21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆదాయం పెంపుపై కీలక నిర్ణయాన్ని తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

Share

ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) సమీక్ష జరిపారు. రిజిస్ట్రేషన్ శాఖల ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించేందుకు గానూ సీఎం జగన్ ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సీనియర్ ఐఏఎస్ లు కృష్ణబాబు, రజిత్ భార్గవ, నీరబ్ కుమార్ ప్రసాద్, గుల్బార్ లు ఉన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకత, సులభతర విధానాలను అమలు చేస్తూనే ఆదాయ పెంపుపై సూచనలు ఇవ్వాలని సదరు కమిటీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. రెండు వారాల్లో కమిటీ నివేదిక అందించాలని సూచించారు. పన్ను వసూళ్లలో లీకేజీ లను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని తెలిపారు.

AP CM Jagan

 

ఈ సందర్భంలో రాష్ట్రానికి వచ్చే అదాయాలు గాడిలో ఉన్నాయని అధికారులు వివరించారు. అర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆదాయాల ప్రగతి అశాజనకంగా ఉందన్నారు. జీఎస్టీ వసూళ్లు సహా ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న టార్గెట్ కు చేరువలో ఉన్నాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2022 వరకూ టార్గెట్ రూ.27,445 కోట్లు కాగా రూ.25,928 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు వివరించారు. ఈ కాలంలో దేశ జీడీపీ వసూళ్ల సగటు 27.8 శాతం కాగా, ఏపిలో 28.,79 శాతంగా ఉందని చెప్పారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రజలకు సులభతరం చేసేందుకు, అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రొఫెషనల్ ఏజన్సీల నుండి సలహాలు, సూచనలు స్వీకరించాలని సీఎం జగన్ సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సంపూర్ణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడిచేందుకు తగిన మార్గదర్శకాలను కూడా రూపొందించాలన్నారు. భూములు, ఆస్తులే కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోదగిన సేవల వివరాలను పోస్టర్ల రూపంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉండాలని అన్నారు. నాటు సారా తయారీ వృత్తిగా కొనసాగిస్తున్న వారి జీవితాలను మార్చేందుకు వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. అక్రమ మధ్యం తయారీ, నిరోధంపై గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.

మరో సారి తన దొడ్డ మనసును చాటుకున్న సీఎం జగన్ .. చిన్నారి వైద్య సాయానికి కోటి మంజూరు


Share

Related posts

Bigg boss Lasya : బిగ్ బాస్ లో లాస్య అందంగా తయారవ్వడానికి అసలు రహస్యం ఇదేనా?

Varun G

‘బాబుపై దాడి దుర్మార్గం’

somaraju sharma

గుడ్ న్యూస్ : ఐపీఎల్ కు లైన్ క్లియర్..! ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అంటే…

arun kanna