`అర్జున్ రెడ్డి`తో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ సందీప్ వంగా దీన్నే హిందీలోనూ రీమేక్ చేసి సక్సెస్ కొట్టాడు. ఈ సినిమా బాలేదంటూ విమర్శకులు సినిమాను విమర్శించారు. అయితే ఈ విమర్శకులకు సమాధానంగా సందీప్ మాట్లాడుతూ విమర్శకులు రెండు రేటింగ్ ఇస్తే.. ప్రేక్షకులు రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ప్రేమలో ఉండేవారు ఒకరినొకరు కొట్టుకుంటారని.. అలా కొట్టుకోకపోతే..వారు ప్రేమలో ఉండి ఉండరని చెప్పుకొచ్చారు. దీనిపై సింగర్ చిన్మయి పెద్ద స్థాయిలో ధ్వజమెత్తింది. సందీప్ వాదన సరైంది కాదంటూ ట్విట్టర్ ద్వారా బదులిచ్చింది. దీనిపై స్నేహితురాలికి హీరోయిన్ సమంత కూడా తన మద్దతుని తెలియజేసింది.
సందీప్ వ్యాఖ్యలు అసంతృప్తికరంగా ఉన్నాయని ట్విట్టర్లో తెలిపారు. దీనికి బదులుగా ఓ అంగ్ల మీడియా `అప్పుడేమో సమంత అర్జున్ రెడ్డి సినిమా బాగుంద`ని ప్రశింసించారంటూ, సమంత రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతుందని తెలిపింది. అయితే సదరు మీడియాకు కూడా సమంత గట్టిగానే బదులిచ్చింది. `ఒక సినిమాను ఇష్టపడటం వేరు. ఒకరు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించడం వేరు. నాకు `అర్జున్ రెడ్డి` కథ నచ్చింది. అలాగని మనతో ఉన్నవారిపై చేయి చేసుకోవడం నాకు నచ్చలేదు` అన్నారు
previous post
next post