హైదరాబాద్, జనవరి 16: తెలంగాణ శాసన సభ ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ శాసనసభ్యుడు మంతాజ్ అహ్మద్‌ఖాన్ బుధవారం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఖాన్‌తో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు.
ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన గురువారం ఉదయం 11.30గంటలకు తెలంగాణ శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో తొలుత ఎన్నికైన శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక నామినేషన్ నిర్వహించనున్నారు. ఈనెల 18న స్పీకర్ ఎన్నిక .
ఈనెల 19న ఉదయం 11.30గంటలకు తెలంగాణా శాసన మండలి సమావేశం ప్రారంభం అవుతుంది. అదేరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది.
previous post
next post