BrahmaMudi:రాజ్ కావ్య తో కలిసి అసలు మాయ ని వెతకడానికి వెళ్తాడు. కారులో ఇద్దరు కలిసి వెళ్తుంటే కార్ ఆగిపోతుంది. ఇప్పుడు మీరు బ్యానెట్ ఓపెన్ చేసి తల అందులో పెట్టి బాగు చేయడం మీకు వచ్చా అని కావ్య అడుగుతుంది రాజ్ సైలెంట్ గా కారులో నుంచి దిగి రిపేర్ చేయడం మొదలుపెడతాడు కారు మళ్లీ స్టార్ట్ అవుతుంది కారు స్టార్ట్ చేసిన వెంటనే రౌడీలు మాయని వెంబటిస్తూ రావడం కావ్య అద్దంలో చూస్తుంది. వెంటనే కార్ ఆపండి అని అంటుంది నువ్వు సైలెంట్ గా కూర్చో అని అంటాడు రాజ్ అబ్బా లేదండి కార్ ఆపండి మాయ అని అంటుంది. ఏంటి అని అంటాడు రాజ్ అవునండి మాయ అని అంటుంది వెంటనే రాజ్ కార్ ఆపుతాడు కావ్య రాజ్ ఇద్దరు కారులో నుంచి దిగేసరికి మాయ ని రౌడీలు పట్టుకోడానికి వస్తూ ఉంటారు వెంటనే రాజ్ ని చూసి రౌడీలు ఇప్పుడు కనుక మనం వీడికి దొరికితే మన వెనక రుద్రాణి ఉందన్న విషయం వీడు తెలిసే వరకు మనల్ని వదిలిపెట్టడు అప్పుడు రుద్రాణి మన దగ్గరికి వచ్చి అడుక్కు తినాల్సి వస్తుంది అని రౌడీలు రాజ్ ని చూసి పారిపోతారు. మాయా కావ్య దగ్గరికి వచ్చేస్తుంది. మాయా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది కావ్య అప్పుడే మాయ సృహ తప్పి పడబోతూ ఉంటుంది వెంటనే కావ్య మాయని లాగిపెట్టి ఒకటి కొడుతుంది. ఎందుకే అలా కొట్టావు అని రాజ్ అడుగుతాడు లేదంటే మళ్ళీ కోమలికి వెళ్ళిపోతుందండి అని అంటుంది కావ్య.
![BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం.. 38 Brahmamudi June 22 Episode 443](https://newsorbit.com/wp-content/uploads/2024/06/2024-06-22-21.png)
ఇక సీన్ దుగ్గిరాల ఇంటికి చేరుతుంది. కావ్య రాజ్ ఇద్దరు మాయని దుగ్గిరాల ఇంటికి తీసుకువస్తారు. ఈమె అసలు మాయ ఈమె కోసమే నేను ఇన్నాళ్లు కష్టపడి తిరిగాను ఈ మాయ వెనుక కూడా చాలా అబద్దాలు ఉన్నాయి మోసం చేసింది మామయ్య కాదు ఈ మాయే అని కావ్య అందరి ముందు చెబుతుంది. ఇప్పుడు మీరే ఈమె చెప్పే నిజాలు వినండి అని మాయను నిజం చెప్పమని అడుగుతుంది కావ్య. అప్పుడే రుద్రాణి కలగజేసుకొని ఒక నిమిషం అసలు నువ్వు ఏం చేస్తున్నావ్ కావ్య ఇంతకుముందు ఒక మాయని తీసుకొచ్చావు, ఇల్లే మన రంగస్థలం అనుకుంటున్నావా, ఆ మాయ దొంగ మాయని తెలిసిన తర్వాత మా వదినకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు ఎవరికి హాట్ స్ట్రోక్ తెప్పించాలని అనుకుంటున్నావు అని అంటుంది రుద్రాన్ని వెంటనే కావ్య మీకే రుద్రాణి గారు అని అంటుంది. ఆ పని చేయవే బాబు దరిద్రం వదిలిపోతుంది నెలకొపిండం పెట్టి దండం పెడతాను అని స్వప్న అంటుంది. ఏమనుకుంటున్నారు మీ అక్క చెల్లెలు ఇద్దరు నాకే హార్ట్ స్ట్రోక్ తెప్పించాలనుకుంటున్నారా అని అంటుంది రుద్రాణి. ఈమె కూడా అసలు మాయో కాదు ఎవరికి తెలుసు ఈమె అసలు మాయం చెప్పడానికి మీ దగ్గర సాక్షాలు ఉన్నాయా అని అడుగుతుంది రుద్ర అని వెంటనే సుభాష్ నేనే సాక్ష్యం అని అంటాడు. ఈమె అసలు మాయ అని అంటాడు వెంటనే రుద్రాణి లేదు ఇదంతా అబద్ధం రాజు కావ్య అన్నయ్య ఒకటైపోయి ఇలా నాటకం ఆడుతున్నారు మా వదిన దగ్గర అన్నయ్య నిజం చెప్పడంతో మా వదిన అన్నయ్య ఇద్దరినీ కలపడానికే వీళ్లిద్దరూ ఇలా ప్లాన్ చేశారు అని అంటుంది రుద్రాణి. రాజ్ అవునా నీకు ఎలా తెలుసు అని అంటాడు. స్వప్న కల ఏమైనా వచ్చిందేమో లేదంటే అందరూ కలిసి పోయే టైం వచ్చిందని కుళ్ళు పుడుతుందో అని అంటుంది. ప్రకాశం నిన్ను ఆరోజే పాము ఉన్న ఫామ్ హౌస్ లో పంపించి ఉంటే బాగుండేది. పాముని ఇంట్లో పెట్టుకొని పెట్టాల్సి వచ్చింది అని అంటాడు. నీకు ఇలాంటి చావు తెలివితేటలు ఎలా వస్తాయి అత్త అని కళ్యాణ్ అంటాడు. ధాన్యం అసలు విషయం బయటపడకముందే నువ్వెందుకు ఉలిక్కి పడుతున్నావ్ రుద్రాణి అని అంటుంది. ఇక అందరూ తలా ఒక మాట అంటూ ఉంటే రాహుల్ కలగజేసుకొని చెప్పాను కదా మమ్మీ ఈ ఇంటి కోసం నువ్వు మంచి చెప్పినా వీళ్ళందరూ నిన్నే తిడతారని ఇప్పటికైనా మాట్లాడకుండా ఉండు అని అంటాడు రాహుల్.ఎంతమంది గడ్డి పెట్టినా కానీ గడ్డి తినే అలవాటు పోదు కదా అని అంటుంది స్వప్న.
![BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం.. 39 Brahmamudi June 22 Episode 443](https://newsorbit.com/wp-content/uploads/2024/06/2024-06-22-24.png)
ఇక రాజ్ మాట్లాడుతూ, మమ్మీ డాడ్ మోసపోయాడు ఇదంతా ముందుగా కావ్య కనిపెట్టింది తల్లి ప్రేమ పైన కావ్య అనుమాన పడింది నెలకు లక్షలు తీసుకుంటున్న మాయ నిజంగా తల్లి కాదేమోనని అనుమాన పడింది. అసలు నిజాలు బయట పెట్టాలనుకుంది ఒక సమయంలో తను ప్రమాదంలో కూడా పడింది అప్పుడు నేనే కాపాడాను. ఆ తర్వాత మాయ ఉండాల్సిన అడ్రస్ కి వెళ్తే అక్కడ దొంగ మాయే ఉంది ఆ మాయని తీసుకొచ్చి ఇంట్లో అందరి ముందు రుజువు చేయాలనుకుంటే ఆరోజు అది అలా జరిగిపోయింది కావ్యను మోసం చేసి ఆ మాయ ఇంట్లోకి అడుగు పెట్టింది దానివల్ల పరిస్థితి నా పెళ్లి దాకా వెళ్ళింది. ఆ పరిస్థితుల్లో డాడ్ తప్పనిసరి పరిస్థితుల్లో నిజం చెప్పాల్సి వచ్చింది అని రాజ్ అంటాడు. అయినాక అవి మాత్రం వెనకడుగు వేయలేదు తన ప్రయత్నం ఆపలేదు మాయని తీసుకొస్తుంటే ఆక్సిడెంట్ జరిగింది ఈ అసలు మా ఆయన తీసుకొచ్చే క్రమంలో మాయాకోమాలోకి వెళ్ళింది ఎవరో ఆమెకి యాక్సిడెంట్ చేశారు. ఇప్పుడు మీ మామయ్యని వెతకడానికి వెళ్తేనే ఎవరో రౌడీలు మా ఆయన తరుముకుంటూ వచ్చారు. ఆ రౌడీల నుంచి పారిపోతూనే మాయ మాకు దొరికింది అని రాజ్ నిజం చెప్తాడు. అప్పుడే కావ్య మాట్లాడుతూ అసలు నిజం ఇది కాక ఇంకా ఉంది ఇప్పుడు ఈ మాయ నోరు విప్పి నిజం చెప్తుంది తను ఏం చెప్తుందో మీరు వినండి ఇది మాత్రం నేను ఊహించని కదా అని కావ్య అంటుంది.
![BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం.. 40 Brahmamudi June 22 Episode 443](https://newsorbit.com/wp-content/uploads/2024/06/2024-06-22-25.png)
ఇక ఇందిరా దేవి మాట్లాడుతూ ఆ బిడ్డ ఏంటి? నీకు నా కొడుక్కి నిజంగానే సంబంధం ఉందా అని అడుగుతుంది. నేనే అసలు మాయని నా ప్రేమే ఏం లేకుండా సుభాష్ గారి జీవితంలో అడుగు పెట్టాల్సి వచ్చింది అని మాయ చెబుతుంది దాంతో సీతారామయ్య అంటే మీకు సంబంధం ఉన్న మాట నిజమేనా, ఆ బిడ్డ మీ ఇద్దరి బిడ్డ అని అడుగుతాడు. లేదు ఆ బిడ్డ నా బిడ్డ కాదు నేను ఆ బిడ్డకు తల్లిని కాదు ఆయన తండ్రి కాదు మీ ఇంటి పరువు తీయడానికో లేదంటే డబ్బు కోసమో నన్ను ఒకరు బెదిరించారు అనాధ శరణాలయం నుంచి బిడ్డను తీసుకొచ్చి నాటకం ఆడమని నాకు చెప్పారు. వాళ్లు అలా నాటకం ఆడమంటేనే నేను సుభాష్ గారిని బ్లాక్మెయిల్ చేసి నెలకి పది లక్షలు తీసుకోమంటేనే తీసుకున్నాను. లేకపోతే నా ప్రాణాలు తీస్తామని వాళ్ళు బెదిరించారు ఇక ఏం చేయాలో తెలీక సుభాష్ గారిని బెదిరించాల్సి వచ్చింది. అసలు ఈ బిడ్డకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు తప్పంతా చేసింది నేను అని మాయ అపర్ణ దగ్గరికి వెళ్లి ఇది నిజం విన్న తర్వాత మీ గుండెకు గాయం అవుతుందని నాకు తెలుసు ఇందులో ఆయన తప్పేం లేదు తప్పంతా నాదే నా ప్రాణాలు తీస్తానన్నా మళ్ళీ మీ జీవితంలోకి మీ ఎవరికి కనిపించను నన్ను క్షమించండి అని అపర్ణ కాళ్ళ మీద పడుతుంది మాయ. వెంటనే ధాన్యం ఈ మోసగా తిని పోలీసులకు పట్టించండి అని అంటుంది. మాయా మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అని అంటుంది. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అంటాడు ప్రకాశం వెంటనే ఇందిరా దేవి వద్దు అని ఆపుతుంది. బిడ్డ సంగతి పక్కన పెడితే అసలు తప్పు జరగలేదన్నది నిజం మీ అన్నయ్య చేసింది తప్పే కాదు, ఈ అమ్మాయిని ఎవరో పావులా వాడారు దాంట్లో ఆమె తప్పు కూడా ఏం లేదు కదా మరి అలాంటప్పుడు పోలీసులకు పట్టించాల్సిన అవసరం ఏముంది అని అంటుంది ఇందిరాదేవి ప్రకాశంతో, సీతారామయ్య కూడా మన ఇంటి పరువు తీయడానికి ఎవరో ప్రయత్నించారు వాళ్ళకి శిక్ష పడాలి ఈ అమ్మాయి కాదు నువ్వు ఇక నుంచి వెళ్ళిపో అని అంటాడు. మాయ అందరికీ దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
![BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం.. 41 Brahmamudi June 22 Episode 443](https://newsorbit.com/wp-content/uploads/2024/06/2024-06-22-26.png)
ఇక మాయ నిజం చెప్పడంతో దుగ్గిరాల ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. ఇందిరా దేవి నా కొడుకు మీద పడిన నింద పోయింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అపర్ణ నీకు కూడా సంతోషమే కదా అని అంటుంది. వెంటనే అపర్ణ తల ఊపుతుంది ఇక సుభాష్ కావ్య రాజ్ అందరూ చాలా సంతోషంగా ఉంటారు అప్పుడే రుద్రాణి అంత ప్రశాంతంగా ఉంటే ఎలా అని అంటుంది ఏం నీకు నిద్ర పట్టదా, తిన్న తిండి వంట పట్టదా అని అంటుంది స్వప్న. నేను అంటుంది ఆ బిడ్డ గురించి ఆ బిడ్డ సంగతి ఏంటి మాయ తనకే సంబంధం లేదని చెప్పి దండం పెట్టి వెళ్లిపోయింది ఇప్పుడు వాడిని ఏం చేయాలి, ఇదేం అనాధ అనాధలకు శరణాలయం కాదు కదా వాడిని ఏదో ఒక అనాధ శరణాలయంలో చేర్పించండి అని అంటుంది రుద్రాణి. ఆ మాటలకు కావ్యకి చాలా బాధేస్తుంది వెంటనే కావ్య నేను ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టినప్పటి నుంచి నాకు ఏం కావాలో నేను ఎవరిని ఏమీ అడగలేదు కానీ నేను మాత్రం ఆ బిడ్డ నీకు అన్న తల్లి స్థానంలో ఉండే పెంచాను. వాడిని అలా అనాధలా వదిలేయమంటే నేను వదిలేయలేను నేనే పెంచుకోవాలి అని అనుకుంటున్నాను అంటుంది కావ్య. ఆ మాటలు స్వప్న ఒసేయ్ పిచ్చిదానా నువ్వు ఇంకా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటావా ఏంటి అని అంటుంది. అప్పుడే రాజ్ లేదు స్వప్న తను అలా చెప్పడం కరెక్టే కళావతి నిర్ణయం నాకు నచ్చింది. నాకు రక్తసంబంధం లేకపోయినా ఆ బిడ్డతో చాలా అనుబంధం ఏర్పడింది. రెండు రోజులు ఆ దొంగ మాయ దగ్గర బాబుని వదిలిపెట్టినపుడు నేను చాలా బాధపడ్డాను అందుకే మేము అనాధాశ్రమాలయంలో ఆ బిడ్డను వదిలిపెడితే తట్టుకోలేము అని అంటాడు రాజ్. నేను కావ్య ఇద్దరం ఆ బిడ్డను పెంచుకోవాలనుకుంటున్నాము అని అంటాడు రాజ్ ఆ మాటలకి ఇందిరాదేవి చాలా సంతోషం ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అత్తమామల మధ్య నా గొడవ ని సద్దుమణిగేలా చేశావు దానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు నువ్వు నిజంగా మా ఇంటి మహాలక్ష్మివి అని ఇందిరా దేవి కావ్య తో అంటుంది. ఆ మాటలకు ఇంట్లో అందరూ సంతోషిస్తారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
![BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం.. 42 Brahmamudi June 22 Episode 443 Highlits](https://newsorbit.com/wp-content/uploads/2024/06/2024-06-22-27.png)
రేపటి ఎపిసోడ్ లో కావ్య రాజ్ గదిలో బెడ్ షీట్ మడత పెడుతూ ఉంటుంది. అప్పుడే రాజ్ కావ్య వెనకనుంచి సౌండ్ చేస్తాడు కావ్య వినపడేలా కావ్య ఒక్క సారిగా సౌండ్ ఏంటా అని ఉలిక్కిపడుతుంది. రాజ్ ని చూసి మీరా అని అంటుంది ఇంకా ఎవరనుకున్నావు అని అంటాడు రాజ్ నేను మీ కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది ఇంకా రాలేదేంట అని మీ గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది. ఇంకా స్టార్ట్ చేయండి అని అడుగుతుంది ఇంత ఫాస్ట్ గా ఉన్నావేంటి నువ్వు అని రాజ్ మనసులో అనుకుంటాడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నాను అని అంటాడు రాజ్.