NewsOrbit
న్యూస్

ముందస్తు బెయిల్‌పై తీర్పు రేపటికి వాయిదా

హైదరాబాద్: టివి 9 మాజీ సిఇఒ రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది.

ఫోర్జరీ నేరం కేసులో రవిప్రకాష్‌తో సహా సినీనటుడు శివాజీలపై    కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణకు హజరుకాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్   తిరస్కరణకు గురికావడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పోలీస్ విచారణకు రవిప్రకాష్ హజరుకావాల్సిందేననీ, విచారణకు వచ్చిన సమయంలో పోలీసులు అరెస్టు చేయడానికి వీలులేదనీ, ఒక వేళ అరెస్టు చేయాలంటే 48గంటల ముందు నోటీసు జారీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో పాటు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టులో విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల విచారణకు రవిప్రకాష్ హజరయ్యారు.

హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రవిప్రకాష్ తరపున ముందుగా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దిల్‌జిత్ సింగ్ అహ్లువాలియా వాదనలు వినిపించారు. తరువాత ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది నిందితుడు రవిప్రకాష్ తొమ్మిది శాతం ఉన్న షేర్లలో 40వేల షేర్లను 20లక్షల రూపాయలకు హీరో శివాజీకి చెల్లించినట్లు తప్పడు ద్రువపత్రాలు సృష్టించారనీ, నిజానికి ఫిబ్రవరి 2018న రవిప్రకాష్ నుండి ఎలాంటి షేర్లను శివాజీ కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. షేర్ల లావాదేవీలు చేసినట్లైయితే ఐటి లెక్కల్లో చూపించాలనీ, కానీ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ఐటికి చూపించలేదని కోర్టుకు వివరించారు. ఎన్‌సిఎల్‌టిలో శివాజీ చేత రవిప్రకాష్ కావాలని కేసు వేయించారని పేర్కొన్నారు. తప్పు చేయకుంటే రవిప్రకాష్  పారిపోవాల్సిన అవసరం లేదనీ, పోలీసుల విచారణకు పిలిచినా హజరుకాలేదని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల విచారణకు హజరయినా ఏ ఒక్క ప్రశ్నకు రవిప్రకాష్ సరైన సమాధానాలు చెప్పలేదని వివరించారు.

బెయిల్ మంజురు చేస్తే సాక్షాలను తారు మారు చేసే అవకాశం ఉన్నందున బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేశారు.

Related posts

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Leave a Comment