NewsOrbit
న్యూస్

రఘురామకృష్ణంరాజు సస్పెన్షన్ కు సర్వం సిద్ధం?

ముఖ్యమంత్రికి, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నరసాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణం రాజు సస్పెన్షన్కు రంగం సిద్ధమైనట్లు ఉన్నత స్థాయి పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.రఘురామకృష్ణంరాజు వైఖరి పట్ల జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారంటున్నారు.

 

పైగా ఆదిలోనే ఇలాంటి అసమ్మతిని పనిచేయకపోతే అది మరికొందరి ద్వారా వ్యాపించే ప్రమాదం ఉంటుందన్న అంచనాతో రఘురామకృష్ణంరాజు పై వేటుకు వేటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నది ఆ వర్గాల కథనం.అయితే రఘురామకృష్ణంరాజు మాత్రం ఏమాత్రం వెనకంజ వేయకుండా ఇంకా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.ముఖ్యమంత్రి చుట్టూ ఒక కోటరీ ఏర్పడిందని ఆయన ఇంకో ఆరోపణ చేశారు.వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్నారెడ్డి, విజయ సాయిలతో పాటు ఓ అధికారి వల్ల సీఎం కి దగ్గర కాలేకపోతున్నామని తెలిపారు.


అ కోటరీ తన లాంటి వారిని సీఎం దగ్గరకు రానివ్వడం లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇద్దరు ముగ్గురు ఎంపీలను తప్ప మిగతా వారిని సీఎం కూడా కలవడం లేదని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.22మందిలో ఎంత మందిని సీఎం కలుసుకున్నారని ప్రశ్నించారు..సీఎం అంటే నాకు అత్యంత గౌరవం అని చెప్పారు. సీఎం ని నేరుగా కలిసే అవకాశం లేక మీడియా ద్వారా చెప్పాల్సి వచ్చిందని రఘురామకృష్ణంరాజు తెలపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు .టీటీడీ విషయంలో భక్తుడిగానే తాను స్పందించానని చెప్పారు. ఇసుక కొరత తీవ్రంగా ఉందని, 16వేలకు ధర పెరిగిందని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో కోర్టు తీర్పులే తాను ఉదహరించానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చే వరకు వేచి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.రమేష్ కుమార్ ని అభిశంసన చేసి ఉండాల్సిందని, ఎన్నికల సంస్కరణ అని చెబుతూ దుర్భాషలు ఆడటాన్ని ఆయన తప్పుపట్టారు. రమేష్ కుమార్ విషయంలో సీఎంని అందరూ తప్పు దోవ పట్టించారన్నారు.

తన నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా జరిగిన కొన్ని విషయాలను కూడా రఘురామరాజు బయటపెట్టారు. మాజీ ఎంపీ గంగరాజు కొడుకు రంగరాజుని తనకు మాట మాత్రం చెప్పకుండా వైసీపీ లోకి తెచ్చి పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు చేశారన్నారు. బీజేపీ నాయకుడి కొడుకుని వైసీపీలోకి తెచ్చారన్నారు.సీఎం మాత్రమే తమ నాయకుడు, ఆయనకు మాత్రమే జవాబుదారీగా ఉంటానని రఘురామ కృష్ణంరాజు చెప్పారు.తాను వైసీపీ నుండి సస్పెండ్ కావాలని కోరుకోవడం లేదని ఒకవేళ పార్టీ అధిష్టానం ఆ విధంగా నిర్ణయిస్తే తానేమీ చేయలేనని కూడా ఆయన చెప్పారు.ఈ ఇంటర్వ్యూలో రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు





Related posts

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N