CM YS jagan: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని బ్రహ్మణపల్లి – గుమ్మటం తండా వద్ద ఏర్పాటు చేస్తొన్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు పనులను ఏపి సీఎం వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎనర్జీ ప్రాజెక్టును గ్రీన్ కో గ్రూపు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం గ్రీన్ కో గ్రూపు సంస్థ మూడు బిలియన్ యూఎస్ డాలర్లు పెట్టుబడిగా పెడుతుండగా, ఒకే యూనిట్ నుండి సోలార్, విండ్, హైడల్ పవర్ లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ ప్రాజెక్టు ద్వారా 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. గ్రీన్ కో ఎనర్జీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే 2,800 ఎకరాలు కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది.
ఇంటిగ్రెటెడ్ పునరుత్పాదక ఇంథన ప్రాజెక్టులో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3వేల మెగావాట్లు, విండ్ పవర్ 550 మెగావాట్లు, హైడల్ పవర్ 1860 మెగావాట్లు ఉత్పత్తి చేస్తారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే అయిదేళ్లలో పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 23వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తం 5,410 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసి నేషనల్ గ్రిడ్ కు అనుసంధానించి ఓర్వకల్లు పీజీసీఐఎల్, సీటీయూ విద్యుత్ సబ్ స్టేషన్ ద్వారా దేశంలోని డిస్కమ్ లు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ముందుగా సీఎం జగన్ పవర్ ప్రాజెక్టు త్రీడీ మోడల్ నమూనాను ప్రారంభించారు. అనంతరం పైలాన్ ను ఆవిష్కరించారు. తదుపరి కాంక్రీట్ వేసి ప్రాజెక్టు పనులను ప్రారంభించారు.
Read More: YSRCP Rajya Sabha: ఏపి వైసీపీ రాజ్యసభ స్థానాల్లో అనూహ్యంగా తెరపైకి కొత్త నేత పేరు..?
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ కర్నూలులో హైడల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రెటెడ్ పునరుత్పాదక ఇంథన ప్రాజెక్టుకు కర్నూలు వేదిక కావడం గర్వకారమని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే 15వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. అయిదేళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగుతాయని తెలిపారు సీఎం జగన్.
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…