NewsOrbit
న్యూస్

బాబుపై వైకాపా మినిస్టర్ కి సాఫ్ట్ కార్నర్!

ఒక్కోసారి ప్రత్యర్ధులు చేసే విమర్శల్లో కూడా పనికొచ్చే చాలా ఇన్ ఫర్మేషన్ ఉంటుంది. కాకపోతే కాస్త జాగ్రత్తగా పరిశీలించి, వాటిని కేవలం విమర్శలకోణం నుంచే కాకుండా, మరో కోణంలో కూడా చూడాలి. అలా చూస్తే.. తాజాగా అలాంటి సూచనలే ఏపీ మంత్రి గారి నుంచి టీడీపీకి వస్తున్నాయి అని అర్ధమవుతుంది! కాకపొతే మనసుపెట్టి వినాలంతే! ఇంతకూ ఆ మంత్రివర్యులూ ఎవరు.. ఆయన చేసిన విమర్శలు ఏమిటి.. వాటిలో అంతర్లీనంగా ధ్వనించిన సలహాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

2009లో భీమిలి నియోజకవర్గంలో ప్రజారాజ్యం నుంచి గెలిచి, అనంతరం జరిగిన విలీన కార్యక్రమాల తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచి.. 2019 ఎన్నికల్లో మళ్ళీ భీమిలి టిక్కెట్ దక్కించుకుని వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి దక్కించుకున్న అవంతి శ్రీనివాస్ చేసిన తాజా విమర్శలపై విశ్లేషణలు సాగుతున్నాయి. క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఆ ఓటమికి లోకేష్ కారణం కాదా? ఆయన బంధుప్రీతి, కుల రాజకీయాలు కారణం కాదా? లోకేష్ నాయకత్వంలో నడుస్తామని విశాఖ జిల్లాలోని ఒక ఎమ్మెల్యే తో చెప్పించగలరా? అని ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నారు అవంతి!

విమర్శల కోణం నుంచి పక్కకు వచ్చి ఆలోచిస్తే… అవంతి అడిగిన ప్రశ్నలు అన్నీ కరెక్ట్‌ గానే ఉన్నాయి. లోకేష్ వల్లే పార్టీకి ఎక్కువ డ్యామేజ్ జరిగిందనేది టీడీపీ కార్యకర్తల మనసులో కూడా ఉన్న మాటే! కాకపోతే వాళ్లు బయటపడలేని పరిస్థితి. బాబు చుట్టూ ఉన్న కోటరీలో కూడా ఈ అభిప్రాయం లేనివారు లేరు! కానీ బాబుకు భయపడి, వారి వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్పందించరంతే. అవంతి అన్న మరో మాట… కేడర్ ఉన్న పార్టీ అని! అవును గ్రౌండ్ లెవెల్ లో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. కాకపోతే కేవలం సీబీఎన్ ఆర్మీని మాత్రమే బాబు పట్టించుకున్నారని, కేడర్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అప్పట్లో కామెంట్లు వచ్చాయి. ఇది బాబు అర్ధం చేసుకోవాలి!!

మరోమాట… లోకేష్ నాయకత్వంలో నడుస్తామని విశాఖ జిల్లలో ఒక్క ఎమ్మెల్యేతో అయినా చెప్పించగలరా అని? అవంతి అంత ధైర్యంగా ఆ మాట అన్నారంటే… బాబు విశాఖ టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో కాస్త జాగ్రత్త పడాలన్న మాట! గణబాబు ఈ మధ్య జగన్ ను ప్రశంసించడం.. “సమయం వచ్చినప్పుడు” అంటూ గంటా సైలంటుగా ఉండటం వీటికి ఉదాహరణలేమో! ఏది ఏమైనా… బాబుపై ఉన్న సాఫ్ట్ కార్నర్ తో ఇచ్చారో లేక తన విమర్శల్లో అంతర్లీనంగా ఇంత ఇన్ ఫర్మేషన్ దాగుందని గ్రహించక ఇచ్చారో తెలియదు కానీ… అవంతి బాబుకు మంచి సూచనలే చేశారు!

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N