NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా .. ‘నాట్ బిఫోర్’ మీ అంటూ తప్పుకున్న న్యాయమూర్తి

Share

Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్ దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ బెంచ్) ముందు విచారణకు రాగా.. నాట్ బిఫోర్ మీ అంటూ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ నుండి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో విచారణ చేపట్టలేనని న్యాయమూర్తి తెలియజేస్తూ .. సీజే సోమవారం (30వ తేదీ) విచారణ చేపడతారని న్యాయమూర్తి తెలిపారు.

దీనిపై చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ కోరుతున్నామనీ, వైద్యులు చేసిన సూచనల కారణంగా తక్షణం చంద్రబాబుకు పలు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, కావున సోమవారం కాకుండా వెంటనే విచారణ చేపట్టేలా సీజేకి తాము విజ్ఞప్తి చేసుకుంటామని తెలిపారు. చంద్రబాబు తరపు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసు బదిలీ చేశారు. ఎవరు విచారణ చేపడతారనే నిర్ణయం హైకోర్టు రిజిస్ట్రార్ కే న్యాయమూర్తి వదిలివేసారు.

దీంతో ఈ పిటిషన్ ను ఏ బెంచ్ విచారించాలనే అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 19వ తేదీన హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సందర్భంలో చంద్రబాబు తరపు న్యాయవాదుల విజ్ఞప్తి పై వెకేషన్ బెంచ్ ముందుకు వాయిదా వేసింది.

మరో పక్క ఏసీబీ కోర్టులో సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై విచారణ జరిగింది. చంద్రబాబు అరెస్టు చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డు భద్రపరచాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్టు చేసిన సమయంలో ఇతర వ్యక్తుల డైరెక్షన్ లో సీఐడీ అధికారులు పని చేశారని చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనగా ఉంది. కాల్ డేటా రికార్డు పిటిషన్ పై కోర్టు ఆదేశాల మేరకు నిన్న సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్చకు భంగం కలుగుతుందని సీఐడీ తరపు న్యాయవాదులు కౌంటర్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఇవేళ ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ నెల 31వ తేదీన కాల్ రికార్డ్స్ పిటిషన్ పై తీర్పు వెల్లడించనున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది.

TTD Jobs: ఇంజనీరింగ్ పట్టభద్రులకు టీటీడీ గుడ్ న్యూస్ ..లక్షన్నర వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల


Share

Related posts

Samantha: ఆ లగ్జరీ హోటల్​కి షిఫ్ట్ అయిన సమంత.. 40 రోజుల పాటు అక్కడేనట.. ఎవరితోనో తెలుసా..

Ram

Naga chaithanya : నాగ చైతన్య రూటు మారిస్తే సక్సస్ లకి బ్రేక్ పడుతుందేమో ..?

GRK

Suma Kanakala: సుమ యాంకరింగ్ మనేస్తుందా.!? ప్రూఫ్ ఇదిగో..!

bharani jella