కెరీర్ ప్రారంభంలోనే దక్షిణాది భాషల్లో హీరోయిన్గా పేరు సంపాదించుకుంది అమలాపాల్. అలాగే స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడే డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ను పెళ్లి చేసుకుని సెటిలైంది. మన్పర్ధలతో మూడేళ్లు గడవక ముందే విజయ్‌తో విడాకులు తీసుకుంది. అయితే డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ రీసెంట్గా డా.ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మాజీ భర్త వివాహం గురించి ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. అమలాపాల్ మాట్లాడుతూ “విజయ్ స్వీట్ పర్సన్. గ్రేట్ సోల్. ఆయనకు మంచే జరగాలి. వారికి చాలా మంది పిల్లలు పుట్టాలి` అంటూ విజయ్ పెళ్లి గురించి పాజిటివ్‌గా స్పందించింది. అమలాపాల్ ఈ నెల 19న తెలుగులో `ఆమె` సినిమాతో సందడి చేయనున్నారు.
previous post
next post
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!