క‌నిపిస్తోంది. దీంతో ర‌జ‌నీ గెలుపు సాధ్యం కాద‌నే వాద‌న నామినేష‌న్ల కంటే ముందే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?