NewsOrbit
రాజ‌కీయాలు

ఆయనకు రాజకీయ భవిష్యత్తు కల్లే

తిరుమల: టిడిపి అధినేత చంద్రబాబుపై తెలంగాణకు చెందిన ఆ పార్టీ మాజీ సీనియర్ నేత మాత్కుపల్లి నర్శింహులు మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.  చంద్రబాబుకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని  నర్శింహులు జోస్యం చెప్పారు. చంద్రబాబు పరాజయం తన కెంతో ఆనందాన్ని ఇచ్చిందని మోత్కుపల్లి పేర్కొన్నారు. నేడు మోత్కుపల్లి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలని తిరుమలలో మెట్టుమెట్టుకూ తాను మొక్కుకున్నాననీ, ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకునేందుకు వచ్చానని మోత్కుపల్లి అన్నారు. నమ్మినవారిని నట్టేట మంచే చంద్రబాబు రాజ్యసభ సీటును వంద కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ఒక్క ఎస్‌సికి గానీ, ఒక బిసికి గానీ పదవులు ఇవ్వలేదని మోత్కుపల్లి మండిపడ్డారు. తెలంగాణ నుండి చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తరిమివేశారనీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే జరిగిందని మోత్కుపల్లి అన్నారు.

రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపేలా వైఎస్ జగన్‌కు భగవంతుడు శక్తి సామర్థ్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు మోత్కుపల్లి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన సందర్భంలోనూ మోత్కుపల్లి ఆధ్వర్యంలో హైదరాబాదులో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Leave a Comment