Chittoor: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తాటిమాకులపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎర్రమట్టిపల్లి హరిజన వాడకు చెందిన తండ్రీకొడుకు బావులో పడి మృతి చెందారు. హరిజనవాడకు చెందిన సెల్వరాజ్ తన పదేళ్ల కుమారుడు ధనుష్ కు ఈత నేర్పించేందుకు తీసుకువెళ్లాడు. బావులో లోతు ఎక్కువగా ఉండటంతో తండ్రీకొడుకు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
YS Jagan: సాత్విక్ – చిరాగ్ లకు అభినందనలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్