NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CM YS Jagan: జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు..! అవి ఏమిటంటే..!!

AP CM YS Jagan: ఏపిలో కర్ప్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం వైఎస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి సుమారు పది రోజులే దాటిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అదికారులకు సీఎం ఆదేశించారు.

AP CM YS Jagan key decisions on pandemic issue
AP CM YS Jagan key decisions on pandemic issue

కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ఏపిలో లాక్ డౌన్ విధించాలన్న డిమాండ్ వినబడుతోంది. దీనిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ అమలు చేస్తే ఫలితాలు కనబడతాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సమీక్ష జరిపిన సీఎం వైఎస్ జగన్ మరో రెండు వారాలు కర్ఫ్యూ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.

AP CM YS Jagan: అనాధలైన పిల్లలను ఆదుకునేందుకు..

 

ఇదే సమయంలో మరో కీలక నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారిని ఆదుకునేలా ఆర్థిక సహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. వారి పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా వారి ఖర్చుల కోసం అందేలా ఆలోచనలు చేయాలని అధికారులను ఆదేశించారు.

మధ్యప్రదేశ్ లో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు అక్కడి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉచిత విద్య, ఉచిత రేషన్ సరఫరాతో పాటు నెలకు రూ.5వేలు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఏపిలో సీఎం జగన్  అదే తరహా కాకపోయినా దాని కంటే మెరుగుగా పిల్లలను ఆదుకునేందుకు కార్యాచరణకు సిద్ధం చేస్తున్నారని టాక్.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju