NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

Legend: నట‌సింహం నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. అందులో లెజెండ్ మూవీ కూడా ఒకటి. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. అలాగే జగపతిబాబు ఈ సినిమాతోనే విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ మరియు వారాహి చలనచిత్ర బ్యానర్లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాడు.

2014 మార్చి 28న‌ విడుదలైన లెజెండ్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలి ఆట నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుని కాసుల వర్షాన్ని కురిపించింది. బోయ‌పాటి శ్రీ‌ను, బాల‌కృష్ణ కాంబినేష‌న్ లో వ‌చ్చిన రెండో సినిమా ఇది. అప్ప‌టికే వీరిద్ద‌రూ సింహా చిత్రానికి ప‌ని చేశారు. 2010లో రిలీజ్ అయిన సింహా ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. అయితే సింహా త‌ర్వాత ఆ స్థాయి హిట్ బాల‌య్య ఖాతాలో ప‌డ‌లేదు.

పరమ వీర చక్ర, అధినాయకుడు, ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?, శ్రీమన్నారాయణ వంటి చిత్రాలు బాల‌య్య‌కు షాకుల మీద షాకులు ఇచ్చారు. దాంతో ఆయ‌న మ‌ళ్లీ బోయ‌పాటి శ్రీ‌నుకే ఛాన్స్ ఇచ్చారు. అలా వీరి క‌ల‌యిక‌లో భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన లెజెండ్ మూవీ సెన్సేష‌న‌ల్ హిట్ గా నిలిచింది. క‌డప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌లో 1000 రోజులు ఆడింది.

అంత‌కుముందు సూపర్ స్టార్ రజనీకాంత్ న‌టించిన చంద్రముఖి సినిమా తమిళనాడులోని ఓ థియేట‌ర్ లో 891 రోజులు రన్ ను పూర్తి చేసుకుని రికార్డు సృష్టించ‌గా.. ఆ రికార్డును లెజెండ్ సినిమా బ్రేక్ చేసింది. అలాగే ఫుల్ ర‌న్ లో లెజెండ్ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 40 కోట్లకు పైగా షేర్ వ‌సూళ్ల‌ను సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 34.09 కోట్ల షేర్ రాబ‌ట్టి బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేసింది. ఇక‌పోతే లెజెండ్ మూవీ థియేటర్స్ లో విడుదలై గురువారంతో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మార్చి 30న లెజెండ్ ను రీ రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

అలాగే గురువారం రాత్రి హైదరాబాద్ లో లెజెండ్ మూవీ టీమ్ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ మేరకు ఓ వేడుకను నిర్వహించారు. హీరో బాలకృష్ణ, డైరెక్ట‌ర్‌ బోయపాటి శ్రీను, హీరోయిన్‌ సోనాల్ చౌహాన్ మ‌రియు నిర్మాత‌ల‌తో స‌హా మరికొందరు ఈ వేడుక‌కు హాజరయ్యారు. ఈ వేడుక‌లో బాల‌య్య మాట్లాడుతూ.. `రికార్డులు నాకు కొత్త కాదు. సృష్టించాలన్నా నేనే, తిరగరాయాలన్నా నేనే. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు  బాధ్యత. కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతుంటాయి. సింహం, లెజెండ్, అఖండ అలాంటివే. ఈ మధ్య చేసిన వీర సింహారెడ్డి, భగవంత్ కేస‌రి చిత్రాలు కూడా నాలో క‌సిని పెంచాయి. ఇలాంటి మంచి సినిమాలు ఇస్తే మరిన్ని చేయ‌మ‌ని  ప్రేక్ష‌కులు వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు` అంటూ ఎంతో ఉత్సాహంగా ప్రసంగించారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?