NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram October 27 Episode 1084: అను లాకెట్ దొరికించుకున్న ఆకాంక్ష అభయ్!

Prema Entha Madhuram today episode october 27 2023 episode 1084 highlights

Prema Entha Madhuram October 27 Episode 1084: వాళ్ల ముగ్గురిని చూసిన ఆర్య తన మొహానికి టవల్ కట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని చితక కొట్టి ఇంటికి వెళ్లిపోతాడు. కట్ చేస్తే అమ్మ అప్పుడప్పుడు ఇలా బయట పడుకుందామని అంటావు ఎందుకమ్మా అని ఆకాంక్ష అంటుంది. పైకి ఒకసారి అలా చూడండి అని అను అంటుంది. అరే చందమామ కనిపిస్తుంది అని అభయ్ అంటాడు. అప్పుడప్పుడు ఇలా బయట పడుకొని చందమామనే చూస్తూ ఉంటే మనసులో ఎంత బాధ ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది నాన్న అందుకే అప్పుడప్పుడు ఆరు బయట పడుకోవాలి అని అను అంటుంది. అవునా అమ్మ అయితే చందమామ కథ చెప్పవా అని ఆకాంక్ష అంటుంది.

Prema Entha Madhuram today episode october 27 2023 episode 1084 highlights
Prema Entha Madhuram today episode october 27 2023 episode 1084 highlights

అలాగే అని అను అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ప్రజల క్షేమం కోసం మారువేషంలో తిరుగుతూ ఉండేవాడు అని అను అంటుంది. మారువేషంలో ఎందుకు తిరగాలి అమ్మ రాజ గా ఉన్నప్పుడు రాజు లాగానే తిరిగితే ఏమవుతుంది అని అభయ్ అంటాడు. ఎందుకు అంటే రాజుగా వెళితే వాళ్ళ కష్టాలు తెలవవు కాబట్టి మారువేషంలో ఉండి వెళ్లి చూసేవాడు అని అను అంటుంది. కట్ చేస్తే సూర్య ఇన్ని రోజులు పడుకునే ముందు రేపటి రోజు ఎలా గడుస్తుంది ఇంట్లో ఏమీ లేవు కదా అని బాధతో పడుకునే దాన్ని రా కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు కదా నిర్భయంగా పడుకుంటాను ఇకనుంచి అన్ని నువ్వే చూసుకో ఇక నాకు ఏ బాధ్యత లేదు అని ధైర్యంతో సంతోషంగా పడుకుంటాను రా అని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram today episode october 27 2023 episode 1084 highlights
Prema Entha Madhuram today episode october 27 2023 episode 1084 highlights

అమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు లేట్ అయిపోయింది వెళ్లి పడుకోండి అని ఆర్య అంటాడు. సూర్య నువ్వు ఒక్కడివే బయట ఎందుకు నాన్న నువ్వు కూడా లోపల వచ్చి పడుకో అని సుగుణ అంటుంది. ఇన్నాళ్లు ఈ ఇంటికి ఏ తోడు లేదని పొగరుతో మిమ్మల్ని అవమానిస్తూ చూసేవాళ్ళు కదమ్మా వాళ్లకి నేను వచ్చానని తెలియాలి కదా అందుకే బయట పడుకుంటాను మీరు లోపలికి వెళ్లి పడుకోండి అని ఆర్య అంటాడు. అలాగే అని సుగుణ ఉషా లోపలికి వెళ్లి పడుకుంటారు. కట్ చేస్తే అమ్మ ఆ రాజుకి రాణి లేదా రాణి కూడా ఉంటే బాగుండేది కదా అని ఆకాంక్ష అంటుంది. ఓ పిచ్చి మొహం దాన రాజన్నప్పుడు రాణి ఎందుకు ఉండదే ఆ రాజ్యానికి రాజు తో పాటే రాని కూడా ఉంటుంది అని అభయ్ అంటాడు.

Prema Entha Madhuram today episode october 27 2023 episode 1084 highlights
Prema Entha Madhuram today episode october 27 2023 episode 1084 highlights

ఉందమ్మా రాజు కి కూడా రాని ఉంది చాలా అందగత్త అని చెబుతూ అను తను ఆర్యాతో ఉన్న రోజు నీ గుర్తుకు తెచ్చుకుంటుంది.అక్కడేమో అను ఆర్యతో ఉన్న రోజులు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటే ఇక్కడ ఆర్య కూడా ఆరుబయట మంచం వేసుకొని పడుకొని అనుకోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో తెల్లవారింది అను అమ్మవారి పూజ మొదలు పెడుతూ అమ్మ ఈ పూజ నిర్విఘ్నంగా సంపూర్ణమై ఆర్య సార్ ఆరోగ్యంగా ఉండాలి అని అను అమ్మవారిని వేడుకుంటుంది. అభయ్ ఆకాంక్ష వాళ్ళ అమ్మకి పూజ కోసం అన్ని సిద్ధం చేస్తారు. పిల్లలు నాకోసం మీరు ఇవన్నీ ఏర్పాట్లు చేశారా అని అను అంటుంది. అవునమ్మా ప్రతి సంవత్సరం నువ్వు పూజ ఎలా చేస్తావో మాకు తెలుసు కాబట్టి ఇవన్నీ సిద్ధం చేశాము ఉండు నీ కాళ్లకు పసుపు పెడతాను అని ఆకాంక్ష వాళ్ళ అమ్మ కాళ్ళకి పసుపు పెట్టి ఒక జోల్లె సంచిని ఇచ్చి అమ్మ ఇక నువ్వు బిక్షకు వెళ్లి రా అని అంటుంది.

Prema Entha Madhuram today episode october 27 2023 episode 1084 highlights
Prema Entha Madhuram today episode october 27 2023 episode 1084 highlights

అలాగే వెళ్తాను కానీ ఇంటికి పూజ కోసం అని ఎవరైనా వస్తే వాళ్లను కూర్చోమని చెప్పండి అల్లరి చేయకండి నేను త్వరగా నే వస్తాను అని అను అంటుంది. అలాగే అమ్మ మేము అల్లరి చేయము వచ్చిన వాళ్ళను బాగానే చూసుకుంటాం నువ్వు వెళ్లి త్వరగా బిక్ష అడుక్కొని రా అని పిల్లలు ఇద్దరు అంటారు. అలాగే పిల్లలు నేను త్వరగా వచ్చేస్తానే అని చెప్పి వెళ్ళిపోతుంది అను. అను అలా వెళ్ళిపోగానే అన్నయ్య మనమిద్దరం ఇప్పుడు పూజ మందిరం దగ్గర కలర్ లతో డిజైన్ వేద్దామా అని ఆకాంక్ష అంటుంది. నాకు డిజైన్స్ రావు కదా అక్కి అని అభయ్ అంటాడు. అన్నయ్య మన దగ్గర కలర్ పేపర్లు డిజైన్ తో కట్ చేసి ఉన్నాయి కదా అవి అక్కడ పెట్టి వాటి మీద కలర్లు పోస్తే డిజైన్ గా మారిపోతుంది అని ఆకాంక్ష అంటుంది. అయితే పేపర్లు తెద్దాం పద చెల్లి అని కబోర్డ్ దగ్గరికి వెళ్లి వెతుకుతారు. అన్నయ్య అవి ఈ కబోర్డ్ లో లేవు పైన ఉన్నాయి చూడు అవి ఎలా అందుతాయి అని ఆకాంక్ష అంటుంది.

Prema Entha Madhuram today episode october 27 2023 episode 1084 highlights
Prema Entha Madhuram today episode october 27 2023 episode 1084 highlights

అయితే స్టూల్ వేసుకొని ఎక్కువ చెల్లి అవి అందుతాయి అని అభయ్ అంటాడు. అలాగే అన్నయ్య అని ఆకాంక్ష స్టూల్ తెచ్చుకొని దాని మీదికి ఎక్కి కలర్ పేపర్లు తీద్దామని ఎంత ప్రయత్నించినా అవి అందవు అన్నయ్య అందట్లేవురా అని ఆకాంక్ష అంటుంది. ఇంకొకసారి ట్రై చెయ్ చెల్లి లేకపోతే మనం కలర్లు ఎలా వేస్తాము అని అభయ్ అంటాడు. అలాగే అన్నయ్య అని ఆకాంక్ష మళ్లీ ఆ పేపర్లు తీయబోతుండగా అన్ని కింద పడిపోతాయి అయ్యో అన్నయ్య అమ్మ చూస్తే కొడుతుంది ఇవన్నీ సర్దేద్దాము అని అన్ని సర్దుతూ ఉండగా అందులో ఒక లాకెట్టు దొరుకుతుంది. అరే ఈ చైను ఎప్పుడూ అమ్మ దగ్గర కనిపించలేదు అని అభయ్ అంటాడు.

Prema Entha Madhuram today episode october 27 2023 episode 1084 highlights
Prema Entha Madhuram today episode october 27 2023 episode 1084 highlights

అన్నయ్య ఈ చైను నాకు చాలా బాగా నచ్చింది నేను వేసుకుంటాను అని ఆకాంక్ష అంటుంది. అలాగే వేసుకుందువు గానిలే ఒకసారి ఇలా ఇవ్వు అని అభయ్ లాకెట్ తీసుకొని ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఈ రెండు చిన్నపిల్లల ఫోటోలు కనిపిస్తాయి వీళ్ళు ఎవరు చెల్లి చిన్నపిల్లల ఉన్నారు మనం కాదే అని వాళ్ళిద్దరూ ఆలోచించి అన్నయ్య ఇవి అమ్మానాన్న చిన్నప్పుడు ఫోటోలు అనుకుంటా చిన్నప్పుడు అమ్మానాన్న ఎంత అందంగా ఉన్నారో చూడు కానీ ఇప్పుడు పెద్దై ఉంటాడు కదా డాడీ ఎలా ఉన్నాడు ఏమో మనకు తెలియదు కదా ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య అని ఆకాంక్ష అంటుంది. దీని గురించి తర్వాత ఆలోచిద్దాం అక్కి ఇది జాగ్రత్తగా దాచిపెట్టు అని అభయ్ అంటాడు. అలాగే అన్నయ్య ఇది నా మెడలో వేసుకుని జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆకాంక్ష తన మెడలో వేసుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N