NewsOrbit
రాజ‌కీయాలు

‘చింతమనేనికి చక్రబంధం’

అమరావతి: వివాదాస్పద నేతగా గుర్తింపు తెచ్చుకున్న దెందులూరు టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఉచ్చుబిగుసుకొంటోంది. ఇప్పటికే ఆయనపై వ్యవసాయ శాఖ పైపులు దొంగిలించారన్న ఆభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరో వివాదంలోనూ ప్రభాకర్ చిక్కుకున్నారు. ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పశుసంవర్థక శాఖలో అక్రమాలు జరిగాయని వైసిపి నేత, ప్రస్తుత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నేడు ఆరోపించారు.

పశుసంవర్థక శాఖ నుండి లబ్దిదారులకు అందాల్సిన ఫలాలను చింతమనేని కుటుంబ సభ్యులు అక్రమంగా పొందారని అబ్బయ్య చౌదరి విమర్శించారు. లబ్దిదారుల జాబితాలో చింతమనేని ప్రభాకర్ భార్య, తండ్రి కేశవరావుల పేర్లు ఉన్నాయని అబ్బయ్యచౌదరి ఆరోపించారు.

ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌ దృష్టికి  వైసిపి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తీసుకువెళ్లడంతో వెంటనే ఆయన స్పందించారు. ఈ  వ్యవహారంపై విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు.

ఎన్నికల సమయంలో వైసిపి అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై చింతమనేని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం విదితమే.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

Leave a Comment