NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Bhumana Karunakar Reddy: శాసనసభ ఉప సంఘం చైర్మన్ భూమన కీలక వ్యాఖ్యలు

Bhumana Karunakar Reddy: శాసనసభ ఉప సంఘం చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన బుధవారం వెలగపూడి సచివాలయంలో డేటా చోరీ, పెగసస్, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై విచారణ కమిటీ భేటీ అయ్యింది. భేటీ అనంతరం భూమన కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 నుండి 2019 మధ్య పెద్ద కుట్ర జరిగిందని అన్నారు. రాజ్యాంగంలోని వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్దంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. దీంతో ప్రజల భద్రతకు కూడా ప్రమాదకరంగా పరిణమించిందని వ్యాఖ్యానించారు.

Bhumana Karunakar Reddy Key Comments on chandrababu govt
Bhumana Karunakar Reddy Key Comments on chandrababu govt

 

ఆనాడు టీడీపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లే ఉంచి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించేందుకు ప్రైవేటు ఏజన్సీల ద్వారా ప్రయత్నించారని అన్నారు. ప్రజల వ్యక్తిగత డేటా దొంగిలించి ఉడ్డదారుల్లో రాజకీయ లబ్దిపొందేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. దీని వెనుక పెద్దపెద్ద వ్యక్తుల పాత్ర కూడా ఉందని దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఉప సంఘం సభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి, మద్దాలి గిరి, డాక్టర్ మొండితోక జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు హయాంలో ఏపిలో పెగాసస్ స్పైవేర్ ఉపయోగించారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెసిసిందే. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పెగాసస్ పై ఏపి అసెంబ్లీలో చర్చించిన అనంతరం విచారణకు ప్రభుత్వం ఉప సంఘాన్ని నియమించింది. భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఉప సంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఉప సంఘం పలు దఫాలు సమావేశాలను నిర్వహించింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju