Madhuranagarilo Episode 193: రుక్మిణి రాధా కి ఫోన్ చేసి హలో రాధా నేను మీ రుక్మిణి అక్కని అని అంటుంది. అక్క నువ్వు బతికే ఉన్నావా అని రాదా సంతోషంతో అంటుంది. అవన్నీ తర్వాత ఇంటికి వచ్చినాక చెబుతాను కానీ నీకు పెళ్లి అయ్యిందట కదా మీ ఆయనని ఎప్పుడు చూపెడతావు అని రుక్మిణి అంటుంది. ఎప్పుడో ఎందుకు అక్క ఇప్పుడు బయలుదేరి ఇంటికి వస్తున్నాం అక్కడ చూద్దువు గానిలే అని రాదా అంటుంది. ఏంటి రాధా నీ మొహం లో సంతోషం వెలిగిపోతుంది అని శ్యామ్ అంటాడు. ఏమీ లేదండి చనిపోయింది అనుకున్నా మా అక్క బ్రతికే ఉందట ఇంటికి వస్తుందట మనం త్వరగా వెళ్ళాలి అని రాదా అంటుంది. అందుకే నీ సంతోషమంతా అయితే వెళ్దాం పద అని శ్యామ్ అంటాడు.

అని వాళ్ళు బయలుదేరుతూ ఉండగా శ్యామ్ రాధకి ఇచ్చిన ఫ్యామిలీ ఫోటో కింద పడి పగిలిపోతుంది ఏంటండీ ఇలా జరిగి ఉంటుంది అని రాదా బాధపడుతుంది.ఏమి అవదులే రాదా ఏదో పొరపాటున జారి కింద పడింది దానికి ఎందుకు అంతలా బాధపడతావు అని శ్యామ్ అంటాడు. మీరు ఎంతో ప్రేమగా ఇచ్చారండి ఈ గిఫ్ట్ ఇలా కిందపడి పగిలిపోయింది అంటే మీకు మాత్రం బాధగా లేదా అని రాదా అంటుంది. నాకు బాధగానే ఉంది రాధా కానీ ఏం చేస్తాం జరిగిపోయింది కదా దాని గురించి వదిలేసేయ్ మీ అక్క ఇంటికి వస్తుంది అన్నావు కదా వెళ్దాం పద అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే అమ్మ రాదా డెడ్ బాడీ ని చూడకుండా నేను ఇక్కడి నుంచి రాను అయినా నేను అక్కడికి వచ్చిన నువ్వు ప్రశాంతంగా ఉండవు నేను సంతోషంగా ఉండలేను రాదా ను చంపే హైదరాబాదులో అడుగు పెడతాను అని సంయుక్త అంటుంది.

సంయుక్త అలా ఫోన్లో మాట్లాడుతూ ఉండగా రాధ వాళ్ళు వెళ్దామని వస్తూ ఉంటే సంయుక్త ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది సంయుక్త ని చూసిన శ్యామ్ ఎందుకిలా చేశావు అని అడుగుతాడు. నేనేం చేశాన ని అంటునవూ అని సంయుక్త అంటుంది. నువ్వు బ్రిడ్జి మీద నుంచి రాదని తోసేసి చంపాలనుకున్న మంటల్లో తోసి ప్రాణం తీయాలి అనుకున్నావ్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నావ్ అని శ్యామ్ అంటాడు. నేను రాదని ఎందుకు చంపాలనుకుంటాను అని సంయుక్త అంటుంది. నువ్వు ఉండాల్సిన ప్లేస్ లో తను ఉందని చేసావేమో అని శ్యామ్ అంటాడు.

అలా ఆలోచించే దాన్ని అయితే రాదని నువ్వు పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు హారతి ఇచ్చి ఎందుకు లోపలికి తీసుకు వెళ్తాను ఆలోచన ఉన్నదాన్ని అయితే మధురానగర్ కాలనీ వదిలిపెట్టి మా ఇంటికి ఎందుకు వెళ్ళిపోతాను రాధా నీ భార్య అయ్యిందని బాధ ఉంది కానీ రాదను చంపే అంత పగ నాకు లేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అని సంయుక్త అంటుంది. తను చెప్పింది కూడా కరెక్టే కదా సార్ అని రాదా అంటుంది.

నువ్వు మమ్మల్ని చూసి షాక్ అయ్యేసరికి ఇవన్నీ చేసావని అనుకున్నాను సారీ ఏమీ అనుకోకు సంయుక్త అని శ్యామ్ అంటాడు. మనలో మనకు సారీలు ఎందుకు లేండి అని సంయుక్త అంటుంది. సార్ మనకు లేట్ అయిపోతుంది వెళ్దాం పద అని రాధా శ్యామ్ ను తీసుకొని వెళ్ళిపోతుంది.వదిలిపెట్టను రాదని అడ్డు తొలగించి ఆ ఇంటికి కోడలుగా వెళ్తాను అని సంయుక్త అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే రుక్మిణి వాళ్ళ ఇంటికి తిరిగి వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న సంతోషంతో పగిపోయి అమ్మ నువ్వు ఇన్నాళ్లు ఎక్కడున్నావో చనిపోయామనుకున్నాము అని మురళి అంటాడు.

అవును నాన్న నేను ఒకతని ప్రేమించి పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం ఉండదని మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను పెళ్లయిన తర్వాతే తెలిసింది అతడు దుర్మార్గుడని ఒక్క మగవాడి చేతిలో ఓడిపోయానని ఆత్మహత్య చేసుకుదమనుకునే లోపు నా కడుపులో పండు పడ్డాడు వాడిని ఎందుకు చంపడం అని వాడిని కన్నదాక బ్రతికి ఉండి రాదా కు అప్పజెప్పి వెళ్ళిపోయి నేను రోడ్డు మీద నిలబడితే ఒక కారు వచ్చి నన్ను ఉద్దేశించింది అప్పుడు నేను కోమాలకి వెళ్ళిపోయాను ఇన్నాళ్ళకి మళ్ళీ కోమా నుంచి బయటికి వచ్చి ఇలా ఇంటికి తిరిగి వచ్చాను అని రుక్మిణి జరిగిందంతా చెబుతుంది. ఏదైతేనే అమ్మ ఇన్నాళ్లకైనా నువ్వు తిరిగి వచ్చావు అని మురళి అంటాడు. నాన్న రాదా కు పెళ్లయిందట కదా చెల్లె ఇప్పుడు మన ఇంటికి వస్తుంది అని రుక్మిణి అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది