NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎండ‌ల ఎఫెక్ట్… ఏపీ పాలిటిక్స్‌లో ఈ చిత్రం చూశారా..?

ఒక‌వైపు కీల‌క‌మైన ఎన్నిక‌లు. అంతేకాదు.. పోటీ కూడా తీవ్రంగా ఉంది. ఏ క్ష‌ణం వేస్ట్ చేసినా ఇబ్బందు లు త‌ప్ప‌వు. కాలికి బ‌లపం క‌ట్టుకుని ఇంటింటికీ ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక‌, ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు రోడ్ షోలు, స‌భ‌లు స‌మావేశాలు పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. వీటిని మ‌రింత పెంచాల్సిన అగత్యం కూడా పార్టీల‌కు ఉంది. ఇది నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. మ‌రోవైపు.. ఠారెత్తిస్తున్న ఎండ‌లు నాయ‌కుల‌కు గుబులు రేపుతున్నాయి.

ప్ర‌స్తుతం ఏప్రిల్ నెలే అయినా.. ఎండ‌లు మాత్రం మండిపోతున్నారు. ప‌లు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్ర‌త లు న‌మోద‌వుతున్నాయి. దీంతో జ‌నాలు ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేక పోతున్న ప‌రిస్థితి ఉంది. ఇది నాయ‌కుల‌కు, పార్టీల‌కు ఇబ్బందిగా మారింది. వాతావ‌ర‌ణం కూలెక్కేందుకు సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు వేచి చూడాల్సిన ప‌రిస్థితి. పోనీ.. అప్పుడైనా స‌భ‌ల‌కు, స‌మావేశాల‌కు త‌ర‌లిద్దామంటే.. కూడా ఇబ్బందు లు వ‌స్తున్నాయి.

ఈ ప‌రిస్థితి వైసీపీ నుంచి టీడీపీ వ‌ర‌కు అన్ని పార్టీల‌ను వెంటాడుతోంది. దీంతో ఉద‌యం పూట చంద్ర బాబు వీడియో కాన్ఫ‌రెన్స్‌ల ద్వారా పార్టీ నాయ‌కులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక‌, జ‌గ‌న్ బ‌స్సుకే ప‌రిమి తం అయ్యారు. బీజేపీ, జ‌న‌సేన వంటివి ఏదైనా హాల్ చూసుకుని.. అక్క‌డ‌కు నాయ‌కుల‌ను ర‌ప్పించి.. ప్ర‌సంగాలు దంచి కొడుతున్నారు. కానీ, ఇవి క్షేత్ర‌స్థాయిలోకి వెళ్ల‌డం లేదు. పోనీ.. ఇలా చేసుకున్నా ఎన్నాళ్లు? అనేది కీల‌క ప్ర‌శ్న‌. మ‌రో 30 రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి.

దీంతో అన్ని పార్టీల నాయ‌కులు కూడా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఎండ‌ల దెబ్బ‌కు పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ దెబ్బ‌తింటోంద‌ని అన్ని పార్టీల్లోనూ చ‌ర్చ సాగుతోంది. దీనికి విరుగుడు క‌నిపెట్ట‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఇంటింటి ప్ర‌చారంపై ఎన్నిక‌ల సంఘం స‌మ‌యం నిర్దేశించింది. ఉద‌యం 8 త‌ర్వాత కానీ.. ఇంటింటి ప్ర‌చారానికి అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని.. అది కూడా 48 గంట‌ల ముందు ప‌ర్మిష‌న్ తీసుకోవాల‌ని చెబుతున్నారు. కానీ, ఉద‌యం 7గంట‌ల‌కే ప‌నుల‌కు వెళ్లిపోయే కుటుంబాలు ఎక్కువ‌గా ఉన్నాయి. గ‌త ఎన్నికల స‌మ‌యంలో ఇంత పెద్ద ఇబ్బంది లేదు. ఏప్రిల్‌లోనే ఎన్నిక‌లు ముగిసిపోయాయి. కాని..ఇప్పుడు షెడ్యూల్ మారడంతో ఇబ్బందులు మామూలుగా లేవ‌నే చ‌ర్చ సాగుతోంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju