ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఓ సినిమాపై చాలా కోపంగా ఉన్నాడు. ఆ సినిమా ఏదో కాదు.. వింకీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తోన్న`శ్రీదేవి బంగ్లా`. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా టీజర్ విడుదలై పలు వివాదాలకు కారణమైంది. ఆ టీజర్లో శ్రీదేవి అనే హీరోయిన్ బాత్ టబ్‌లో పడి చనిపోయే సన్నివేశం ఉంటుంది. ఇది దివంగత తార శ్రీదేవి చనిపోయిన సన్నివేశాన్ని పోలి ఉందని .. సినిమా కూడా ఆమె జీవితానికి సంబంధించే అయ్యుంటుందని.. అందుకే సినిమాకు `శ్రీదేవి బంగ్లా` అనే టైటిల్ పెట్టారని వార్తలు వినపడ్డాయి. టీజర్ విడుదలైన వెంటనే దర్శక నిర్మాతలకు బోనీకపూర్ నోటీసులు పంపారు. వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయే సరికి ఇప్పుడాయన సినిమా రిలీజ్‌ను ఆపే దిశగా చర్యలు తీసుకుంటున్నారని అందుకని, చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారని సినీ వర్గాల సమాచారం.
previous post
next post
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!