NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మార్గదర్శి హెడ్ ఆఫీసులో కొనసాగుతున్న ఏపీ సీఐడీ సోదాలు .. అక్రమాలు నిజమేనన్న సీఐడీ ఏడీజీ సంజయ్

cid searches Hyderabad margadarsi head office

హైదరాబాద్ లోని మార్గదర్శి కేంద్ర కార్యాలయంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు తొమ్మిది గంటలుగా తనిఖీలు చేస్తున్నారు. మార్గదర్శి ఆఫీసులోని బ్యాలెన్స్ షీట్లతో పాటు ఇతర డాక్యుమెంట్లను సీఐడీ బృందం పరిశీలిస్తొంది. రేపు కూడా  సోదాలు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్ లను సీఐడీ అధికారులు విచారించారు. విచారణ సమయంలో డాక్యుమెంట్ లు చూపాలని సీఐడీ అధికారులు కోరగా తమ వద్ద డాక్యుమెంట్లు లేవని వారు తెలిపారనీ, దీంతో ఆఫీసుకు సీఐడీ బృందం వచ్చి డాక్యుమెంట్లు పరిశీలన చేస్తున్నారు. మరో పక్క సీఐడీ కార్యాలయంలో విచారణకు హజరు కావాలంటూ శైలజా కిరణ్ కు నోటీసులు కూడా ఇచ్చారు.

cid searches Hyderabad margadarsi head office
cid searches Hyderabad margadarsi head office

 

ఇదిలా ఉంటే .. మార్గదర్శి చిట్ ఫండ్ లో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ సంస్థ అక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన చెప్పారు. చిట్ పండ్ చట్టం 1982 ను మార్గదర్శి యాజమాన్యం ఉల్లంఘించిందన్నారు. చిట్ కట్టిన చందాదారుల సొమ్మును దారి మళ్లించడం నేరమేనని అన్నారు. సంస్థ మొత్తం మునిగిపోయేంత వరకూ ప్రభుత్వం చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోదని సంజయ్ హెచ్చరించారు.

ఎవరు ఫిర్యాదు చేయకపోయినా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ విషయాన్ని గతంలోనే సుప్రీం కోర్టు శ్రీరామ్ చిట్ ఫండ్స్ కేసులో చెప్పిందని సంజయ్ గుర్తు చేశారు. మార్గదర్శి యాజమాన్యం పూర్తిగా నిబందనలు ఉల్లంఘించిందని తమ సోదాల్లో నిర్దారణ అయ్యిందని, మనీలాండరింగ్ నిధుల మళ్లింపు కూడా జరిగిందని ఆయన పేర్కొన్నారు.  నియంత్రణ సంస్థలకు కూడా అవసరమైన పత్రాలను మార్గదర్శి సమర్పించకపోవడం మోసగించడం కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో ఏ 1 నుండి ఏ 5 వరకూ నిందితులను ప్రశ్నించామనీ, కానీ వారు సరైన సమాదానాలు ఇవ్వలేదన్నారు. దీంతో మార్గదర్శిలో అక్రమాలు జరిగాయని మరింత తేటతెల్లమవుతుందన్నారు.

YS Jagan: చంద్రబాబు సెల్పీలకు జగన్ కౌంటర్ ఇది

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju