NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Corona: క‌రోనా వ్యాక్సిన్ క‌ష్టాలు ఇక ఉండ‌వు…ఏం జ‌రుగుతుందో తెలుసా?

Corona:దేశంలో ఇప్పుడు క‌రోనా క‌ల‌క‌లం ఎంత చ‌ర్చ‌నీయాంశంగా మారింది… క‌రోనా వ్యాక్సిన్ కొర‌త అనే టాపిక్ సైతం అదే రీతిలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డానికి ఏకైక మార్గం వ్యాక్సిన్. దేశ‌వ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు.. ఇక‌, ఇత‌ర దేశాల‌కు కూడా వ్యాక్సిన్ల‌ను ఎగుమ‌తి చేస్తోంది భార‌త్.. దీంతో.. వ్యాక్సిన్ నిల్వ‌లు నిండుకున్నాయ‌నే ర్త‌లు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది.

 

వేగంగా అడుగులు….

కోవిడ్‌కు వ్యాక్సిన్‌తో చెక్ పెట్టేందుకు మ‌న‌దేశం వ‌డివ‌డిగా ముందుకు అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. భారత్‌ లో ఇప్పటికే మూడు టీకాలు అనుమతులు పొందాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితాలో ఉన్న అమెరికా ఎఫ్‌డీఏ, ఈఎంఏ, బ్రిటన్‌ ఎంహెచ్‌ఆర్‌ఏ, పీఎండీఏ జపాన్‌ వంటి విదేశీ ఔషధ నియంత్రణ సంస్థలు ఇప్పటికే పలు టీకాలకు ఆమోదం తెలిపాయి. విదేశాల్లో అనుమతి పొందిన వ్యాక్సిన్‌ లకు అనుమతి ఇచ్చేందుకు వ్యాక్సిన్‌లపై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందం సిఫార్సు చేసింది. ముందుగా 100 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ ఇచ్చి ఫలితాలపై వారం పాటు విశ్లేషణలు జరపనున్నారు. ఇప్పటికే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మరి కొన్ని నెలల్లోనే జాన్సన్‌ అండ్‌ జాన్సన్, జైడస్‌ క్యాడిలా, నోవావాక్స్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన నాసిల్‌ డ్రాప్‌ టీకాలు అందుబాటులోకి రానున్నాయి.

స్పుత్నిక్ సంగ‌తేంటి?

స్పుత్నిక్ వి కూడా వ‌స్తుండ‌డంతో.. ఈ వ్యాక్సిన్ ధ‌ర ఏంటి..? ఎలా ప‌నిచేస్తుంది..? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఇలాంటి అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే, ఈ టీకా ప‌నివిధానం భేష్ అని ఇప్ప‌టికే తేల్చాయి ప‌రిశోధ‌న‌లు.. లాన్సెట్‌లో ప్ర‌చురించిన డేటా ప్ర‌కారం 60 ఏళ్లు పైబ‌డిన వాళ్ల‌లో స్పుత్నిక్ వి సామ‌ర్థ్యం 91.8 శాతం. మ‌ధ్య‌స్థ స్థాయి నుంచి తీవ్ర స్థాయి కొవిడ్‌-19 విష‌యంలో 100 శాతం స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశాయి. మ‌రోవైపు భార‌త్‌లో మొత్తం 13 వేల మంది క్లినిక‌ల్ ప్ర‌యోగాల్లో పాల్గొన్నారు. దేశంలో రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ ఫిబ్రవరి 19న రెడ్డీస్ ల్యాబొరేటరీ దరఖాస్తు చేసుకోగా.. ఇవాళ ఆమోదం ల‌భించింది.

author avatar
sridhar

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!