NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Madhav Video Viral: టీడీపీకి ఎన్డీఏ ఆహ్వానమేలేదని కుండబద్దలు కొట్టిన బీజేపీ నేత

Madhav Video Viral: ఈ నెల 18న ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల కీలక భేటీ జరగనున్నది. ఈ భేటీకి సంబంధించి అటు జాతీయ మీడియాలో, ఇటు ఏపిలో టీడీపీ, అకాళీదళ్ తదితర పాత మిత్ర పక్షాలకు ఆహ్వానం అందింది అంటూ కథనాలు నిన్న సాయంత్రం నుండి వస్తున్నాయి. అయితే టీడీపీ అనుకూల మీడియాలో ఎన్డీఏ కీలక సమావేశానికి టీడీపీ అహ్వానం అందిందని, అయితే ఈ సమావేశానికి హజరు కావాలా లేదా అన్నది ఆ పార్టీ అధికారికంగా వెల్లడించలేదంటూ పేర్కొంటున్నాయి. మరో పక్క ఎన్డీఏ సమావేశానికి అహ్వానం వచ్చిందా లేదా అన్నదానిపైనా ఆ పార్టీ నుండి ఎటువంటి ప్రకటన లేదు. కానీ జరుగుతున్న ప్రచారంపై ఏపీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ  పీవీఎన్ మాధవ్ స్పందించారు.

BJP leader Madav

 

ఎన్డీఏ కూటమికి టీడీపీకి అహ్వానం అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఎన్డీఏ కూటమికి టీడీపీని అహ్వానించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కూటమిలో ఉన్న పార్టీలకు మాత్రమే ఆహ్వానం పంపించామని తెలిపారు. 2017లోనే ఎన్డీఏ కూటమి నుండి టీడీపీ బయటకు వెళ్లిందని అన్నారు. ప్రస్తుతం ఏపీలో తమ పొత్తు జనసేనతోనేనని ఆయన పేర్కొన్నారు. టీడీపీతో పొత్తుపై తుది నిర్ణయం పార్టీ అధిష్టానందేనని తెలిపారు. దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరికి ఏపి పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ను కూడా బీజేపీలోకి అహ్వానిస్తుట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కు పార్టీలోకి ఆహ్వానించలేదని మాధవ్ తెలిపారు.

మరో పక్క ఎన్డీఏ కూటమిలో చేరాలని వైసీపీకి అహ్వానం ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మాత్రం ఏ పార్టీతో పొత్తు లేకుండానే ఎన్నికల బరిలోకి వెళతామని స్పష్టం చేస్తున్నారు. ఎన్డీఏతో జత కడితే వైసీపీకి ఉన్న సంప్రదాయ ఓటింగ్ కు నష్టం జరుగుతోందని ఆ పార్టీ భావిస్తున్నదని అంటున్నారు. ఎన్డీఏ సమావేశానికి టీడీపీ ఆహ్వానమే లేదని మాధవ్ పేర్కొన్న వీడియో వైసీపీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Balasore Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటన కేసులో కీలక పరిణామం .. ముగ్గురు రైల్వే సిబ్బంది అరెస్టు

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N