NewsOrbit
న్యూస్

వీడిన పార్శిల్ మిస్టరీ!

హైదరాబాద్ః సికింద్రాబాద్ పోస్టాఫీస్ లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా పలువురు ప్రముఖులకు పార్సిళ్ల ద్వారా వచ్చిన బాటిళ్లకు సంబంధించిన మిస్టరీ వీడింది. బాటిళ్లలో ఎలాంటి రసాయనాలూ లేవని మురుగు నీరు మాత్రమే ఉందని ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాథమిక నివేదిక తేల్చింది. పార్సిల్ బాటిళ్లతో పాటు ఒక లెటర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో విద్యార్థులు ఓయూలో మురుగు నీటినే తాగుతున్నారని రాశారు. కేసీఆర్ పేరిట అజ్ఞాత వ్యక్తులు ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 17న వీఐపీల పేర్లతో 62 కార్టన్ బాక్స్ లను బుక్ చేశారు. సీఎం కేసీఆర్ తోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, సినీ నటులు చిరంజీవి, వెంకటేష్ లాంటి ప్రముఖుల పేర్లతో ఈ పార్సిల్ లను బుక్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఒకే సారి వీఐపీలకు పార్శిల్ రావడంపై పోలీసులు కూడ విచారణ చేస్తున్నారు. ఈ బాటిల్స్ ఎక్కడ నుండి వచ్చాయనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓయూ పరిసర ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగుచెందిన వారు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నిరసన పద్ధతి ఎంచుకొని ఉంటారని పోలీస్‌లు భావిస్తున్నారు. విద్యార్థులెవరైనా ఇలా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment